Suryaa.co.in

Andhra Pradesh

నడి రోడ్డుపై చంపేస్తామంటూ నాడు బెదిరింపులు

• నేడు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఫిర్యాదు
• వినతులతో తరలివచ్చిన అర్జీదారులు
• స్వీకరించి పరిష్కారానికి వెంటనే సంబంధిత అధికారులు, నాయకులకు ఫోన్లు చేసిన నేతలు

మంగళగిరి: మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే నడిరోడ్డుపై చంపి కాలువలో పడివేస్తామని తనను బెదిరించారని.. తమ భూమి లాక్కుని ఇబ్బంది పెడుతున్నారని… నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భయం వీడి బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నానని.. ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం వేలగలేరు గ్రామానికి చెందిన కొవ్వూరి భాస్కరరెడ్డి మంగళగిరి టీడీజీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు తోట సీతారామాలక్ష్మిల ముందు అర్జీని అందిస్తూ వాపోయాడు.. తనకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

చిత్తూరు జిల్లా వేనుగోపాలపురం మండలం పెనమలూరు గ్రామం వడ్డెర కమ్యూనిటీకి చెందిన ఇంటర్ చదివే అమ్మాయిని మాజీ ఉపముఖ్యమంత్రి అయిన నారాయణ స్వామి బంధువులు బందించి అత్యాచారం చేసి అతి దారుణంగా 29/09/2.23న చంపారని… దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును తప్పుదారి పట్టించారని…వడ్డెర సమాజిక వర్గముకు చెందిన భవ్యశ్రీకి జరిగిన అన్యాయంపై నేరస్తులను శిక్షించాలని… టీడీపీ రాష్ట్ర బీజీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లెపు మునుస్వామి వినతి పత్రం అందించారు.

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం తంగుడుబిల్లి గ్రామానికి చెందిన పోతల రాజప్పన్న విజ్ఞప్తి చేస్తూ… రణస్థం నుండి రామ తీర్థం వరకు ఉన్న కేఆర్ రోడ్డు ఎప్పుడో 14 సంవత్సరాల క్రీతం నిర్మించారని… నేడు ఆరోడ్డు గుంతలతో అధ్వానంగా ఉందని… ఆరోడ్డులో వెళ్లాలంలే ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని. దయ ఉంచి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రీవెన్స్ వినతిపత్రం అందించారు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలానికి చెందిన మహిళ పార్వతి పొట్టకూటికోసం 2013 లో దుబాయి వెళ్లిందని.. ఆమె ఏమైందో ఆమె జాడ తెలియలేదని.. దయ ఉంచి ఆమెను ఇండియాకు తిరిగి రప్పించగలరని ఆమె బందువు కోటేసు విజ్ఞప్తి చేశాడు.

తన భర్త జీవనోపాధికి ఇతర దేశాలకు వెళ్లి అక్కడ ప్రమాదవశాస్తు మరణించాడని… తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని తనకు జీవనోపాధ లేదని కుమారుల విద్యభఇవృద్ధకి సాయం చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గూట్లపాడు గ్రామానికి చెందిన తిరుమాని అనంత లక్ష్మి విన్నవించారు.

మాచర్ల నియోజకfర్గం కంభంపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త మరో పెళ్లి చేసుకోవవడానికి తనను విడాకులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నాడని… దానిపై కేసు కోర్టులో ఉందని… అధికారులు నాయకులకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడని. తనకు న్యాయం చేయాలని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

టీడీపీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తుతున్న అర్జీలను చూస్తుంటే గత ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందని స్పష్టం అవుతోంది. భూ సమస్యలు, పింఛన్ సమస్యలు, రోడ్ల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, అక్రమ కేసులు, బిల్లులు రాని వారు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆడబిడ్డలపై హత్యాచారాలు హత్యలు, ఇలా వందల సంఖ్యలో వినతులు వస్తుండటంతో టీడీపీ నేతలు వాటిని ఓపిగ్గా వింటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

LEAVE A RESPONSE