– స్వర్ణాంధ్రకు బాటలు వేస్తున్న చంద్రబాబు నాయకత్వం
– స్వర్ణాంధ్ర పీ-4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మళ్లీ వేగం పుంజుకుంది. గత ఐదేళ్ల ఘోర విధ్వంసం నుండి బయటపడి, రాష్ట్రం మళ్లీ అభివృద్ధి బాట పట్టిందనడానికి చంద్రబాబు నాయుడు వెల్లడించిన ఆర్థిక గణాంకాలే నిదర్శనం అని స్వర్ణాంధ్ర పీ-4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ సి.కుటుంబరావు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
2019-2024 మధ్య జగన్ పాలనలో రాష్ట్ర జీఎస్డీపీ రూ.7 లక్షల కోట్లకు పైగా నష్టపోయింది. ప్రతి సంవత్సరం లక్ష-లక్షన్నర కోట్లు పెరగాల్సిన జీఎస్డీపీ తగ్గిపోవడంతో రాష్ట్ర సొంత ఆదాయంలో రూ.70 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. గత ప్రభుత్వం సక్రమంగా పనిచేసి ఉంటే ఈ ఐదేళ్లలో అదనంగా రూ.72 వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు వచ్చేవి.
తులనాత్మకంగా ఆర్థిక పరిస్థితులు
తెలంగాణతో పోల్చితే తేడా మరింత స్పష్టమవుతుంది. 2014-19 మధ్య ఏపీ జీఎస్డీపీ వృద్ధి రేటు 13.21 శాతం కాగా, తెలంగాణది 13.5 శాతం. అయితే జగన్ పాలన రాగానే 2019-24 మధ్య ఏపీ జీఎస్డీపీ వృద్ధి రేటు 9.1 శాతానికి పడిపోయింది. తెలంగాణ 11 శాతం వృద్ధితో దూసుకెళ్లింది. ఫలితంగా తలసరి ఆదాయంలో ఏపీ రూ.2.66 లక్షల వద్దే ఉండగా, తెలంగాణ రూ.3.87 లక్షలకు చేరింది. 2014లో టీడీపీ ప్రభుత్వం రూపొందించిన ‘స్వర్ణాంధ్ర విజన్-2047’ ప్రకారం 2047 నాటికి రాష్ట్ర జీఎస్డీపీ 18 రెట్లు పెరిగి రూ.292 లక్షల కోట్లకు, తలసరి ఆదాయం రూ.49 లక్షలకు చేరాల్సి ఉండగా, ఐదేళ్ల జగన్ దుర్మార్గ పాలన వల్ల ఆ కల నెరవేరే అవకాశమే లేకుండా పోయింది.
చంద్రబాబు నేతృత్వంలో ఆర్థిక పురోగతి
చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వచ్చి 18 నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారు. వ్యవసాయ రంగంలో 34-35 శాతం జీఎస్డీపీ లక్ష్యానికి ఇప్పటికే 65 శాతం చేరుకున్నాం, మిగతా 35 శాతం రెండు క్వార్టర్లలోనే పూర్తవుతుంది. పరిశ్రమల రంగంలో 45 శాతం టార్గెట్ సాధించాం, మిగతాది కూడా త్వరలోనే. సేవల రంగం (ముఖ్యంగా ఐటీ, టూరిజం, లాజిస్టిక్స్) టార్గెట్‌ను మించి రాబోతోంది.
విశాఖను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయడం, ఏపీ లాజిస్టిక్ కార్పొరేషన్‌ను స్ట్రీమ్‌లైన్ చేయడం, దేశంలోనే అతి తక్కువ లాజిస్టిక్ ఖర్చుతో పాయింట్-టు-పాయింట్ సేవలు అందించేలా ప్రణాళికలు రచించడం జరుగుతోంది. గత ప్రభుత్వం చేసిన నష్టం ఎంత ఘోరమైనదంటే – జల్ జీవన్ మిషన్, అమృత్, స్మార్ట్ సిటీ, పీఎం ఆవాస్, పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం, రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీలను బ్లాక్మెయిల్ చేసి పీపీఏలు రద్దు చేయడం, పరిశ్రమల వేత్తలను బెదిరించి పెట్టుబడులు పారిపోయేలా చేయడం జరిగింది.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పాలిసీ స్టబిలిటీ పూర్తిగా కుప్పకూలాయి. కానీ చంద్రబాబు నాయుడుగారు రాగానే ఆ దుస్థితి మారిపోయింది. రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షణ, గ్రీన్ ఎనర్జీలో దేశంలోనే అగ్రస్థానం, విమానయాన రంగంలో దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు, గ్రానైట్ ఉత్పత్తి 50 శాతం, మైనింగ్ 12 శాతం పెరుగుదల – ఇవన్నీ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలే.
అప్పుల ఊబిలో మునిగిన రాష్ట్రాన్ని బయటపడేసి, యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తూ, మూడు రంగాల్లోనూ (వ్యవసాయం-పరిశ్రమలు-సేవలు) సమతుల్య అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ, చంద్రబాబు నాయకత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్రంలో మోదీజీ ఏ విధంగా భారత్‌ను ముందుకు తీసుకెళ్తున్నారో, అదే విధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా మారుస్తున్నారు. ఈ విజయాలకు కారణం చంద్రబాబు విజన్, స్పష్టమైన ప్రణాళిక, పటిష్ఠమైన నాయకత్వం