Suryaa.co.in

Andhra Pradesh

లక్షలాది కోట్ల అప్పులతో ఏపీ ఆర్ధిక వ్యవస్థ కుదేలు

-దయనీయంగా మారిన ప్రజాజీవనం
– భారాస ఎపిచీఫ్ డాక్టర్ తోట

అభివృద్ధి శూన్యం అప్పులు ఘనం అన్న చందంగా ఎపి లో వైకాపా ప్రభుత్వ అసమర్ధ పాలన కొనసాగుతోందని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు.హైదరాబాద్ లోని భారాస క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డాక్టర్ తోట మాట్లాడుతూ లక్షలాది కోట్ల అప్పులతో ఎపి ఆర్ధిక వ్యవస్థ కుదేలైందని ఆందోళన వ్యక్తం చేశారు.

విపరీతంగా పెరిగిన నిత్యావసర ధరలతో పేద, మద్య తరగతి ప్రజలు జీవించలేని దయననీయ పరిస్థితిలు ఇక్కడ నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.జగన్ సీఎం గా గద్దేనెక్కిన నాటి నుండి పరిమితికి మించి అప్పులు తెచ్చి ఎపిని అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మార్చారని ఎద్దేవా చేశారు.సంక్షేమ పధకాల పేరుతొ ప్రజల కళ్ళకు గంతలు కట్టి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు.

ఓ వైపు నిరుద్యోగ యువత ఉపాధి అవకాశలు లేక పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్తుంటే చూస్తూ మిన్నకుండి పోవడం ఇక్కడి పాలకుల వంతైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం లోకి వచ్చిన ఏడాది నుండే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రగల్బాాలు పలికిన సీఎం వాగ్ధానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెల జీతాల కోసం ఎదురు చూడాల్సిన దుర్భర పరిస్తితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. మాట తప్పను మడెం తిప్పను జగన్ మాటలు నీటి మూటలే అని మరో మారు నిరూపించాయన్నారు.

ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టి ప్రజలకు అభివృద్ధి తో కూడిన సంక్షేమ పాలన అందించకుంటే రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పెందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. తాజాగ విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెద్ద మేడపల్లి గ్రామం కి చెందిన మాదిరెడ్డి జగన్ సహ పలు జిల్లాకి చెందిన నాయకులు, కార్యకర్తలు తోట సమక్షంలో భారీగా BRS తీర్ధం పుచ్చుకున్నారు.

LEAVE A RESPONSE