Suryaa.co.in

Andhra Pradesh

సంక్షోభంలో ఆక్వా రైతులు

– మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

ఆక్వా రైతులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు మీ కోసం…!

జగన్ పాలనలో ఆక్వా రంగం తిరోగమనం పాలైంది. టీడీపీ హయాంలో ఆక్వా రంగం ప్రధాన ఆదాయ వనరుగా రూపొందింది. నేడు ఆక్వాకు ఉన్న మద్దతు ధరను రూ.240 నుంచి తమ లూటీ కోసం రూ.210కి కుదించారు. జగన్ రెడ్డి అసమర్థతతో ఆక్వా రంగాన్ని కుదేలు చేశారు. ప్రభుత్వం ఆక్వా రైతుల పొట్ట కొడుతోంది. సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన అవసరముంది. ఆక్వా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. టమోటా రైతుల పరిరక్షణకు ఒక వ్యవస్థను నెలకొల్పాలి. సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన జగన్ రెడ్డి… వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ప్రతిపక్ష టీడీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

ఆక్వాకు మద్దతు ధరపై మంత్రుల కమిటీ మొదట నిర్ణయించిన రూ.240 నుంచి తమ లూటీ కోసం రూ.210కి కుదించడం జగన్ రెడ్డి అసమర్థతకు నిదర్శనం. ఆక్వా రైతుల సమస్యలపై శాంతియుతంగా పోరాటం చేసిన టీడీపీ నేతలను అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేయడం అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనం. చంద్రబాబు గారి హయాంలో దేశంలోనే అగ్రభాగాన ఉన్న ఆక్వారంగం నేడు జగన్ రెడ్డి పాలనలో పతనావస్థకు చేరింది. మద్దతు ధర లభించక ఆక్వా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. షరతుల పేరుతో సబ్సీడీలు ఎత్తివేసి, జే ట్యాక్స్ తో ఆక్వా రైతులను దోచుకుంటున్నారు. ప్రశ్నించిన వారిని అణచివేయాలనే మీ కుట్రలు సాగబోవని హెచ్చరిస్తున్నాం. సంక్షోభంలో ఆక్వా రైతు. రాష్ట్రంలో రొయ్య రైతులు విలవిలలాడుతున్నారు. 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.240 మద్దతు ధర అంటూ జగన్ రెడ్డి నియమించిన మంత్రుల కమిటీ.. తమ దోపిడీ కోసం మళ్లీ తామే సవరించి రూ.210కి తగ్గించారు. ఈ ధర కూడా రైతులకు దక్కడం లేదు.

ప్రస్తుతం రూ.180 లోపే ఉంది. దీంతో కేజీకి రూ.60 వరకు రైతులు నష్టపోతున్నారు. పెరిగిన పెట్టుబడులు, మేత, మందుల ధరలు, నాణ్యత లేని సీడ్‌, వైరస్‌ ప్రభావం నుంచి పంటను కాపాడుకుని దిగుబడులు సాధిస్తే పతనమైన ధరలతో తీవ్రంగా నష్టపోతున్నారు. రొయ్య రైతులకు యూనిట్ విద్యుత్తును రూ.1.50 చొప్పున సరఫరా చేస్తామన్న జగన్ రెడ్డి రెండేళ్లకే మడమ తిప్పారు. జగన్ రెడ్డి పాలనలో అన్నదాతలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. పంటలకు మద్దతు లేదు, పంట నష్టపోయిన వారికి పరిహారం అందలేదు, రైతు భరోసా రైతు దగాగా మారింది.

అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే రెండో స్థానంలో ఏపీ ఉంది. ఎక్కువ అప్పులున్న కుటుంబాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసి ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి జగన్ రెడ్డి చేతులెత్తేశారు. టమోట పంటకు మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నా జగన్ రెడ్డి పట్టించుకోవడం లేదు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ లో కిలో టమోట ధర రూ.1కి పడిపోయింది. ఉల్లి పరిస్థితీ దిగజారింది. కర్నూలులో కిలో ఉల్లి రూ.6కి పడిపోయింది. రైతులు తక్కువ ధరకే పంట అమ్ముకునేదాక జగన్ రెడ్డి ఏం చేస్తున్నారు. ఉల్లి రైతుకు మద్దతు ధర క్వింటాకు రూ.770 ఉన్నా ఈ ధరకు ఎక్కడా కొనుగోలు చేయడం లేదు. వేరుశనగ పంటకూ మద్దతు ధర లభించడం లేదు. క్వింటాకు మద్దతు ధర రూ.5,850 ఉంటే.. రూ.5,200కి మాత్రమే రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి ఉంది. సజ్జ మద్దతు ధర క్వింటాకు రూ.2,350 ఉంటే ప్రసుతం మార్కెట్ ధర రూ.2వేలే దక్కుతోందని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE