అరవ కామాక్షి 2022లో గంజాయి కేసులో పట్టుబడితే అప్పుడెందుకు సాక్షిలో, వైకాపా సోషల్‌మీడియా పేజీలలో వెయ్యలేదు? ఒక జాతీయ ఆంగ్ల మీడియా ఈ వార్త వేసింది అప్పట్లో. డిసెంబర్ 13, 2022న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో పోలీసులు ఒక భారీ గంజాయి అక్రమ రవాణా రాకెట్‌ను విజయవంతంగా భగ్నం చేశారు. నెల్లూరు పోలీసులు, ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ), వన్ టౌన్, టూ టౌన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో పది మంది నిందితులను అరెస్టు చేశారు.
వారి నుండి 26 కేజీల గంజాయి, రెండు కార్లు, ఆరు మొబైల్ ఫోన్లతో సహా మొత్తం రూ. 12.60 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు ఎస్పీ సీహెచ్ విజయరావు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ముఠా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుండి కేజీ గంజాయిని రూ. 10,000 చొప్పున కొనుగోలు చేసి, దానిని నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాల్లో రూ. 15,000 ధరకు విక్రయిస్తున్నారు. అరెస్టు చేసిన నిందితుల్లో షేక్ సుభాని, షేక్ జమీర్, షేక్ షఫీ, అరవ కామాక్షి తదితరులు ఉన్నారు. ఈ అక్రమ రవాణాకు ప్రధానంగా సరఫరా చేసిన వ్యక్తులను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. అప్పుడే ఆమెకు శిక్ష వేసి ఉంటే ఇవ్వాళ ఇన్ని మర్డర్లు చేయించేది కాదు కదా? 2023లో ఆమెను పార్టీలోకి ఆహ్వానించి ఫ్లెక్సీలు కట్టించి అట్టహాసంగా చేర్చుకుంది వైకాపా. వైకాపా వచ్చి ఉంటే ఆ ఏరియా కార్పొరేటర్ని చేసేవారేమో! అరవ కామాక్షి గంజాయి, మర్డర్లే కాకుండా మంచి రీల్స్ కూడా చేయించుకునే అభిరుచి ఉంది.
– చాకిరేవు