– విశాఖ గ్రీన్ పార్క్ హోటల్ దగ్గర మద్యం షాపుల ముందు తెలుగు మహిళలు వినూత్న నిరసన
తెలుగు మహిళ పార్లమెంటరీ అధ్యక్షురాలు అనంత లక్ష్మీ మాట్లాడుతూ.. సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలని కోరుతూ..మద్యం షాపుల ముందు బాటిల్స్ బద్దలు కొట్టిన తెలుగు మహిళలు . నాసిరకం మద్యంతోప్రజల ప్రాణాలు పోతున్నాయి.. మద్యపానం నిషేధం వెంటనే అమలు చేయాలి.
మహిళల తాళిబొట్టులు తెగుతున్నా… నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు పోతుంటే ఎమ్మెల్యే రోజా ఎందుకు మాట్లాడరు? ప్రజా ప్రయోజనాలు కంటే… రోజాకి జబర్ధస్ట్ షో లు ముఖ్యమా?
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను తుంగలో తొకరని మాట ఇచ్చి మడం తిపరని సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాము అని చెపిన ముఖ్యమంత్రి, ఈరోజు మద్యపాన
నిషేధం వదిలేసి మళ్ళీ మూడు వందల మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చారని మండిపడ్డారు. సంపూర్ణ మద్యపానం అమలు చేయాలని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద మద్యం బాటిల్స్ పగలకొట్టి నిరసన తెలియచేసారు.
డిజిటల్ ఇండియా పేరుతో కాగితరహిత దేశంగ మన దేశం ఎదుగుతుంటుంటే, జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎ.టి.ఎమ్, కానీ యుపీఐ పేమెంట్స్ కానీ లేకుండా మద్యం దుకాణాల్లో అమ్మిన సొమ్మంతా జగన్మోహన్ రెడ్డి ఇంటికి తరలిస్తున్నారని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి ఈతల పాకసుజాత, మహిళలు గోడిఅరుణ, గణ గళ్ళ సత్య, ఉమ రాణి, మధులత, అప్పలనారసమ్మ, ఉమా, లక్ష్మి లావణ్య, గృహలక్ష్మి, సౌజన్య, మహిళ కార్యకర్తలు పాల్గొన్నారు.