– దేశానికి కూడా అప్పు ఉంది
– పాలన చేత కాక కాంగ్రెస్ నేతల పిచ్చి మాటలు
– మేము అప్పు తెచ్చాము ..కరెంటు ఇచ్చాము
– కాంగ్రెస్ ఏలిన రాజస్థాన్ లో 89 వేల కోట్ల రూపాయల అప్పుల్లో విద్యుత్ సంస్థలు
– మేడి గడ్డలో మంత్రులు మంత్రుల్లాగా కాదు రౌడీ ల్లా మాట్లాడారు
– మాజీ మంత్రి,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చిఇరవై ఐదు రోజుల పైనే అవుతుంది. పథకాలు ఎపుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తుంటే, అప్పులు అప్పులు అని పాడిందే పాడుతున్నారు. అసెంబ్లీ లో శ్వేత పత్రాలు పెట్టారు మేము సమాధానం చెప్పాం. ఈ రోజు డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి జిల్లా పర్యటనలో అవే అప్పుల గురించి చెబుతున్నారు.
మేము ప్రతిదీ అంకెలు అంకెలు తేట తెల్లంగా చెప్పాం. కరెంటు రంగం లో మేము సాధించిన ప్రగతి ఇప్పటికే వివరించాము. అప్పు లేని రాష్ట్రాలు దేశం లో ఉన్నాయా? దేశానికి కూడా అప్పు ఉంది. మొన్నటి దాకా కాంగ్రెస్ ఏలిన రాజస్థాన్ లో 89 వేల కోట్ల రూపాయల అప్పుల్లో విద్యుత్ సంస్థలు ఉన్నాయి. ప్రతిపక్షం లో మా అప్పుల గురించి చెప్పారు . ఇపుడు అదే చెబుతున్నారు. దేశం లో విద్యుత్ సంస్థలు అన్నీ అప్పులు ,నష్టాల్లోనే ఉన్నాయి.
అప్పు చేశామో.. ఏం చేశామో.. ప్రజలకు మేము కరెంటు కష్టాలు లేకుండా చేశాము. పాలన చేత కాక కాంగ్రెస్ నేతలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మేనేజ్ మెంట్ చేతకాక అప్పుల గురించి మాట్లాడుతున్నారు. 2014 విద్యుత్ రంగం లో మీరు మిగిల్చిన అప్పు 22 వేల కోట్లు ..అయినా 3 గంటలు కరెంటు ఇవ్వలేక పోయారు. అదే అప్పు ఇపుడు నాలుగు రెట్లు అయ్యింది. మేము అప్పు తెచ్చాము ..కరెంటు ఇచ్చాము.
అప్పుల గురించి మీరు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. అప్పు సాధారణ విషయం ..చేత కాక పాడిందే పాడుతున్నారు. అప్పు తీర్చడం చేత కాక పోతే అప్పు తెచ్చిన సంస్థలకే విద్యుత్ సంస్థలను అప్పగించండి ..వారు నడుపుతారు. ఇంకెన్ని రోజులు కాంగ్రెస్ నేతలు అబద్దాలతో బతుకు వెల్లదీస్తారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు సబ్ క్రిటికల్ టెక్నాలజీ గురించి భట్టి పదే పదే మాట్లాడుతున్నారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీ ని ఇప్పటికీ కూడా 30 కి పైగా విద్యుత్ ప్రాజెక్టు లు నడుస్తున్నాయి. చట్టం లోనే తర్వాత సబ్ క్రిటికల్ టెక్నాలజీ ని మార్చుకోవచ్చని ఉంది ..మేము ఫాలో అయ్యాం. గతం లో ఇదే విషయాన్ని అసెంబ్లీ లో చెప్పాము.
భట్టి లేని సమస్యను పెద్దదిగా చూపే ప్రయత్నము చేస్తున్నారు. దేశంలో 24 గంటల కరెంటు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే. లంకె బిందెల గురించి సీఎం మాట్లాడుతున్నారు. రాజస్థాన్ ,ఛత్తీస్ ఘడ్ లలో కాంగ్రెస్ అధికారం పోయింది ..లంకె బిందెలు అప్ప జెప్పి పోయారా? కేసీఆర్ సీఎం గా లేని లోటు ను ప్రజలు అపుడే చర్చించుకుంటున్నారు. ప్రజా పాలన దరఖాస్తు లో అకౌంట్ నంబర్ ఇవ్వాలని ఎందుకు అడగ లేదు అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నిన్న మేడి గడ్డలో మంత్రులు మంత్రుల్లాగా కాదు రౌడీ ల్లా మాట్లాడారు. వారి తీరు అసెంబ్లీ లో అలాగే ఉంది బయట అలాగే ఉంది. విద్యుత్ రంగాన్ని గొప్పగా తీర్చి దిద్దిన ప్రభాకర్ రావు ను అసెంబ్లీ లో దుర్భాష లాడారు సభ లో లేని వ్యక్తి పై నిందలు వేశారు. మేడి గడ్డ లో కూడా మంత్రులు ఇంజినీర్ల పై అ మర్యాద గా ప్రవర్తించారు.
సీఎం, మంత్రులు చిల్లర గా మాట్లాడుతున్నారు. మేము మా నిజాయతీని ని రూపించుకునేందుకు ఇప్పటికే న్యాయ విచారణ కోరాం. కాంగ్రెస్ నాయకులకు పాలన చేత కాక పోతే ఆ విషయం చెప్పాలి. పదేపదే భట్టి అప్పుల గురించి మాట్లాడటం మాని తన శాఖ పై దృష్టి పెట్టాలి.