-సీమ అభివృద్ధి మీద జగన్ శ్వేతపత్రం విడుదల చేయగలరా ?
-పెద్దిరెడ్డి శ్రీబాగ్ ఒడంబడిక వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు
-జగన్ , పెద్దిరెడ్డి, చంద్రబాబు ఆస్తులు పెంచుకొని సీమ ప్రజలను వలస పోయేలా చేశారు
-సీమ గురించి మాట్లాడాలి అంటే అది బిజెపి కి మాత్రమే హక్కు
-సీమ ప్రజలు భుజాల మీద ఎక్కువ కాలం ఎక్కించుకొన్నది మిమ్మల్ని కదా ? అలాంటి సీమకు ఏమి వొనగూర్చారు
-బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు
పంచాయతీ నుండి పార్లమెంట్, అనేక సంవత్సరాలుగా ముఖ్యమంత్రులుగా చంద్రబాబు గారు ,మరియు YS కుటుంబాల వారే కదా పదవులు అనుభవిస్తున్నది , చంద్రబాబు సీమకు అన్యాయం చేశాడు అన్న ఉద్దేశంతో మీకు 52 అసెంబ్లీ స్థానాలకుగాను 49 స్థానాలు గెలిపించి అధికారం కట్ట బెట్టితే మీరు చేసున్నది నయవంచన కాదా ? ముఖ్యమంత్రి అయ్యి పుణ్యకాలం పూర్తి అవుతున్న తరుణంలో ఏమి చెయ్యకుండా ,వచ్చే 2024 ఎన్నికల వరకు మభ్యపెట్టడానికి సీమ వాదం ఎత్తుకొంటారా ?
సీమ పేరు చెప్పి పబ్బంగడుపుకొంటున్న స్వయం ప్రకటిత మేధావులు, నిరంతరం మీడియా ముందుకు వచ్చే నాయకులు YSR కుటుంబం అధికారంలో వుంటే కలుగులో దాక్కొంటారు , సీమను ప్రజలు ఎదురు చూస్తున్న గాలేరు -నగిరి , హంద్రి -నీవా , గుండ్రేవుల , వేదవతి , సిద్దేశ్వరం అలుగు వంటి వాటిని గాలికి వదిలేసాడు చివరకు అనంతపురం జిల్లా నందు వున్న భైరవాని తిప్ప లాంటి అతిచిన్న ప్రాజెక్టుకు 200 కోట్లు వెచ్చిస్తే 20 వేల ఎకరాలకు సాగు , మూడు మండలాలకు త్రాగు నీరు వస్తుంది దాన్ని నిర్మించడానికి కూడా అమరావతి రాజధానితో సంబంధమా ? కొత్తవి కట్టలేకపోవడమే కాదు , వున్న అన్నయ్య ప్రాజెక్టు లాంటివి సైతం కొట్టుకొనిపోవడానికి కారకులు మీరు కాదా ? బాధితులకు ఇప్పటికి కూడా నిలువ నీడ లేని పరిస్థితి, వారి గోడు వర్ణనాతీతం , వీటిమీద ఏనాడైనా రాయలసీమ వాదులు గొంతెత్తారా ? భూమన్ కరుణాకర్ రెడ్డి పుట్టిన ప్రాంతంలో ప్రాజెక్టు ను కనీసం సందర్శించాడా ? ప్రాజెక్టు కొట్టుకుపోవడం వల్ల సర్వం ప్రజలు కోల్పోతే కనీసం సీమవాదులుగా చెప్పుకొనే మీరు బాధితులను ఒక్కరోజైనా పరామర్శించారా ? చివరకు రాజశేఖర్ రెడ్డి గారి స్వప్నం కడప- బెంగుళూరు రైల్వే లైను కేవలం 300 కోట్లు వెచ్చిస్తే పూర్తి అవుతుంది అలాంటి దానిని అటకెక్కించింది మీరు కాదా ? శ్రీకాళహస్తి -నడికుడి రైల్వే లైను పూర్తి చేయకపోవడానికి కారకులు మీరు కాదా
సీమలో 20 ఎకరాల ఆసామి బిడ్డ బెంగళూరు , హైదరాబాద్ , చెన్నై , లాంటి నగరాలలో కాపలా దారులుగా వుంటున్న స్థితికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు. స్వయంగా మీరు శంకుస్థాపన చేసిన ఉక్కు పరిశ్రమ ఏమైంది ? మీ హయంలో చెప్పుకోదగ్గ ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తీసుక వచ్చి 2000 వేలమంది ఉపాధి కల్పించామని గుండెలమీద చేయి వేసుకొని చెప్పగలరా ? సీమ ప్రజలను మోసగించాలనే ప్రయత్నము భూమన్ కరుణాకర్ రెడ్డి గారు భుజాన వేసుకోవడం భావ దారిద్యం కాదా. భూమన్ గారు , చిత్తూర్ కి కేటాయించిన NIMZ కి స్థలం కేటాయించక పోవడం చేత 5 లక్షల మందికి ఉపాధి కోల్పోయారన్న స్పృహ వుందా ,ఇలాంటి సమస్యల మీద ఒక్కరోజన్నా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించి సీమ బిడ్డ అనిపించుకొన్నావా ?
బిజెపి ఓట్లు, సీట్లు లేకపోయినా మొదటి నుండి సీమ అభివృద్ధి కోసం పాటుపడుతోంది. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ఎత్తు పెంచాలని జూపాడు బంగ్లా వద్ద వెంకయ్య నాయుడు గారు దీక్షలు నుండి శాంతి కోసం నీటి కోసం చిలకం రామచంద్ర రెడ్డి గారి పాదయాత్ర కారణంగా పాలకుల మీద వత్తిడి పెరిగింది, తుపాకి గొట్టాల సంస్కృతీ పోయింది .. సీమ సమస్యల పోరాటం సందర్భంగా కేశవ్ చౌదరి లాంటి సీనియర్ నాయకుడిని కోల్పోయాము. నేడు NDA అధికారం లోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు iieser , iim , iit , లాంటి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలు , అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ , కర్నూల్ ఉర్దూ యూనివర్సిటీ , సోలార్ పార్క్ , DRDA పరిశోధన కేంద్రం , చేనై -బెంగళూరు , వైజాగ్ – చేనై. ఇండస్ట్రియల్ కారిడార్ , హజ్ హౌస్,ఎలక్ట్రానిక్ మ్యానిఫేక్చర్ యూనిట్ లాంటి సంస్థలే కాకుండా ! ఏ ప్రాంతం అయ్యినా వేగంగా అభివృద్ధి చెందాలంటే దానికి కనెక్టయివిటి ముఖ్యం కాబట్టే జాతీయ రహదారులతో పాటు ,నూతనంగా కర్నూల్ , కడప విమానాశ్రయం నిర్మాణం మరియు తిరుపతిని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్పు లాంటి చెప్పలేనన్ని అవకాశాలను ఈ ప్రాంతానికి అందిస్తున్నది! మొదటి నుండి బిజెపి హైకోర్టు రాయలసీమ లో పెట్టాలని ఉద్యమాలు ,పార్టి పరంగా తీర్మానాలు చేసి , చంద్రబాబు మరియు మీ ప్రభుత్వం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా వత్తిడి తెస్తూనే వున్నాము , ప్రతిపక్షంలో ఉన్నపుడు మీరు హైకోర్టు కొరకు అసెంబ్లీ లో కానీ లేదా పార్టి పరంగా ఉద్యమించింది లేదు , నేటికి మీరు చెప్పే హైకోర్టు కోసం కనీసం సుప్రీమ్ కోర్టు కొలీజియంతో సంప్రదింపులు కూడా ప్రారంభించక పోవడంతోనే అర్థం అవుతున్నది , మీ చిత్త శుద్ధి లేమి.
చివరకు సీమ రైతులు ఎక్కువగా బిందు సేద్యం మీద ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు .అలాంటి రాయితీతో కూడిన పరికరాలు సైతం అందజేయకుండా రైతులను అప్పులపాలు జేస్తున్నారు , సీమను ఉద్యానపంటల కేంద్రంగా మార్చుతానన్న జగన్ మాటలు నీటి మూటలయ్యాయి , ఇలాంటి వైపల్యాలనుండి బయట పడడానికి మీరు మరోసారి ప్రాంతాల మధ్య విద్వేశాలను నింపాలనుకోవడం బాధాకరం. కాబట్టే సీమ గొంతు తడి కొరకు 200 టిఎంసి ల క్రిష్ణా నికర జలాలు కావాలని ఉద్యమిస్తే మిమల్ని ప్రజలు విశ్వసిస్తారు లేకపోతె అప్పటివరకు ప్రజల దృష్టిలో సీమ ద్రోహులే కాబట్టే సీమ ప్రజలు మిమ్మల్ని బూచోలొస్తున్నారు తస్మాత్ జాగ్రత్తగా వుండాలని , మరోసారి మోసపోకుండా ఉండాలని భావిస్తున్నారు .