వాట్సాప్‌లో వచ్చిన పెళ్లి పత్రిక డౌన్‌లోడ్ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త మీ అకౌంట్లలో డబ్బులు పోయినట్టే. ఇటీవల కాలంలో డిజిటల్ ఆహ్వాన పత్రికలు, వీడియోలు, వేడుక జరిగే ప్రాంతాన్ని సూచించే గూగుల్ మ్యాప్స్ లింక్‌ను వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డాక్యుమెంట్లు, వీడియోలు, లింకులు పంపుతారు.
దీన్నేఅదునుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు మన ఫోన్లకు కూడా లింకులు పంపుతుంన్నారు.. అయితే వాటిని ఎవరు పంపారన్న ఆసక్తితో మనం క్లిక్ చేస్తాం. దీంతో మన ప్రమేయం లేకుండానే ఫోన్‌లోకి ఏపీకే ఫైల్ రూపంలో ఉండే యాప్ డౌన్‌లోడ్ అవుతాయి. వీటి ద్వారా మన గ్యాలరీ, యాప్‌లలోని డేటా సహా అన్ని రకాల అనుమతుల్ని ఈ మాల్‌వేర్ దానంతట అదే హ్యాక్ చేస్తుంది.
ఆహ్వాన పత్రిక, వీడియో అని భావించి డౌన్‌లోడ్ చేస్తే హ్యాకింగ్‌కు సంబంధించిన యాప్స్ ఇన్‌స్టాల్ అయి ఫోన్ సైబర్ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. ఆ తర్వాత మన అకౌంట్లలోని డబ్బులు సైబర్ నేరస్తులు ఖాళీ చేస్తారు. ఫోన్‌లోని వ్యక్తిగత ఫొటోలు, సేకరించి బెదిరింపులకు పాల్పడటం వంటివి కూడా చేస్తుంటారు.