– నాయకత్వం ఎవరికి దక్కాలో నిర్ణయించేది బండి సంజయ్ కాదు
– కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
హైదరాబాద్: రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని ఆశించడం ఒక రాజకీయ పార్టీ గా మా హక్కు.. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఎవరికి దక్కాలో నిర్ణయించేది బండి సంజయ్ కాదు. మరో వ్యక్తి కాదు. ప్రజలే న్యాయ నిర్ణేతలు..ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కావు.. అవి ప్రజల విశ్వాసంపై ఆధారపడి ఉంటాయి..
ఈ దేశానికి పట్టిన గ్రహణం ఎవరో ప్రజలకు తెలుసు.. గత 12 ఏళ్లుగా ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు.. దేశాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి తమాషా చూస్తున్నారు.. దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టిన మీరా మాట్లాడేది?
మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన వ్యవస్థలు అస్తవ్యస్థంగా మారింది..ప్రభుత్వ రంగ సంస్థలు తెగనమ్ముతున్నారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.పేదలను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. విద్వేషాన్ని రెచ్చగొట్టి మైనార్టీ లను అణగారిన వర్గాలను బూచిగా చూపి మీరు అధికారాన్ని చెలాయిస్తున్నారు.. నిత్యం మతవిద్వేశాలు రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నారు..
దేశ ఐక్యత కోసం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి దేశ ప్రజలకు ఐక్యతను చాటి మీ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్న రాహుల్ గాంధీ ని విమర్శించడం ఆకాశం మీద ఉమ్మిస్తే మీ ముఖం మీదే పడుతుంది ఆ వాస్తవాన్ని బండి సంజయ్ తెలుసుకోవాలి.. రెండు సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయి, తెలంగాణ కు ప్రత్యేక నిధులు తీసుకురాని దద్దమ్మ బండి సంజయ్… మీ వ్యవహారశైలి మార్చుకోవాలి..