ఏడాది క్రితం వరకు సాటి తెలుగు పొరుగు తెలంగాణా సోదర నాయకులు మన రోడ్ల పరిస్థితి గుర్తుచేస్తూ ఎగతాళి చేస్తుంటే.. తలదించుకునే పరిస్థితి.
నేడు కర్ణాటక మీద కౌంటర్లు వేసే స్థాయికి చేరాం.
బెంగళూరు రోడ్ల దుస్థితిపై సాగిన సోషల్ మీడియా పోరాటం ఇప్పుడు జాతీయ చర్చకు దారితీసింది. భారీ వర్షాలు, నిర్వహణ లోపాలతో రోడ్లు గుంతలమయం కావడంతో, ‘బ్లాక్‌బక్’ అనే కంపెనీ సీఈఓ రాజేశ్ యాబాజీ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు.
“గంటన్నర ప్రయాణాలతో ఉద్యోగులు విసిగిపోయారని, రోడ్ల పరిస్థితి మారకుంటే తమ కంపెనీని బెంగుళూరు నుండి తరలిస్తామని” ఆయన ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దృష్టికి వెళ్లడంతో, ఆయన ఘాటుగా స్పందించారు. “ఇలాంటి బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌ను ప్రభుత్వం పట్టించుకోదని” వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో ఈ విషయం ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్ళింది. ఇది ఒక అద్భుతమైన అవకాశం అనుకున్న లోకేష్, యాబాజీ పోస్ట్‌కు బదులిస్తూ, “మీ కంపెనీని విశాఖపట్నానికి మార్చాలని నేను ఆసక్తిగా ఉన్నాను. విశాఖ దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన, సురక్షితమైన నగరాల్లో ఒకటి. ఇక్కడి మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నాము. దయచేసి నాకు నేరుగా సందేశం పంపండి” అంటూ ఆహ్వానించారు.
అక్కడితో ఊరుకోలేదు. శివకుమార్ ‘బ్లాక్మెయిల్’ వ్యాఖ్యలపై లోకేశ్ మరోసారి స్పందించారు. “ఇతర రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్‌కు ఇదే తేడా. ప్రజల ఫిర్యాదులను బ్లాక్‌మెయిల్‌గా మేం భావించం. వాటిని మర్యాదపూర్వకంగా స్వీకరించి, పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం” అంటూ ఎక్స్ వేదికగా తిరిగి సమాధానమిచ్చారు.
ఈ మొత్తం వ్యవహారం ఒక స్థానిక రహదారి సమస్యను రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వైరంలా మార్చేసింది. ఒకరు బెంగళూరు ప్రతిష్టను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే, మరొకరు అక్కడి సమస్యను తమ రాష్ట్ర అభివృద్ధికి అవకాశంగా మలచుకునే ప్రయత్నం చేశారు.
ఇదంతా గమనించిన తెలంగాణా దోస్తులు అరెరే ఆంధ్రా.. ఇంతలోనే కంపెనీలు తేవడమే కాకుండా.. కౌంటర్లు వేసే స్థాయికి ఎదిగిందే అని ఈర్ష్య పడుతున్నారు. ఈ విషయంను 11 మంది టీమ్ అభిమానులు అస్సలు పట్టించుకోవడం లేదు.