ఓ వారం రోజులుగా ఇండిగో విమానాల్లో అధిక శాతం సర్వీసులు రద్దు అవుతున్నాయి . ప్రయాణికులు వేల సంఖ్యలో విమానాశ్రయాల్లోనే పడిగాపులు పడుతున్నారు . పౌర విమానయాన శాఖను ప్రయాణికులు బండ బూతులు తిడుతున్నారు. ఇండిగో యాజమాన్యం త్వరిత గతిని సమస్యను పరిష్కరించలేక పోతున్నది .
నిజమే . ఇవన్నీ నిజమే . వీటిని జాతీయ మీడియాలో విస్తృతంగా రిపోర్ట్ చేస్తున్నారు . ఇదీ నిజమే . ఇది …ప్రయాణికులకు , ఇండిగో యాజమాన్యానికి , కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం . మరొకరు ఇందులో స్టేక్ హోల్డర్ కాదు . మిగిలిన వారు … ఏం జరుగుతుందో చూద్దాం అనుకునే కాలక్షేప నిక్షేప రాయుళ్లు మాత్రమే.
ఇందులో మీడియా పాత్ర ఏమిటి ? ఏమి జరుగుతున్నదో తమ పాఠకులకో… వీక్షకులకో తెలియచేయడమే . There ends their role.
అయితే , అర్నాబ్ గోస్వామి అనే అతను , తన పొట్టకూటి కోసం “ రిపబ్లిక్ “ అనే ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ ను నడుపుకుంటుంటారు . ఈ భారత దేశం బరువు బాధ్యతలన్నీ తానే ఆదిశేషుడు లా మోస్తున్నట్టుగా తనకు నచ్చని రాష్ట్రాల ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తుంటారు.
రామాయణం లో … సముద్రాన్ని లంఘిస్తున్న ఆంజనేయుడు ను మింగడం కోసం సురసి అనే రాక్షసి తెరిచినంత పెద్ద సైజు నోటితో … ఆయా ఘటనలపై ప్రాసిక్యూషన్ నిర్వహిస్తూ ఉంటారు . ఆయనే తన ఛానల్ లో పోలీసు , ప్రాసిక్యూటరు, చివరికి జడ్జి. ఇదే జర్నలిజం అనేది ఈ ఆర్నాబు గోస్వామి అవగాహన . రాష్ట్ర ప్రభుత్వాలు అర్నాబు నోటి దురుసుకు భయపడి , ప్రకటనల స్వీట్లు ఆ నోటిలో పెడతారేమో మరి అని అనుమానాలు వ్యక్తం చేసే వారు కూడా లేక పోలేదు .
మన దేశం లో మీడియా కు ప్రభుత్వ నియంత్రణ లేని మాట నిజం . బ్రిటిష్ మోడల్ ప్రజాస్వామిక పాలనా విధానాన్ని మనం చేపట్టడం వల్ల; వ్యవస్థల నిర్వహణల లోని లోటుపాట్లను ఎత్తి చూపడానికి రాజ్యాంగ నిర్మాతలు మీడియా కు ఈ వెసులుబాటు ఇచ్చారు .
ఈ విషయం ….జర్నలిజం లో రెండు మూడేళ్లు పనిచేసిన వారికీ తెలుస్తుంది . కానీ , 1995 నుంచి జర్నలిజం లో ఉన్న ఆర్నాబు కు తెలియక పోతే ; ఆయన ఈ వృత్తికి అర్హుడు కాదు .
వ్యవస్థల పని తీరును ప్రశ్నించడానికి ఆయనకు ఏ చట్టమూ , రాజ్యాంగం లోని ఏ అధికరణమూ అధికారం ఇవ్వలేదు . పెద్ద పెద్ద రంకెలు వేయడం కూడా జర్నలిజం కాదు . 544 మంది ఎం పీ లు 150 కోట్ల మంది జనాభా ఉన్న దేశం లో ఇండిగో విమానాల పడక ఒక్కటే సమస్య కాదు .
అయినా, దానిమీద రిపోర్ట్ చేయాలి అనుకున్న వారు …ఆ సమస్యను తమ వీక్షకులకు అందించడం లో తప్పు ఏమీ లేదు . కానీ , అది ఎందుకు చెయ్యలేదు ….ఇది ఎందుకు చెయ్యలేదు అని బొడ్లో చెయ్యేసి నిలదీసినట్టు అడగడానికి నువ్వు ఎవడ్రా అబ్బాయ్ అని అడిగేవాడు లేక , ఈ అర్నాబు గో సామి రెచ్చి పోతున్నట్టు కనబడుతున్నది . ప్రజలు చట్టసభల సభ్యుల్ని ఎన్నుకుని పార్లమెంట్ కు , అసెంబ్లీ లకు పంపుతారు .
వాళ్లు సక్రమంగా పని చేయడం లేదనే అనుకుందాం . గోవా వెళ్లి తాగి తందనాలు ఆడతున్నారనే అనుకుందాం . లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ నో , బాయ్ ఫ్రెండ్స్ నో వేసుకుని దుబాయ్ వెళ్ళిపోయారనో అనుకుందాం . వీటి వాళ్ల వ్యవస్థలు పడక వేశాయనే అనుకుందాం . లేకపోతే , ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు అర్నాబంత సమర్ధత లేక , వ్యవస్థలు పని చేయక …. ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారనే అనుకుందాం అడగడానికి ఆర్నాబు ఎవరు ? ఎవరు అడగాలి ? ఎన్నుకున్న ప్రజలు అడగాలి . లేదంటే ఈ నడమంత్రపు సోషల్ మీడియా అడగాలి . వారు విధులను సరిగా నిర్వర్తించడం లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు అని ఈ అర్నాబులు తమ వీక్షకులకు చెప్పాలి .
ఇండియా లో ఇండిగో సమస్య కంటే ముందు లక్షా తొంభై సమస్యలు దేశాన్ని అతలాకుతలం చేశాయి . కానీ ఈ అర్నాబు ఏ సమస్య మీదా కుయ్యిమనలేదు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో ఓ విషాదం కూడా లేకపోలేదు .
“మమ్ములను ప్రశ్నించడానికి , వ్యాఖ్యలు చేయడానికి నువ్వెవడ్రా అబ్బాయ్? మేము చెప్లెక్సీ మేము చెబుతాం . లోకేష్ మానిటర్ చేస్తున్నారని కాకపోతే , వంగలపూడి అనిత మానిటర్ చేస్తున్నారని చెబుతాం ఇష్టమైతే టెలికాస్ట్ చెయ్యి . లేకపోతే మానెయ్. మా మీద బురద జల్లడానికి నీకున్న హక్కేంటో ఓ ముక్క చెప్పు “ అని ఈ అర్నాబు ను అడిగే వారు టీడీపీ లో కనిపించక పోవడమే ఈ విషాదం.
-భోగాది వేంకట రాయుడు