Suryaa.co.in

Telangana

ప్రభుత్వ పధకాలు లబ్దిదారులకు చేరేలా ఏర్పాట్లు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : ప్రభుత్వ పధకాలు లబ్దిదారులకు చేరేలా ఏర్పాట్లు జరుపుతున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. తార్నాక డివిజన్ పరిధిలో ఇంటింటికీ తిరుగుతూ లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి,శాదిముబరాక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పద్మారావు గౌడ్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కిరణ్ కుమార్ గౌడ్, కార్మిక నేత మోతే శోభన్ రెడ్డి, అధికారులు, నేతలతో కలిసి అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు ఉప కరించేలా వివిధ కార్యక్రమాలను చేపదుతున్నామని తెలిపారు. మనికేశ్వరి నగర్, ఓ యు క్యాంపు, తార్నాక, చింతల్, గోకుల నగర్, చంద్రబాబు నగర్, లక్ష్మి నగర్, లాలాపేట,ఆర్య నగర్ తదితర ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పాదయాత్ర నిర్వహించి చెక్కులను పంపిణీ చేయడంతో పాటు స్థానికుల సమస్యలను కుడా అడిగి తెలుసుకొని, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. మనికేశ్వరి నగర్ లో ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, వివిధ ప్రాంతాల్లో సివరేజి పైప్ లైన్లు ఏర్పాటు చేయాలనీ, చింతల్ ప్రాంతంలో నాలా పై స్లాబ్ నిర్మించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. రూ. 32 లక్షల కు పైగా విలువ చేసే 29 కళ్యాణ లక్ష్మి, శాది ముబారక్, ఆరు సీ ఏం ఆర్ యఫ్ కు చెక్కులను అందించారు.<a href=”https://ibb.co/dmMjshH”><img src=”” alt=”312A9574″ border=”0″></a>

LEAVE A RESPONSE