Suryaa.co.in

Andhra Pradesh

కొత్త పింఛన్ల మంజూరుకు ఏర్పాట్లు

విజయవాడ: రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్లో అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం.

గత ప్రభుత్వంలో పింఛన్లు రద్దైన వారి నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి వాస్తవాలు గుర్తించింది. దరఖాస్తులు స్వీకరించిన 60 రోజుల్లోగా కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల మంది వివిధ కేటగిరీల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుకుంటున్నారు. అయితే వీరిలో 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అందుకుంటున్నారు.

LEAVE A RESPONSE