Suryaa.co.in

Telangana

నిరుద్యోగ యువతకోసం పోరాడుతున్న నేతల అరెస్టు సిగ్గుచేటు

-మెగా డీఎస్సీ ఏదీ? జాబ్ క్యాలెండర్ ఎప్పుడు?
-బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ళ మహేందర్

హైదరాబాద్: విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై టీజీపీఎస్‌సి కార్యాలయంముందు ధర్నా సందర్బంగా బీజేవైఎం నాయకుల పై ప్రభుత్వ చేసిన దాడులను వ్యతిరేకిస్తూ బీజేవైఎం నాయకులు వంశీ యాదవ్, బుక్క ప్రవీణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సేవెళ్ళ మహేందర్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న బీజేవైఎం నాయకులు పైన దాడులను ఖండించారు. ఎన్నికల్లో కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ఏవైతే హామీలు ఇచ్చారో, ఆ హామీలను తక్షణమే నెరవేర్చాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఇదే స్థాయిలో ఉద్యమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతకు చేసిందేమీ లేదు. అదే ధోరణితో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తునారు. దీనికి ప్రాయశ్చిత్తంగా తెలంగాణ ప్రజలు త్వరలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని, గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచా లని, 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించా లని, జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జిల్లా ఉప అధ్యక్షులు శ్రీను యాదవ్, సిద్దు, ప్రదీప్, నర్సింగ్, M నర్సింగ్, సాయి, చుక్క ప్రకాష్, ప్రశాంత్, సురేష్, చిన్న, స్వామి, మహేష్, ఆనంద్, వీరేందర్, శ్రీను నాయక్, రాహుల్, శివ, క్యామా శ్రీకాంత్, హరీష్, వినేయ్ కుమార్, మల్లికార్జున్, ప్రవణ్, పవన్, వరుణ్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE