-జనసేన అధినేత పవన్ కళ్యాణ్
నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా?మనోహర్ తో పాటు, ఇతర నేతలను విడుదల చేయకపోతే విశాఖ వస్తానని స్పష్టం చేశారు. తాను ప్రజల కోసం పోరాడతానని వెల్లడించారు.
ప్రజలకు ఉన్న సమస్యలను తీర్చాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు అధికారులు ఇలా వ్యవహరించడం సరి కాదు అన్నారు. స్థానిక ఎంపీ కోసం జంక్షన్ మూసివేయడం ఏమిటి? అని ప్రశ్నించారు. ఎంపీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషం ఉందని రోడ్డు మూసి వేయడం ఏమిటి? అని ప్రశ్నించారు. ఈ విషయాలను ప్రజా గొంతుకగా జనసేన వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని.. వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు స్పందించాలన్నారు.