“మీలాగే మీ వాయిస్ కూడా స్వీట్ గా ఉంది”.. అని ఓ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ అమ్మాయి అంటుంటే.. కాలేజీ అంతా కేరింతలు, కేకలు!
తరువాత “అమ్మకు చెప్పలేని పని ఇక్కడ మనం ఏదీ చెయ్యకూడదు”, రిపీట్ అంటూ మరోసారి చెప్పారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల వేదికపై ‘హలో లోకేష్’
కార్యక్రమం టీనేజర్ల హృదయాలను కదిలించింది. విద్యార్థుల ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన సమాధానాలు భావోద్వేగంతో, భవిష్యత్తుపై ఆశతో నిండిపోయాయి.
విద్యార్థులు జీవితంలో లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపు, ట్రోలింగ్స్ ఎదురైనా ధైర్యంగా నిలబడాలని చెప్పిన మాటలు యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. “లైఫ్ జర్నీ, డెస్టినేషన్ కాదు” అన్న ఆయన మాటలు ప్రతి టీనేజర్ గుండెల్లో ముద్రపడ్డాయి.
ఉద్యోగాల కోసం అకడమిక్స్‌ను ఇండస్ట్రీతో అనుసంధానిస్తామని, నైపుణ్యం పోర్టల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు చూపిస్తామని చెప్పిన హామీ, చదువుతో పాటు కెరీర్ కలలు కనే యువతకు ఆశాకిరణం. జనవరిలో జాబ్ కేలండర్ విడుదల చేస్తామని చెప్పిన మాటలు భవిష్యత్తుపై నమ్మకం కలిగించాయి.
కేజీ నుంచి పీజీ వరకు స్త్రీలను గౌరవించేలా ప్రత్యేక కార్యాచరణ చేపడతామని, నైతిక విలువలపై ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేస్తామని చెప్పిన లోకేష్, సమాజంలో మార్పు కోసం యువతే ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ప్రతి విద్యార్థికి ఉచితంగా AI టూల్ అందిస్తామని చెప్పిన హామీ, డిజిటల్ జనరేషన్‌కి గేమ్-చేంజర్. క్రీడల్లో రాణించాలనుకునే వారికి కాలేజీల్లో స్పోర్ట్స్ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పిన మాటలు కలల్ని రెక్కలతో ఎగరేశాయి.
తల్లి ప్రేమ, క్రమశిక్షణ తన జీవితానికి పునాది అని, నాన్నగారికి దక్కిన గౌరవం తనకూ రావాలని అహర్నిశలు కష్టపడుతున్నానని చెప్పిన లోకేష్, టీనేజర్లలో కుటుంబ విలువల పట్ల గౌరవాన్ని పెంచారు.
ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని, సవాళ్లను అధిగమించాలనే ధైర్యం కలిగి ఉండాలని చెప్పిన ఆయన మాటలు, విద్యార్థులలో జీవనోత్సాహాన్ని నింపాయి.
చివర్లో విద్యార్థులతో కలిసి సెల్ఫీ దిగిన లోకేష్, ఒక నాయకుడిగా మాత్రమే కాకుండా, ఒక మిత్రుడిగా, ఒక మార్గదర్శిగా నిలిచారు.
ఈ సభలో వినిపించిన ప్రతి మాట, ప్రతి హామీ, ప్రతి భావోద్వేగం – టీనేజర్ల భవిష్యత్తుకు ఒక కొత్త దిశ, ఒక కొత్త ఆశ. చివరగా.. ఒక్క మాట మీ మావయ్య అని ఆసిడ్ బాటిల్ డ్రగ్స్ సైకోలా.. రుద్దలేదు.
నిన్నటి అవమానాల నుంచి నేటి అద్భుతమైన ఆశల వరకు.. లోకేష్ ఎదిగిన తీరు భవిష్యత్ తరాలకు ఒక పాఠం. నకిలీ ప్రచారాలను పక్కన పెట్టి, ఒక మిత్రుడిగా, మార్గదర్శిగా ఆయన నిలిచిన తీరు అద్భుతం!