Suryaa.co.in

Andhra Pradesh

‘జగనన్నే మా భవిష్యత్తు’ భాగంగా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ‘మెగా సర్వే’

-‘జగనన్నే మా భవిష్యత్తు’ అనే పేరుతో దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాం
-‘మా నమ్మకం నువ్వే జగన్’ అనేది ప్రజల నినాదం: సజ్జల రామకృష్ణా రెడ్డి

సీఎం జగన్‌ నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ ‘జగనన్నే మా భవిష్యత్తు’ అనే పేరుతో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా పార్టీ అత్యంత విస్తృతంగా అందరినీ కలుపుకొని ‘మెగా సర్వే’ చేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యాచరణ వివరిస్తూ తాడేపల్లి పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సజ్జల రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో 7 లక్షల మంది పార్టీ సైనికులు 14 రోజుల్లో (ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 20) రాష్ట్రంలోని 1.6 ( కోటి అరవై లక్షల) కోట్ల కుటుంబాలను.. 5 కోట్ల మంది ప్రజలను కలిసి ‘మెగా సర్వే’ చేయనున్నారని సజ్జల చెప్పారు. “ఈ 7 లక్షల మంది కార్యకర్తల్లో కొత్తగా నియమించబడిన గృహ సారధి మరియు వార్డు సచివాలయం కన్వీనర్లు ఉంటారు. వీరు ఇంటింటికి ‘మెగా సర్వే’ నిర్వహించే బాధ్యతను కలిగి ఉంటారు. ఈ సైనికులందరూ గత 3-4 నెలలుగా పార్టీ కేంద్ర కార్యాలయం, ప్రాంతీయ సమన్వయకర్తలతో పాటు ఎమ్మెల్యేలతో నేరుగా సంప్రదింపులు జరిపారు.. అంతేకాకుండా, మండలాల వారీగా శిక్షణ పొందారు, అక్కడ వారికి సమర్థవంతంగా పబ్లిక్ కనెక్షన్‌ను ఎలా నిర్వహించాలో నేర్పించారు,” అని సజ్జల అన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు ముఖ్యమైన అంశాలు ఉన్నాయని సజ్జల వివరించారు

1. గత TDP ప్రభుత్వానికి.. ప్రస్తుత YSRCP పాలనను పోల్చి చెప్పే పాంప్లెట్ అందిస్తారు
2. ప్రజా మద్దతు పుస్తకంలోని ప్రశ్నలు అడిగి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని నమోదు చేస్తారు
3. మద్దతు తెలిపిన వారికీ డోర్ మరియు మొబైల్ స్టిక్కర్లు ఇవ్వబడుతాయి
4. 82960 82960 నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరతారు

గత ప్రభుత్వానికి Vs ప్రస్తుత ప్రభుత్వానికి పోలికకు సంబంధించిన కరపత్రంలో ఉండే పలు ముఖ్య విషయాలు సజ్జల చెప్పారు.
YSRCP ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందజేస్తోంది. కుల, మత, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాల నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తోంది. తద్వారా సంక్షేమ పథకాల అమలులో మధ్యవర్తులు, అవినీతికి తావు లేకుండా చేసింది. కానీ టీడీపీ హయాంలో పథకాలు అందాలంటే ప్రజలు జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చేవారు. ఈ పరిస్థితిని వైఎస్సార్ సీపీ పూర్తిగా మార్చివేసింది. మన బడి నాడు – నేడు కార్యక్రమం ద్వారా జగనన్న ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దింది. దీంతో పేద విద్యార్థులకు డిజిటల్ క్లాస్‌రూంలు, అధునాతన ట్యాబ్‌లు, మెరుగైన టాయిలెట్లు వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఇంగ్లీష్ మీడియం చదువులతో పిల్లల బంగారు భవిష్యత్తు బాటలు వేస్తోంది. అదే గత టీడీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరి కనీసం త్రాగు నీరు, టాయిలెట్ల ఉండేవి కావు. రాష్ర్ట చరిత్రలో తొలిసారిగా బీసీలను వెన్నుముకగా గుర్తించి వారికి రాజకీయాల్లో కీలక పదవులు ఇచ్చి సీఎం జగన్ చరిత్రను తిరగరాశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమ, ఆర్థిక పురోగతి కోసం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. కానీ గత టీడీపీ హయాంలో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలను కించ పరుస్తూ ‘ఎవరు మాత్రం ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారు’ అని తీవ్రంగా అవమానించారు. చంద్రబాబు తన పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఆర్థికంగా, రాజకీయంగా అణచివేసి తీవ్రంగా వేధించారు.

ప్రజా మద్దతు పుస్తకం (మెగా సర్వే)
“కరపత్రాల పంపిణీ అనంతరం ప్రజా మద్దతు పుస్తకంలోని ప్రశ్నలను అడిగి ప్రత్యేకమైన ‘పీపుల్స్ సర్వే’ నిర్వహిస్తారు, ఈ ప్రశ్నల ద్వారా ప్రజలను వారి భవిష్యత్తు కోసం సీఎం జగన్‌ను విశ్వసిస్తున్నారా అని అడగనున్నారు,” అని సజ్జల చెప్పారు.

‘జగనన్నే మా భవిష్యత్తు’ స్టిక్కర్లు & మిస్డ్ కాల్ ప్రచారం
“సీఎం జగన్ ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలకు జగనన్నకు మద్దతు ఇస్తున్నట్లు ధృవీకరిస్తూ రసీదు ఇవ్వనున్నారు. అనంతరం ప్రజల అనుమతితో జగనన్నే మా భవిష్యత్తు స్టిక్కర్లను తలుపు, సెల్ ఫోన్ స్టిక్కర్లను అతికించనున్నారు. చివరగా ప్రజలు జగనన్నకు తమ మద్దతును తెలిపేందుకు 82960-82960 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరుతారు,” అని సజ్జల అన్నారు. రాష్ట్రంలోని 100% కుటుంబాలను రికార్డు స్థాయిలో 14 రోజుల్లో కవర్ చేయడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం అని అయన అన్నారు. గత కొన్ని నెలలుగా రెట్టింపు అయిన పార్టీ క్యాడర్ మొత్తం యాక్టివేట్ చేసి, ఇంటింటికీ వెళ్లి సీఎం జగన్ ఎలా పనిచేశారో నేరుగా ప్రజలను అడిగి తెలుసుకుని ఆయన సందేశాన్ని చివరి మైలు వరకు తీసుకెళ్లడమే ముఖ్య ఉద్దేశం అని సజ్జల వివరించారు.

LEAVE A RESPONSE