– టెక్నాలజీ యుగంలో తల్లిదండ్రులతో టైమ్స్ స్పెండ్ చేయడం కనుమరుగైంది
– పోటీ ప్రపంచంలో వృద్ధులను చూసుకునే పరిస్థితి తగ్గిపోయింది
– ఈ నవల పిల్లలతో పాటు వృద్ధులు కూడా చదవాలి
– టూరిజం ప్లాజాలో రావులపల్లి సునీత రచించిన జీవన సంధ్య,గుండె గుండెకో కథ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్: రావులపల్లి సునీత రచించిన ‘జీవన సంధ్య’, ‘గుండె గుండెకో కథ’ నవలల మీ అందరి సమక్షంలో ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. సునీత తో నా పరిచయం 30 సంవత్సరాలు. అప్పటి నుంచి వారిని చూస్తూ ఉన్నాను.
కెసిఆర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు విజన్ 2020 డాక్యుమెంట్ రెడీ చేసే రోజుల్లో వారితో కలిసి పనిచేసేవారు. ఆ రోజుల్లోనే నాకు వారి పట్టుదల, కృషి దగ్గర నుండి చూసిన అనుభవం ఉంది సునీత మంచి రచయిత్రి. అనేక కథలు, నవలలు రచించారు.
ఈ రెండు నవలల్లో సునీత పరకాయ ప్రవేశం చేసి చాలా చక్కగా వివరించారు. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా జీవన సంధ్య గురించి కీర్తి ఒక మంచి మాట చాలా చక్కగా చెప్పింది. సిద్దిపేట దూల్మెట్ట అనే గ్రామంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఉంటాడు. భార్యాభర్తలిద్దరూ నా దగ్గరకు వచ్చారు. రిటైర్డ్ ఉపాధ్యాయునితో నాకు ఉద్యమం అనుబంధం ఉంది.
తన బాధ నాతో అప్పుడు చెప్పుకున్నాడు. కొడుకు కోడలు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్.. మొన్న ఇంటికి వచ్చి చాలా ఇబ్బందులు పెట్టారు. ఆస్తులు పంచమన్నారు ఒక మాట ఆర్డిఓకు, పోలీసులకు చెప్పండి అన్నారు.
ఆయన చాలా కష్టపడి జీవితంలో కొడుకులను చదివిస్తే..ఒకాయన అమెరికాలో ఉంటాడు ఇంకో ఆయన బెంగుళూరులో ఉంటున్నాడు. ఇంత కష్టపడితే ఆయనను ఆస్తులు పంచమని వృద్ధాప్యంలో వదిలేస్తున్నారు. ఈ తరానికి ఎవరికైనా ఈ పుస్తకాలిస్తే మంచి జ్ఞానోదయం అవుతుంది.
కీర్తి ఇందాక మాట్లాడుతూ పెద్ద వయస్సు వచ్చిన కొద్దీ తల్లిదండ్రులు చిన్నపిల్లల్లాగా మారుతూ ఉంటారు అని చెప్పింది. కాలం మారింది. పోటీ ప్రపంచంలో వృద్ధులను చూసుకునే పరిస్థితి తగ్గిపోయింది. మనుషులుగా ఇంట్లో ఉంటున్నాం తప్పితే మనసులు కలవడం లేదు. టెక్నాలజీ యుగంలో తల్లిదండ్రులతో టైమ్స్ స్పెండ్ చేయడం కనుమరుగైంది.
ఈమధ్య ఒక సర్వే వస్తే 54% తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు. చిన్నప్పుడు మన తల్లి మనకెంత ఆప్యాయతలు చూపిస్తారో..అలానే మనం కూడా వారికి వృద్ధాప్యంలో ఆప్యాయత చూపించాలి. వాస్తవానికి మన భారతదేశంలో ఫ్యామిలీ బాండింగ్ ఎక్కువ అని చెప్పుకుంటుంటాం . కానీ దురదృష్టవశాత్తు అది రాను రాను తగ్గుతూ వస్తుంది.
ఈ నవలలో మూడు విషయాలు చాలా బాగా చెప్పారు. డబ్బులు ఉన్న వృద్ధాప్యం రావచ్చు. డబ్బు లేని వృద్ధాప్యం కావచ్చు. అన్నీ ఉన్న వృద్ధాప్యం కావచ్చు. అందరికీ సమస్యలే ఉంటాయి. అది చూస్తుంటే నాకు నా భార్య అన్న మాటలు గుర్తొచ్చాయి.
ఒక్కనాడన్న వారితో టైం స్పెండ్ చేసావా, సినిమాకు తీసుకెళ్ళావా.. వాళ్ళ బర్త్ డేకి టైం కి రావు..మరి మీరెలా టైమ్ స్పెండ్ ఇస్తారు అని అడిగింది. మరి నేను ఏ కోవకు వస్తానో అనే ఆలోచన వచ్చింది. ఒకప్పుడు నాయనమ్మలో, అమ్మమ్మలో అన్నం తినిపిస్తూ చిన్న పిల్లలకి మన సంస్కృతి, సాంప్రదాయాల గురించి నేర్పించేవారు. విలువల గురించి నేర్పించేవారు.
అన్నీ ఉండి పెంచి పెద్ద చేసిన పిల్లలు ఉన్నప్పుడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. నవలలో ఒక దగ్గర రాసారు. వృద్ధుల మధ్య సంభాషణ. బతుకుండటం కన్నా చావడం మేలు అని రాసిన వ్యాఖ్యం చూస్తే బాధ కలుగుతుంది. ఎవరైనా చనిపోవాలని కోరుకుంటారా ? వృద్ధాప్యంలో మన చుట్టూ ఉన్న సమాజంలో అలాంటి భావనలో ఉన్నారని సునీత చాలా చక్కగా చెప్పారు.
ఈరోజు సమాజంలో చాలా మందికి తెలీదు. సాధారణంగా ప్రభుత్వాలకు ఒక బాధ్యత ఉంది. ఒక నెల వృద్ధుల సమస్యల మీద వారు చర్చించాలి. కానీ ఎవరు ఆ పని చేయడం లేదు. పిల్లలు చదువులు చెప్తున్నాం. చదువులతో పాటు సంస్కారం కూడా నేర్పడం చాలా ముఖ్యం. పిల్లలను కనడం కన్నా వారికి తల్లితండ్రుల గొప్పదనం, వారి పట్ల బాధ్యత పెరిగేలా నేర్పించాలి.
ఇలాంటి చాలా అంశాలను సునీత నవల రచించారు. జీవిత సారాంశాన్ని చెప్పేది నవల. వాస్తవాలకు దగ్గరగా ఈ నవల ఉంది. ఈ నవల పిల్లలతో పాటు వృద్ధులు కూడా చదవాలి. ఎంతో కొంత మార్పు పిల్లలలో రావాలని కోరుకుంటున్నా. సునీత గారిని నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
ఇక రెండో నవల ‘గుండె గుండెకో కథ’.. గుండె కోతకు రెండు అర్థాలున్నాయి. ఒకటి మాటలతో మనిషిని మానసికంగా చంపేది అయితే, రెండోది గుండెని కోసి ఆపరేషన్ చేసి శారీరకంగా, మానసికంగా బతికించేది. గుండె జబ్బులు, వైద్య వృత్తి, ఆసుపత్రుల నేపథ్యంతో సునీత గారు ఒక మంచి నవల రాశారు. డాక్టర్ శరత్ చంద్ర పాత్ర గురించి ఈ నవలలో చాలా గొప్పగా చెప్పారు.
డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. డాక్టర్ల వృత్తి గురించి చాలా గొప్పగా చెప్పారు. డాక్టర్లు సమాజంలో గుర్తింపు పొందాలంటే 50 ఏండ్ల వరకు కష్టపడాలి. వారికి పర్సనల్ లైఫ్ కోల్పోవాల్సి వస్తుంది. ప్రాణాలు కాపాడే అవకాశం అన్నింటికంటే గొప్పది. డాక్టర్లు కావాలంటే ఎన్నో త్యాగాలు ఉంటాయి. నిరంతరమైన శ్రమ ఉంటుంది. నిజంగా డాక్టర్లు అందరికీ మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
కరోనా సమయంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా డాక్టర్లు చేసే పనిని చాలా దగ్గరగా చూశాను. ఇలాంటి డాక్టర్ల త్యాగాలను ఈ నవలలో పొందుపరిచిన సునీత ని నిజంగా అభినందిస్తున్నాను. సమాజంలో మన చుట్టూ ఉన్న అంశాలనే కథాంశాలుగా తీసుకొని, తనదైన శైలిలో అద్భుతమైన రచనలు చేసిన సునీత కి మరొక్కసారి అభినందనలు. శుభాకాంక్షలు.
ఈ రచనలు సమాజాన్ని జాగృతం చేస్తాయని, యువ రచయితలకు స్పూర్తిగా నిలుస్తాయని ఆకాంక్షిస్తున్నాను. ఈ పుస్తకాలు మరింత ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, అల్లం నారాయణ, కే. శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.