Suryaa.co.in

Telangana

ఆశావర్కర్ల సేవలు అభినందనీయం: తలసాని

ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఆశా వర్కర్ లు అందిస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసించారు.

బుధవారం మారేడ్ పల్లి లోని మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్ లో TSMIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో కలిసి ఆశా వర్కర్ లకు స్మార్ట్ ఫోన్ లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల అమలు లో స్మార్ట్ ఫోన్ లు ఆశా వర్కర్ లకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. పేద ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు అనేక చర్యలు చేపట్టిందని చెప్పారు.

కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ ను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రయివేట్ హాస్పిటల్స్ కు వెళ్ళి కేవలం పరీక్షల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కోట్లాది రూపాయల వ్యయంతో అత్యాధునిక పరికరాలను ప్రజలకు అందుబాటులో కి తెచ్చినట్లు వివరించారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉచితంగా పరీక్షలు, మందులు అందజేయబడుతుందని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అంతేకాకుండా పేదలు అత్యధికంగా నివసించే బస్తీలలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి పేదల ముంగిటికి ప్రభుత్వ వైద్య సేవలు తీసుకోచినట్లు చెప్పారు. ఇందులో కూడా సుమారు 56 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, డాక్టర్ రాజ శ్రీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE