– జగన్ రెడ్డి అక్రమ కేసులు, అర్దరాత్రి అరెస్టులతో టీడీపీ నేతల్ని వేధిస్తున్నారు
– జగన్ రెడ్డి ఇకనైనా పద్దతి మార్చుకోవాలి లేకుంటే పరిణామాలు వేరేగా ఉంటాయి
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
అబద్దపు పునాదుల మీద అధికారాన్ని చేపట్టిన జగన్ రెడ్డి…అరాచకంతో పాలన సాగిస్తున్నారు. జగన్ రెడ్డి అధికారం చేపట్టి 3 ఏళ్లు కావొస్తున్నా…పద్దతి మార్చుకోకుండా టీడీపీ నేతల్ని అక్రమ కేసులు, అర్దరాత్రి అరెస్టులతో వేధిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబును సీఐడీ అధికారులు అరెస్టు చేయటాన్ని ఖడిస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాల్ని, తప్పుల్ని పశ్నించినవారిని అక్రమ కేసులతో భయపెడుతున్నారు. అశోక్ బాబును అర్దరాత్రి దొంగల్లా వచ్చి అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటి? గతంలో అశోక్ బాబు పై వచ్చిన ఆరోపణలపై ఆయన ప్రమేయం లేదని విచారణలో తేలినా కుట్రపూరితంగా మళ్లీ కేసు పెట్టడం జగన్ రెడ్డి అరాచక పాలనకు అద్దం పడుతోంది.
ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడుగా అశోక్ బాబు.. వైసీపీ ప్రభుత్వం పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు చేసిన మోసం, అన్యాయంపై ఉద్యోగుల్ని చైతన్యంవంతం చేస్తున్నాడన్న కడుపుమంటతోనే ఆయనపై కక్ష్యసాధిస్తున్నారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులకు టీడీపీలో భయపడేవారెవరూ లేరు. అశోక్ బాబును వెంటనే విడుదల చేయాలి. జగన్ రెడ్డి ఇకనైనా పద్దతి మార్చుకుని పాలన సాగించాలి. లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు.