Suryaa.co.in

Andhra Pradesh

కట్టమన్నది ఒకచోట అయితే… రుషికొండపై కట్టినది మరొక చోట

-హైకోర్టులో న్యాయం జరగకపోతే… సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది
-అయినా హైకోర్టులోనే న్యాయం జరుగుతుందన్నది తన నమ్మకం
-సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘనలను నిర్ధారించిన నిపుణుల కమిటీ
-రామోజీరావు గారితో తో చుట్టరికం లేదు… నా దేశం ఇచ్చిన అత్యున్నత పౌర పురస్కార విలువను కాపాడడం నా బాధ్యత
-ఎంపీ నిధులు కావాలని ఎప్పుడైనా అడిగావా ఉపముఖ్యమంత్రి
-నేను రాష్ట్రంలో అడుగుపెడతానని అంటే ఉచ్చ పోసుకుంటుందెవరో అందరికీ తెలుసు
-పార్టీ నుంచి తనని బహిష్కరించమని జగన్మోహన్ రెడ్డికి చెప్పు
-పార్టీకి, గెలిపించిన ప్రజలకు విధేయుడి గానే ఉన్నాను
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

ఋషికొండపై కేంద్ర పర్యావరణ మంత్రి శాఖ నిర్మాణాలను అనుమతించినది ఒకచోట అయితే, రాష్ట్ర ప్రభుత్వం మరొకచోట నిర్మాణాలను చేపట్టింది. ఋషికొండ నిర్మాణాలలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు ఉల్లంఘనలు జరిగినట్టు నిపుణుల కమిటీ నిర్ధారించింది. ఈ విషయాన్ని నిపుణుల కమిటీ హైకోర్టుకు నివేదించిన నేపథ్యంలో, హైకోర్టు ఏ తీర్పు ఇస్తుందో చూద్దాం .రాష్ట్ర హైకోర్టులో న్యాయం జరగకపోయినా… సుప్రీంకోర్టులో న్యాయం జరిగి తీరుతుంది. కానీ రాష్ట్ర హైకోర్టులోని న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు ఉందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. గురువారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఋషికొండపై నాలుగు పెద్ద, పెద్ద బ్లాక్ ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. టూరిజంకు సంబంధం లేకుండా, ఆఫీసులకు ఉపయోగపడే విధంగా ఈ నిర్మాణాలు ఉన్నాయి. 9 ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు జరుపుకోవచ్చని అనుమతిస్తే, 17.99 ఎకరాల్లో అంటే 18 ఎకరాలలో తవ్వకాలు జరిపినట్లుగా నిపుణుల కమిటీ నిర్ధారించింది.

వాస్తవానికి 21 ఎకరాల్లో తవ్వకాలు జరిపింది . మూడు ఎకరాలను నిపుణుల కమిటీ మినహాయింపు ఇచ్చిందేమో అన్నారు. చెప్పిన దాని కంటే ఋషికొండకు డబుల్ గుండు కొట్టారు. 2 లక్షల మీటర్లు దాటితే, నూతన అనుమతులు అవసరమవుతాయని భావించి, బాటా చెప్పుల రేటు మాదిరిగా ఒక లక్ష తొంభై ఎనిమిది వేల చదరపు అడుగులు కట్టాము అంటున్నారు. తవ్వకాలు జరిపిన మట్టిని తిరిగి అక్కడే రీస్టోర్ చేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ చెప్పినప్పటికీ, ఆ మట్టిని తీసుకువెళ్లి మరొకచోట పోశారు. ఇప్పుడా మట్టిని తీసుకువచ్చి, రీస్టోర్ చేసే పరిస్థితి లేదు. ఋషికొండపై ఇంత ప్రకృతి విధ్వంసం జరిగినప్పటికీ, సాక్షి దినపత్రికలో మాత్రం అనుమతించిన దానికంటే తక్కువ విస్తీర్ణంలోనే నిర్మాణాలు చేపట్టారని రాయడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. అనుమతించిన దానికంటే తక్కువ విస్తీర్ణంలోనే నిర్మాణాలు చేపట్టారని, రేపు ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదిస్తూ… తక్షణమే, పిటీషన్లను కొట్టివేయాలని కోరే అవకాశాలు లేకపోలేదు. అనుమతించిన దానికంటే తక్కువ విస్తీర్ణంలోనే నిర్మాణాలు చేపడితే, ఇంకెందుకు కేసు క్లోజ్ చేయండి అని ప్రధాన న్యాయమూర్తి తీర్పును ఇస్తే, తాను కచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

రాజకీయ నాయకుల చెప్పులు నాకే అధికారులు ఉండడం దురదృష్టకరం
ఋషికొండపై పరిమిత స్థాయిలో తవ్వకాలను జరిపి నిర్మాణాలను చేపట్టేందుకు ఎం ఓ ఈ ఎఫ్ అనుమతించగా, కోర్టులో ఒకవైపు కేసు నడుస్తుండగానే మున్సిపల్, వుడా అధికారులు మాత్రం అరవై ఎకరాలలో నిర్మాణాలకు అనుమతినివ్వడం ఆశ్చర్యంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. మున్సిపల్, వుడా అధికారులు ఇచ్చిన అనుమతులను న్యాయస్థానం పట్టించుకోకపోవడం దురదృష్టకరం. రాజకీయ నాయకుల చెప్పులను నాకడానికి కొంతమంది అధికారులు ఇష్టారీతిలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఈ అంశాలన్నీ సుప్రీంకోర్టులోనే తేలాలి. నిర్మాణ బ్లాకులను తగ్గించి, ప్లాన్లను మార్చారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను, హైకోర్టు పట్టించుకోలేదు. గతంలో నిర్మాణాలు ఉన్న చదునైనా ప్రదేశంలోనే నూతన నిర్మాణాలకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు చెప్పిన చోట కాకుండా, మరోచోట నిర్మాణాలను చేపట్టింది. ప్రజావేదిక అక్రమ నిర్మాణమని అందులో కూర్చొని ఎలా పరిపాలించగలమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆ నిర్మాణాన్ని కూల్చివేశారు.

ఋషికొండపై నిర్మాణాలు అక్రమమని తేలితే, కూల్చివేతలు చేపట్టాలని రఘురామకృష్ణం రాజు కోరారు. ఋషికొండను పునరుద్ధరించాలని రామకృష్ణ బాబు, మూర్తి యాదవ్ తో కలిసి న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. ఈనెల 26వ తేదీన హైకోర్టులో ఏమి జరుగుతుందో వేచి చూద్దామని చెప్పారు. రామోజీరావు గారితో తో బంధుత్వం లేదు… నాకు తెలిసిన విషయాలు తెల్సుకున్న విషయాలు మాట్లాడున్న పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత తో తను వ్యక్తిగతంగా ఎక్కువ సార్లు కలవనప్పటికీ ఆయనను నా చిన్నతనం నుంచే ఎంతో అభిమానించే వాడిని. నా దేశం అన్ని విషయాలు తెలుసుకునే ఆయనకు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు అందించిన కారణంగా ఆ అవార్డు విలువను కాపాడడం కోసం, తనకు తెలిసిన నిజాలను మాట్లాడుతున్నానని రఘు రామకృష్ణంరాజు తెలిపారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కు వ్యతిరేకంగా ఈ డీ, సెంట్రల్ బోర్డు డైరెక్టర్ టాక్స్ ( సిబిడిటి ) కి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ కి వచ్చిన సంజయ్, సాక్షి మినహాయించి ఆంధ్రప్రదేశ్ కు చెందిన విలేకరులతో కాకుండా, జాతీయ ప్రెస్ తో మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది. అయినా తెలుగు ప్రెస్ మీడియా సమావేశానికి హాజరై కొన్ని ప్రశ్నలు స్పందిస్తే వంకర సమాధానాలు చెప్పారు.

చిట్ పండ్ చట్టాన్ని తాను క్షుణ్ణంగా చదివి, మార్గదర్శి చందాదారులతో మాట్లాడి అధ్యయనం చేశాను. మార్గదర్శి కేసును చిట్ పండ్ చట్టం ఓనమాలు తెలియని ఇద్దరు బాలురు విచారిస్తున్నట్లుగా కనిపిస్తుంది. మార్గదర్శి సంస్థ తన ప్రతి బ్రాంచ్ లోను మేనేజర్ ఆధ్వర్యంలోనే చిట్ లను నిర్వహిస్తోంది. మార్గదర్శి సంస్థ చిట్ పండ్ చట్టాన్ని అనుసరించాలని ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ పేర్కొనడం విస్మయాన్ని కలిగించింది. 1982 చిట్ పండ్ యాక్ట్ ను మార్గదర్శి సంస్థ కచ్చితంగా అనుసరిస్తోంది. ఇక నిధులను దారి మళ్లించారని చెత్త వాగుడు వాగుతున్నారు. అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఎక్కడి బ్రాంచ్ నిధులను, చెక్ లను అక్కడి కంపెనీ అకౌంట్లో జమ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మార్గదర్శి సంస్థ పై కేసులు నమోదు చేసి వేధిస్తున్నారు. మార్గదర్శి సంస్థ, చిట్టి ల నిర్వాహణ ద్వారా తనకు లభించే ఐదు శాతం కమిషన్ ను తీసుకోవడం మినహా ఖాతాదారుల డబ్బులు దారి మళ్లించిన సంఘటనలు లేవు.

బ్యాలెన్స్ షీట్ ద్వారా వచ్చిన లాభం ఆ కంపెనీ ఏమైనా చేసుకోవచ్చు. మార్గదర్శి సంస్థ అదే చేస్తోంది. మార్గదర్శి సంస్థ నుంచి చిట్ పాడుకొని, షూరిటీస్ ఇవ్వలేక ప్రీ పేమెంట్ చేసే వారికి కూడా, ఆ సొమ్ము పై వడ్డీ చెల్లించవలసిన అవసరం లేకపోయినప్పటికీ, నాలుగు శాతం వడ్డీని చెల్లిస్తోంది. అలాగే వారికి ముందుగానే అడ్వాన్స్ రిసీప్ట్ ను అందజేయడం జరుగుతోంది. ప్రీ పేమెంట్ లకు సంబంధించిన మొత్తాన్ని కాన్సలిడేట్ గా 50 నుంచి 60 కోట్ల రూపాయలను ఒకే చోట డిపాజిట్ చేస్తోంది. దీని ద్వారా చందాదారులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కొంచెం ఎక్కువ వడ్డీ వారికీ వస్తుంది . అయితే ఈ కేసు విచారణ చేస్తున్న అధికారులకు ఈ కాన్సెప్ట్ అర్థమైనట్లుగా లేదు. బ్యాలెన్స్ షీట్ ను ఎక్కడికక్కడ రిజిస్ట్రార్లకు ఇవ్వాలన్నా సంజయ్ వాదనలలో అర్థం లేదు. మార్గదర్శి సంస్థ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కంపెనీ చట్ట ప్రకారం ఆర్ ఓ సి కి అందజేసిన తర్వాత, తమ బ్రాంచ్ పరిధిలోని సబ్ రిజిస్టార్లకు అందజేస్తుంది. ఒకవేళ మార్గదర్శి తప్పు చేసిందని అనుకుంటే 1982 నుంచి ప్రభుత్వాలు ఏమి చేస్తున్నట్లు?. గత మూడేళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజిగా బాధ్యతలను నిర్వహించిన ఐఏఎస్ అధికారులు తప్పు చేసినట్టేనా?. వారికి ఓనమాలు కూడా తెలియవా??. ఒకవేళ వారు కూడా తప్పు చేశారని భావిస్తే, సంజయ్ వారిపై కేసులు నమోదు చేయాలి.

బ్యాలెన్స్ షీట్ అప్రూవ్ చేసినందుకు చర్యలు తీసుకోవాలి. కంపెనీ లా ప్రకారం రెండేళ్ల పాటు బ్యాలెన్స్ షీట్ అందజేయకపోతే, ఆ సంస్థ గుర్తింపును ఆర్ ఓ సి రద్దు చేస్తుంది. 1982 చిట్ పండ్ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవలసి ఉండగా, ఢిల్లీకి వచ్చి సిఐడి చీఫ్ అల్లరి చేయడం ఎందుకు?, అంతిమంగా రామోజీరావు చిటికెన వేలు మీద వెంట్రుకను కూడా పీక్కోలేరన్న విషయాన్ని తెలుసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు తప్పని తేలితే ఏపీ సిఐడి చీఫ్ సంజయ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఏజీ గా వ్యవహరిస్తున్న జూనియర్ అధికారి రామకృష్ణ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లు ఏమి చేస్తారు?, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఏ శిక్షకైనా సిద్ధమేనా అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

ఒరేయ్ సత్తిగా ! నన్ను ఒరేయ్ సన్నాసి అన్నావంటా . సాక్షి వెధవ రాసాడు . నీ గెలుపుకు నేను ఎంత సహకరించానో అందరికీ తెలుసు…
ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గెలుపుకు తాను ఎంత సహకరించానో అందరికీ తెలుసు. ఎవరు ఎవరిని గెలిపించారో నియోజకవర్గ ప్రజలకు తెలుసు. తనని సత్తి గాడు గెలిపించానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. తాను నియోజకవర్గానికి రావడానికి భయపడుతున్నట్లుగా కొట్టు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. ప్రధానమంత్రి రాక సందర్భంగా, తాను హాజరవుతానంటే ముఖ్యమంత్రి జడుసుకొని తనని రాకుండా అడ్డుకున్నారు. రఘు రామ కృష్ణంరాజు హాజరైతే ప్రోగ్రాం అభాసు పాలవుతుందని తప్పుడు ఇంటలిజెన్స్ నివేదికలను ఇప్పించింది ముఖ్యమంత్రి కాదా? తనపై తప్పుడు కేసులను నమోదు చేసి అరెస్టు చేసేందుకు ప్రయత్నించలేదా?? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ, జనసేనకు చెందిన వారికి ఎంపీ నిధులు ఇస్తున్నారని పేర్కొంటున్న కొట్టు సత్యనారాయణ, ఏనాడైనా తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ నిధులు కావాలని అడిగారా?, ఎప్పుడైనా తన కార్యాలయానికి లేఖ రాశారా?? అంటూ ప్రశ్నించారు. తనని అడుగుతున్న ప్రజాప్రతినిధులందరికీ నిధులు ఇస్తున్నానని తెలిపారు. బొలిశెట్టి శ్రీను, బాబ్జీలు తనని కలిసి నిధులు కావాలని అడిగారు… ఇచ్చాను.

తనని గెలిపించిన ప్రజలు అన్ని పార్టీలలో ఉండవచ్చు. తనని అన్ని పార్టీల వారు అభిమానిస్తూ ఉండవచ్చు. తాను నిధులు ఇస్తుంటే, ఆచంట ఎమ్మెల్యే మీసాల నిరక్షర మాజీ మంత్రి మాదిరిగా అడ్డం పడవు. ఆ సంస్కారం నీలో ఉందని అభినందిస్తున్నాను. ఒరేయ్ సన్నాసి అని అన్నావని జగన్ కంపెనీ అయిన సాక్షి వాడు రాసాడు కదా అనందంగా ! ఆ జగన్మోహన్ రెడ్డి కి చెప్పు, తనని పార్టీ నుంచి ఇష్టం లేకపోతె సిగ్గుంటే బహిష్కరించమని. నన్ను ఎవరు పిక్కునేది ఏమీ లేదు. తాను పార్టీకి, గెలిపించిన ప్రజలకు విధేయుడిగా ఉన్నాను. పడిపోతున్న ఈ పార్టీకి మేలు చేయడానికి నాలుగు మంచి మాటలు చెబుతున్నాను. పార్టీలో వద్దంటే పార్టీ నుంచి తొలగిస్తే వెళ్లిపోవడానికి సిద్ధమని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

LEAVE A RESPONSE