– రాయి మీద కూడా మొక్కను నాటడం మోదీకే సాధ్యం
– తెలంగాణలో బీజేపీ వికాసం మొదలైంది
– ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకోపన్యాసంలో పార్లమెంట్ సభ్యులు, బిజెపి జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ సుధాంశు త్రివేది
హైదరాబాద్: వాజ్ పేయి స్మారకోపన్యాసం జరిగేందుకు హైదరాబాద్ ను మించిన సరైన ప్రదేశం మరొకటి ఉండదు. వాజ్ పేయి సమయంలో ఎక్కువ ఎంపీలను ఇచ్చిన ప్రాంతం కూడా ఇదే. 29 మంది ఎన్డీయే ఎంపీలు ఇక్కడ గెలిచారు. తెలంగాణలో ఈసారి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. నాడు కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవారు.
వాజ్ పేయి పేర్కొన్నట్లు.. తెలంగాణలో బీజేపీ వికాసం మొదలైంది.
మొదటిసారి ఎంపీగా ఎన్నికైనప్పుడే వారి సామర్థ్యాన్ని చూసి అందరూ ఏనాటికైనా ప్రధాని అవుతారనుకున్నారు. 40 ఏళ్ల తర్వాత వారు ప్రధానిగా దేశానికి సేవ చేశారు.
భారతదేశ చరిత్రలో.. కేవలం ఇద్దరే.. నాయకులుగా పుట్టి ప్రధానమంత్రి అయిన వారిద్దరే. ఒకరు వాజ్ పేయి. రెండోది మోదీ.1980 నుంచి 1996 వరకు ప్రతి ఒక్కరూ వాజ్ పేయి గారు ప్రధాని కావాలని కోరుకున్నారు. 2007 నుంచి 2014 వరకు ప్రతి ఒక్కరూ మోదీ ప్రధాని కావాలని కోరుకున్నారు.మిగిలిన వారు పరిస్థితులకు అనుగుణంగా ప్రధానమంత్రి అయ్యారు. వీరిద్దరూ నాయకులుగా గుర్తింపు పొందిన తర్వాత ప్రధానమంత్రి అయ్యారు. భారతదేశంలో ప్రజల ద్వారా ఎన్నికైన తొలి ప్రధానమంత్రి వాజ్ పేయి.
ప్రభుత్వం ఏర్పాటైన.. తర్వాత తొలి నిర్ణయం.. పోఖ్రాన్ అణు పరీక్షలు.
1974తో పోలిస్తే.. 1998 పరీక్షలు చాలా భిన్నమైనవి. 1974లో మన పరీక్షలకు ముందే అమెరికా కు తెలిసిపోయి తీవ్ర విమర్శలు చేసింది. కానీ 1998లో చేసిన పరీక్షల విషయం అమెరికా నిఘా సంస్థకు, రష్యా నిఘా సంస్థకు పత్తాలేదు. మేం శాంతియుత అవసరాలకు మేం అణుపరీక్షలు చేశాం. ఇప్పుడు మేం అణ్వస్త్ర దేశం అని ఘనంగా ప్రకటించుకున్నాం.
ఇవాళ కొందరు మోదీ జీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నాడు అది మరెంత తీవ్రంగా ఉండేదో ఆలోచించుకోండి. నాడు మన ఆర్థిక పరిస్థితి కూడా అంత బలంగా లేదు. దేశంలో ఒక్క డాలర్ కూడా పెట్టుబడి రాని పరిస్థితుల్లో.. ప్రవాస భారతీయులు 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు.
1999 నుంచి 2004 మధ్య 6 కోట్ల ఉద్యోగాల కల్పన జరిగింది. 1998 మేలో పోఖ్రాన్ పరీక్షలు చేస్తే.. మార్చి2000 నాటికి అంటే 22 నెలల్లో.. వచ్చిన మార్పు ఏంటంటే.. మొదటిసారి అమెరికా అధ్యక్షుడు (బిల్ క్లింటన్) 5 రోజులు భారత్ లో ఉన్నాడు. ఇది విపత్కర పరిస్థితుల్లోనూ ఎలా వాజ్ పేయి దేశాన్ని ముందుకు నడపాలో ఆయనకు బాగా తెలుసు.
భారత పర్యటనకు అమెరికా అధ్యక్షుడు వస్తే.. ఆ వెంటనే పాకిస్తాన్ లోనూ పర్యటించేవారు. కానీ ఆ పర్యటనలో పాకిస్తాన్ లో కనీసం 5 గంటలకు కూడా పాక్ లో అమెరికా అధ్యక్షుడు గడపలేదు. అమెరికా, జపాన్ ఆంక్షలు విధిస్తే ఏమాత్రం ఆలోచించలేదు.యురోపియన్ కంపెనీలను, వియత్నాం, కంపెనీలను ఆహ్వానిస్తాం. మాకేం భయం లేదని వాజ్ పేయి బలమైన సంకేతాన్నిచ్చారు.
వాజ్ పేయి అమెరికాలో ఉన్నప్పుడు.. వారి ప్రసంగాన్ని వినేందుకు ఆ దేశం నలుమూలలనుంచి భారతీయులు ఉత్సాహంగా వచ్చారు. అది వారి పట్ల ప్రజలకున్న గౌరవానికి నిదర్శనం. 2002లో నేను అమెరికాలో పీవీ నరసింహారావు ని కలిసే అవకాశం కలిగింది. ఈ సందర్భంగా పీవీ తో.. మాట్లాడుతూ.. ‘దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు అద్భుతమైన పాలనాదక్షతను మీరు చూపించిన తీరు.. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే మొదటిసారి చూశాను. ఆర్థిక సంక్షోభం దిశగా దేశం వెళ్తున్నసమయంలో, మండల్ కమిషన్ పేరుతో కుల ఉద్యమాలు తీవ్రమైన సందర్భంలో, పంజాబ్ లో ఉగ్రవాదం సమసిపోకముందే కశ్మీర్ లో ఉగ్రవాదం పెరుగుతున్న సమయంలో, LTTE ద్వారా.. దేశ ప్రధాని హత్య జరిగి విపత్కర పరిస్థితులు నెలకొన్న సమయంలో.. మీరు చూపిన చొరవ గొప్పది. ఇది కాకుండా మైనారిటీ ప్రభుత్వాన్ని మీరు నడిపారు. అలాంటప్పుడు మీరు వాజ్ పేయి సలహాలు తీసుకునేవారా?’ అని అడిగాను.
దానికి ఆయన స్పందిస్తూ.. కఠినమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు వాజ్ పేయి ఫోన్ వస్తుంది. సూచనలు అందుతాయన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 243 సీట్లున్నప్పటికీ.. 182 సీట్లున్న (1999లో) బీజేపీయే బలమైన సంకీర్ణాన్ని నడుపుతోందని పీవీ గారన్నారు.
అటల్ ని దేశమంతా నాయకుడిగా గుర్తిస్తారు. నన్ను నా పార్టీ నాయకుడు కూడా ఎంపీగా గుర్తించడం లేదు అని పీవీ గారన్నారు.
భారతదేశంలో అటల్ జీ ప్రభుత్వంలో వచ్చిన పెద్ద మార్పు.. అయోధ్యకు సంబంధించి.. రాడార్ ద్వారా గ్రౌండ్ పెనిట్రేషన్ చేస్తూ.. మందిరం అక్కడే ఉందన్న ఆధారాలు కోర్టు ముందు పెట్టారు.
రామమందిర నిర్మాణం మోదీ హయాంలో వచ్చింది. దేశంలో రాజకీయాలను ఐదేళ్లలో వచ్చిన మార్పు కాకుండా.. 30-40 ఏళ్ల తేడాలో చూడాలి. 1991లో దేశంలో కేవలం ఆరు రోజుల ఫారిన్ రిజర్వ్స్ ఉండేవి.
అదే సమయంలో.. కేవలం 1 బిలియన్ డాలర్ ఫారిన్ ఎక్స్ చేంజ్ రిజర్వ్ ఉండేది. 2004లో వాజ్ పేయి సమయంలో ఇది 100 బిలియన్ డాలర్లు అయింది. మోదీ దీన్ని 500 బిలియన్ డాలర్లకు తీసుకొచ్చారు. ఇప్పుడు 600 బిలియన్ డాలర్లు దాటింది. విపత్కర పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వారికే చెల్లింది.
పార్లమెంటులో దాడి సమయంలో ఒక అధికారి వాజ్ పేయి వద్దకు వచ్చి.. దాడి గురించి టీవీలో వచ్చిన వార్తలను చూపిస్తూ.. ఎమర్జెన్సీ సమావేశం ఏర్పాటుచేయాలని సూచించగా.. దీనికి వాజ్ పేయి సమాధానమిస్తూ.. ఇప్పుడు సిస్టమ్ యాక్టివేట్ అయింది. అధికారులంతా పరిస్థితిని కంట్రోల్ చేసే పనిలో ఉన్నారు. నేను ఇప్పుడు సమావేశానికి పిలిస్తే..నాకు ఏం చెప్పాలనే దానిపైనే వారు పనిచేస్తారు. అని కూల్ గా సమాధానం ఇచ్చారు.
వారు వారి పనిచేసిన తర్వాత ఫైనల్ రిపోర్టు తీసుకుందాం అన్నారు.
ఇది వాజ్ పేయి గారి స్థిత ప్రజ్ఞతకు నిదర్శనం.
1901 జనవరి 1 నాడు దేశంలో బ్రిటిషర్ల ప్రభుత్వం ఉంది. 1951 జనవరి 1 నాడు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2001 జనవరి 1 నాడు దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అదే సమయంలో.. గుజరాత్ లో మోదీ సీఎంగా ఉన్నారు. వరుసగా మూడు సార్లు ఒకపార్టీ స్పష్టమైన మెజారిటీతో గెలిచింది.
ఆ తర్వాత వరుసగా మూడుసార్లు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది
19వ దశకంలో.. బ్రిటిషర్లు.. 20 శతకం కాంగ్రెస్ దేశాన్ని పాలిస్తే. 21 దశకాన్ని బీజేపీ పాలిస్తోంది.
2001 నుంచి భారతదేశ సక్సెస్ స్టోరీ మొదలైంది. 2003-04లో మొదటిసారి మనం కరెంట్ అకౌంట్ సర్ ప్లస్ అయ్యాం. అదే ఏడాది 100 బిలియన్ల డాలర్ల ఫారిన్ ఎక్స్ ఛేంజ్ అందుకున్నాం.
స్వామి వివేకానంద గారు సూచించినట్లుగా దేశం ముందుకెళ్తుంది.
ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. వాజ్ పేయి ఆదేశించారు. మోదీ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
జన్ ధన్ అకౌంట్లు సాధ్యమా అని అనుమానాలు తలెత్తాయి. ఆర్బీఐ కూడా ఇది సాధ్యం కాదని చెప్పింది. ఇవాళ్ 54 కోట్ల జన్ ధన్ అకౌంట్లు వచ్చాయి.
డీబీటీ ద్వారా ఆ అకౌంట్లలో పంపించారు. నాడు అటల్ జీ ఆలోచించారు. దీన్ని మోదీ ఆచరిస్తున్నారు. రాయి మీద కూడా మొక్కను నాటడం మోదీ కే సాధ్యం.
ఒకప్పుడు భారతదేశాన్ని అప్పుల కుప్ప అనేవారు. కానీ ఇవాళ మోదీ నిర్ణయాల కారణంగా.. IMF చీఫ్ ఇటీవల మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ప్రపంచ గ్లోబల్ గ్రోత రేట్ లో భారత్ వాటా 15%గా ఉంటుందని స్పష్టం చేశారు. ఇది భారతదేశం వాజ్ పేయి స్వప్నించిన లక్ష్యాలను చేరుకునే క్రమంలో.. మోదీ నాయకత్వంలో ముందుకెళ్తున్న తీుకు నిదర్శనం