– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతోనే ఎమ్మెల్సీ భరత్ శాంతిభద్రతల సమస్య సృష్టించారు
– డీజీపీకి లేఖ రాసిన తెదేపా నేత వర్ల రామయ్య
చంద్రబాబు నాయుడి కుప్పం పర్యటనపై అధికార పార్టీ గుండాల దాడి సంధర్బంగా పోలీసుల అసమర్ధతమై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి లేఖ రాసిన తెదేపా నేత వర్ల రామయ్య
చంద్రబాబు కుప్పం పర్యటన సంధర్బంగా పోలీసులు వ్యవహరించిన తీరు ఆ శాఖకు తీరని మచ్చ. కుప్పంలో పోలీసులు వ్యవహరించిన తీరు వారు అధికార పార్టీతో కుమ్మక్కైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి దాసోహం అవడం చాలా బాధాకరం.గతంలో ఎంతో కీర్తి ప్రతిష్టులు తెచ్చుకున్న పోలీసు శాఖ జగన్ ముఖ్యమంత్రిత్వంలో ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది.
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి మూడు రోజుల కుప్పం పర్యటన గురించి అధికారులకి ముందుగానే తెలియజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు 1989 నుంచి ఇప్పటికి 7 సార్లు కుప్పంకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు జెడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న నాయకులు. 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి పోలీసు శాఖ ఆర్టికల్ 19ను ఉల్లంగిస్తూ అసమ్మతి స్వరాన్ని అణిచివేస్తోంది.దీనిపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గౌరవ హైకోర్టు డిజిపిని సైతం అనేకమార్లు పిలిపించి ప్రజల ప్రాథమిక హక్కులను రక్షించడంలో మరింత జాగ్రత్త వహించాలని హెచ్చరించినప్పటికీ తీరు మారలేదు.
అధికార పార్టీ ఎమ్మెల్సీ భరత్ నేతృత్వంలో చంద్రబాబు నాయుడి కాన్వాయ్‌పై అడుగడుగున దాడి చేశారు. కుప్పంలో టిడిపి మద్దతుదారులు ర్యాలీ నిర్వహించకుండా అడ్డుకునేందుకు రాళ్లు రువ్వి కర్రలతో దాడి చేశారు. అధికార పార్టీ గూండాలు టిడిపి మద్దతుదారులను భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశ్యంతో టిడిపి ఫ్లెక్సీలు, బ్యానర్లను చింపి తగులబెట్టారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతోనే ఎమ్మెల్సీ భరత్ శాంతిభద్రతల సమస్య సృష్టించారనేది సుస్పష్టం. అధికార పార్టీ గూండాలను అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారు. చంద్రబాబు నాయుడి పర్యటనకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో కూడా పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ ప్రారంభించక ముందే అధికార పార్టీ గూండాలు క్యాంటీన్‌పై దాడి చేసి ధ్వంసం చేయడం బాధాకరం.
రాష్ట్ర ప్రజలలో పోలీసుశాఖపై విశ్వాసం పెంపొందించడానికి శాంతిభద్రతలు, ప్రాథమిక హక్కుల పునరుద్ధరించడానికి డీజీపీ చర్యలు తీసుకోవాలి. పోలీసు శాఖ పనితీరును ఒకసారి సమీక్షించుకుని చట్టం ప్రకారం చర్యలు తీసుకుని ప్రజల్లో విశ్వాసం పెంచాలి.