– అన్నాచెల్లెల కు గాయాలు
– తాడిపత్రి లో ప్రజాస్వామ్యం ఖూనీ
– తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి
తనపై దాడి చేసిన అధికార పార్టీ వారికి అండగా ఉంటూ తన పైనే దాడి చేశారని తాడిపత్రి డీఎస్పీ పై ఆరోపణలు చేసి ప్రైవేట్ కేసు వేసిన తెలుగుదేశం కౌన్సిలర్ మల్లికార్జున ఇంటిపై దుండుగులు దాడి చేయడం సంచలనం కలిగించింది. దళిత కౌన్సిలర్ అయిన మల్లికార్జునపై దాడి జరగడం ఇది రెండోసారి.మల్లికార్జున ఇంటికి దూరి దుండగులు మల్లికార్జున తోపాటు యువతి అని కనికరం చూపకుండా ఆయన చెల్లెలు పై కూడా దాడి చేయడం తాడిపత్రి లో సంచలనం కలిగింది… వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ దాడిని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాడిపత్రి లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని… చట్టాన్ని కాపాడాల్సిన డీఎస్పీనే స్వయంగా ప్రోత్సహించి దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు… దళిత, బడుగు బలహీన వర్గాల పై దాడులు చేయించడం డీఎస్పీ నైజమని ఆయన పేర్కొన్నారు… ప్రజాస్వామ్య వాదులు అందరూ ముక్తకంఠంతో ఈ దాడిని ఖండించాలని ఆయన కోరారు.కౌన్సిలర్ ఇంటిపై దాడి వ్యవహారం అనంతపురం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.