-జగన్‍కు అధికారం రావాలనే అభిమానంతో దాడికి పాల్పడ్డా
– మీడియా ద్వారా జగన్ పై సానుభూతి పెరుగుతుందని భావించా
– ప్రమాదం జరగకుండా కోడికత్తిని 2 సార్లు స్టెరిలైజ్ చేయించా
– ఈ సంఘటన తప్పు అని నాకు తెలుసు
– గతంలో NIAకి చెప్పిన నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు
– చార్జ్ షీట్, కౌంటర్ తో పాటు ఈ-స్టేట్‍మెంట్‍ను జతచేసిన NIA
– కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు
అమరావతి :కోడికత్తితో దాడి చేశానని నిందితుడు శ్రీను అసలు రహస్యం విప్పాడు. తాను దాడి చేస్తే మీడియా ద్వారా.. ప్రజల్లో జగనన్నకు సానుభూతి వస్తుందన్న ఆలోచనతోనే, జగన్‌పై దాడి చేశానే తప్ప, తన వెనక ఎవరూ లేరని కుండబద్దలు కొట్టాడు.
ఎన్‌ఐఏ విచారణ సందర్భంగా కోడికత్తి శ్రీను ఇంకా ఏమన్నారంటే.. నేను మొదటి నుంచి వైఎస్సార్ అభిమానిని. జగన్ అధికారంలోకి రావాలని కోరుకున్నాను. ప్రజల్లో సానుభూతి కోసం జగన్‍పై అటాక్ చేశాను. మీడియా ద్వారా జగన్ పై సానుభూతి పెరుగుతుందని భావించా. ప్రమాదం జరగకుండా కోడికత్తిని 2 సార్లు స్టెరిలైజ్ చేయించా .
జగన్‍కు టీ ఇచ్చేందుకు వెళ్లి ఈసారి ఎన్నికల్లో 160 సీట్లతో గెలుస్తారని కూడా ఆయనకు చెప్పాను. నా మాటలకు ఆయన చిరునవ్వు చిందించారు. అటాక్ జరిగిన వెంటనే వైసీపీ వారు నాపై దాడి చేశారు. పోలీసులు నన్ను కాపాడి ఓ గదిలో బంధించారు. అనంతరం పోలీస్‍స్టేషన్‍కు తరలించారు.
అప్పట్లో ఆంధ్రా పోలీసులు నన్ను భాగా కొట్టారు. ఈ సంఘటన వెనుక ఎవరున్నారని విచారణ చేశారు. నా సొంత ఆలోచనతోనే దాడికి పాల్పడ్డానని చెప్పాను. ఎన్నిసార్లు అడిగినా ఇదే విషయం చెప్పాను. కట్టు కథలు చెప్పాలని పోలీసులు నాపై ఎటువంటి ఒత్తిడి తేలేదు. అందువల్లే జడ్జి దగ్గర నేను పోలీసులపై ఏ ఆరోపణలు చేయలేదు.
ఇదే అంశంపై నేను 24 పేజీల పుస్తకం రాశాను. పుస్తకం పూర్తి చేద్దామంటే విశాఖ జైలు సిబ్బంది లాగేసుకున్నారు. ఈ సంఘటన తప్పు అని నాకు తెలుసు. జగన్‍కు అధికారం రావాలనే అభిమానంతో దాడికి పాల్పడ్డాను