Suryaa.co.in

Andhra Pradesh

దేవాలయాలపై దాడులు నిలుపుదల చేయాలి

– ఇప్పటివరకు దేవాలయాలపై, హిందూ దేవతల ప్రతిమలపై 226 దాడులు
– దేవాలయాలపై దాడుల కారణంగా రాష్ట్రంలో లౌకికవాదం దెబ్బతినే అవకాశం
– దేవాలయాలపై దాడులు, హిందూ దేవతల ప్రతిమలు ధ్వసం చేయడంపై డీజీపీకి పిర్యాదు చేసిన తెదేపా బ్రాహ్మణ సాధికారసమితి రాష్ట్ర కన్వినర్ బుచ్చిరాంప్రసాద్

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయి. రాష్ట్ర చరిత్రలో దేవుళ్లపై, దేవాలయాలపై దాడులు ఎన్నడూ జరిగలేదు. ఇప్పటివరకు దేవాలయాలపై, హిందూ దేవతల ప్రతిమలపై 226 దాడులు జరిగాయి. హిందూ దేవాలయాలపై ఇన్ని దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.

హిందూ దేవాలయాలపై మొదటి దాడి జరిగినప్పుడే సరైన చర్యలు తీసుకుని ఉంటే మరిన్ని దాడులు జరిగేవి కావు.దాడులపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మౌనం వహించడం దాడి చేస్తున్న వారిని ప్రోత్సహించినట్లే ఉంది.దేవాలయాలపై దాడుల కారణంగా రాష్ట్రంలో లౌకికవాదం దెబ్బతినే అవకాశం ఉంది.ఇకనైనా దేవాలయాలపై దాడులు నిలుపుదల చేయకపోతే రాష్ట్రంలో మత విధ్వేషాలు చెలరేగే ప్రమాదం ఉంది.

ఈ నేపద్యంలో డీజీపీ కలుగజేసుకుని దేవాలయాలపై దాడులు నిలుపుదల చేయాలి. గత మూడున్నరేళ్లలో రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై జరిగిన దాడులపై సమగ్ర విచారణ చేయించాలి.రాష్ట్రంలో సామాజిక ప్రశాంతకు విఘాతం కలుగకుండా అన్ని మత విశ్వాసాలు గౌరవించబడేలా చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగంలో పౌరులకు కల్పించిన ప్రాధమిక హక్కులు కాపాడంలో పోలీసులు కీలకపాత్ర వహించాలి.

LEAVE A RESPONSE