– ఆకివీడులో ఇద్దరు యువకులకు దేహశుద్ధి
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో దారుణం జరిగింది. స్థానికరైల్వే స్టేషన్ రోడ్డు లో నివసిస్తున్న సువర్ణ కుమార్తె అనే బాలిక 3వ తరగతి చదువుతోంది. తల్లి వేరే పని మీద ఊరు వెళ్లడంతో బాలికను రైల్వే స్టేషన్ సమీపాన నివసిస్తున్న తోపుడుబండ్లపై జొన్న పొత్తులు అమ్మే ఇద్దరు యువకులు వలవేశారు. బాలికను జడ్ పి హై స్కూల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం నుంచి మార్కెట్ యార్డులోకి గోడ దూకించారు. రోజువారి అమ్మాయికి చాక్లెట్లు కొనుక్కునేందుకు డబ్బులు ఇస్తామని నమ్మబలికారు.
మార్కెట్ యార్డ్ లో పురాతన దిశకు చేరిన భవంతిలోకి తీసుకువెళ్లి ఒంటి మీద బట్టలు విప్పేసారు.అయితే అత్యాచారయత్నం చేసేలోపు ఇదంతా గమనిస్తున్న మరో ఇద్దరు యువకులు విషయాన్ని ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. అనంతరం విషయాన్ని వ్యవసాయ మార్కెట్ యార్డు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఉపాధ్యాయులు, మార్కెట్ యార్డు సిబ్బంది, బాలిక బంధువులు యువకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.