– రవాణా వాహనాల పై రేడియం స్టిక్కర్ల భారీ దోపిడీని అరికట్టాలి
– ఏపీ సహా డిల్లీ, బెంగుళూరు, తమిళనాడు, డిల్లీ లో లేని ఎల్పిజిగ్యాస్ కొరత ఇక్కడ ఎందుకు వచ్చింది?
– బియంయస్ డిమాండ్
– బియంయస్ ఆధ్వర్యంలో ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో ఆటో డ్రైవర్ల ఆందోళన
హైదరాబాద్: ఆర్టీఓ లో రేడియం స్టిక్కర్ల 6వేల కోట్ల ఆర్థిక దోపిడి అరికట్టాలని మరియు ఆటో, ట్యాక్సీ లలో ఎల్పిజి గ్యాస్ బ్లాక్ మార్కెట్ బంద్ చేయాలని డిమాండ్ చేస్తూ బియంయస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో ఆటో డ్రైవర్లు ఆందోళన చేశారు.
ఈ కార్యక్రమంలో బిపిటియంయం అఖిల భారత ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి, తెలంగాణ స్టేట్ ఆటో&టాక్సీ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సి.హెచ్ నంద కిషోర్, ప్రధాన కార్యదర్శి బి పెంటయ్య గౌడ్, గ్రేటర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి అశ్విన్ రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు హబీబ్, తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ మజ్దూర్ మహా సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీధర్ రెడ్డి , కార్యద్యక్షులు సమ్మయ్య యాదవ్, మినీ గూడ్స్ వెహికిల్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి జహంగీర్ , ఆర్.మహేష్, రాములు, పరశురాం, బాబురాజ్ తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 90 శాతం ఆటోలు ఎల్పిజి తో నడుస్తున్న విషయం తెలిసినదే. అయితే ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ఆటో గ్యాస్ కొరత ఉంది అనేది కొంత వాస్తవం ఉండవచ్చు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్ కొరత లేదని చెబుతోంది. సరికదా పెట్రో డీలర్స్ అసోసియేషన్ వారు, బంకులలో ఎటువంటి కొరత లేదని ప్రకటన చేస్తున్నారు.
అయితే ఎల్పిజి గ్యాస్ కొరకు ఆటో డ్రైవర్లు మరియు ట్యాక్సీ లు కనీసం 2.5 నుంచి 3.5 కిలోమీటర్లు వాహనాలు బారుతీరుచున్నాయి. ఆటో డ్రైవర్లు కనీసం 6 గంటలు క్యూలో నిలబడే పరిస్తితి నిర్మాణం అయింది. ఎల్పిజి గ్యాస్ బంకు యజమానులు బ్లాక్ మార్కెట్ కు తెర లేపుతున్నారు అనే ప్రచారం ఉంది.
అసలే ఆర్.టి.సి బస్సులలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం వలన ఉపాధి దెబ్బతిన్న డ్రైవర్లకు, ఎల్పిజి గ్యాస్ దొరకక పోవడం తో గంటల తరబడి క్యూ లో నిలబడటంతో వారి ఉపాధి పుండుపై కారం జల్లిన చందంలా తయారు అయింది. పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ సహా డిల్లీ, బెంగుళూరు, తమిళనాడు లో డిల్లీ లో లేని ఎల్పిజిగ్యాస్ కొరత ఇక్కడ ఎందుకు వచ్చింది అనేది ప్రశ్నగా మారింది. కావున రవాణా శాఖ అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్రో డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులను పిలిచి ఎల్పిజి గ్యాస్ కొరత లేకుండా మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వాహనాలకు వేయవలసి రేడియం స్టిక్కర్ల రెట్లు రెట్టింపు కావడం సరికాదు.
రాష్ట్ర రవాణా శాఖ రోడ్ సేఫ్టీ విషయంలో భాగంగా 11.2.26 నాడు ఒక సర్క్యులర్ విడుదల చేసి రవాణా వాహనాలకు రేడియం స్టిక్కర్లు పెట్టుకోవడానికి, బయట రాష్ట్రాల కార్పోరేట్ కంపెనీలకు టెండర్ ఇచ్చి రేడియం స్టిక్కర్ రెట్లు రెట్టింపు చేసింది. అదే విధంగా వాహనానికి చుట్టూ మొత్తం పెట్టుకునే విధానాన్ని తప్పని సరి చేసింది.
ఒక ఆటో రేడియంకు 1000 అవుతే గూడ్స్ వాహనానికి 5000 అవుచున్నది. రాష్ట్రంలో సుమారు 2 కోట్లు యావరేజ్ గా ఒక వాహనానికి 3000 అనుకుంటే మొత్తం 6వేల కోట్లు అవుతున్నాయి. ఒక సగటు రవాణా డ్రైవర్ వద్ద ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా వసూలు చేస్తారని అసలు జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కి మనసు ఎలా వచ్చనదని బియంయస్ అనుబంధ తెలంగాణ స్టేట్ ఆటో&టాక్సీ డ్రైవర్స్ యూనియన్ ప్రశ్నిస్తున్నది.