-సీబీఐ ని కూడా ప్రజలు శంకించే పరిస్థితి
-భాస్కర్ రెడ్డి జైల్లో ఉండటమేంటి ?,
-అవినాష్ రెడ్డి బయట ఉండటమేంటి?
-సీబీఐ అవినాష్ రెడ్డిని పిలిచినప్పుడల్లా సీఎం ఢిల్లీ పర్యటన ఎందుకు? ఖరారావుతోంది?
-తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
న్యాయస్థానాలతో అవినాష్ రెడ్డి ఆటలాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు.సీబీఐ ని కూడా ప్రజలు శంకించే పరిస్థితి వస్తోంది. వివేకా హత్యకేసులోనే నిందితులుగా ఉన్న తండ్రీ కొడుకులలో.. భాస్కర్ రెడ్డి జైల్లో ఉండటమేంటి ?, అవినాష్ రెడ్డి బయట ఉండటమేంటి? సీబీఐ అవినాష్ రెడ్డిని పిలిచినప్పుడల్లా సీఎం దిల్లీ పర్యటన ఎందుకు ఖరారావుతోంది?
అవినీతిపరుడు, ఆరాచకవాది చేతుల్లో నుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్న ప్రజల అభిమతం మేరకే పొత్తులు ఉంటాయి. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ లను తిట్టేందుకే జగన్మోహన్ రెడ్డి ప్రజాధనం తో మీటింగ్ లు పెడుతున్నారు. రాజకీయంలో సర్వసాధారణమైన పార్టీల మధ్య పొత్తు అంశంపై జగన్మోహన్ రెడ్డిలో అంత కలవరం దేనికి ?
ఇందిరాగాంధీ కి వ్యతిరేకంగా 1977లో దేశంలో జనతా పార్టీ, నేతృత్వంలో జనసంఘ్, వామపక్ష పార్టీలన్నీ ఒక్కటి కాలేదా? 1985లో రాష్ట్రంలో భాజపా, వామపక్షాలు తెదేపాతో కలిసి కాంగ్రెస్ ను ఓడించలేదా? జగన్మోహన్ రెడ్డి ని ఓడించేందుకు అంతా ఒక్కటవుతున్నామన్న పవన్ వ్యాఖ్యలను ప్రజలు స్వాగతిస్తుండటంతో జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టట్లేదు.