• తమ్ముడు అరెస్ట్ కాకుండా అడ్డుపడటం వెనకున్న చిదంబరరహస్యం ఏమిటో జగన్ రెడ్డి బయటపెట్టాలి
• అవినాశ్ రెడ్డి అరెస్ట్ కు అడ్డుతగులుతున్న రాష్ట్రప్రభుత్వ వ్యవస్థలతీరుపై సీబీఐ గవర్నర్ కుఫిర్యాదు చేయాలి
• రాష్ట్రంలో జరగుతున్న పరిస్థితులపై వెంటనే గవర్నర్ జోక్యంచేసుకొని రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
• మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్ రెడ్డి ని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందా?
• దాన్ని పరిష్కరించడం పోలీసులు, ముఖ్యమంత్రి వల్లకాదా?
• తనతండ్రి కుటుంబాన్ని, తల్లినిచెల్లిని పక్కనపెట్టి మరీ జగన్ రెడ్డి, అవినాశ్ రెడ్డిని కాపాడటానికి ఎందుకు ఇంతలా దిగజారుతున్నాడు? దానివెనకున్న చిదంబరరహస్యం ఏమిటో ఆయనే సమాధానం చెప్పాలి
• ఏపీ పోలీసులు, ప్రభుత్వం అవినాశ్ రెడ్డి అరెస్టుకు అడ్డుతగిలితే వెంటనే సీబీఐ గవర్నర్ కు ఫిర్యాదుచేయాలి
• అవినాశ్ రెడ్డిచెప్పేది వింటూ, జగన్ రెడ్డిచేసేదిచూస్తూ కూర్చుంటే దేశంలోక్రిమినల్స్ ను శిక్షించడం సీబీఐ వల్ల అవుతుందా?
టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చింతకాయల విజయ్
రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తూ, ఆశ్చర్యం కలిగిస్తున్నాయని, అవినాశ్ రెడ్డికోసం ముఖ్యమంత్రి మొత్తంవ్యవస్థలనే ఎందుకు పణంగా పెడుతున్నాడనే దానివెనకున్న చిదంబర రహస్యం ప్రజలకు తెలియాల ని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!
“రాష్ట్రంలో జరుగుతున్న డెమోక్రసీ బ్యాక్ స్లైడింగ్ పై దేశమంతా ఆలోచించాలి. ఎన్నో సంవత్సరాలక్రితం హైకోర్ట్ న్యాయమూర్తిగాఉన్న జస్టిస్ రాకేశ్ గారు ఒక తీర్పుసందర్భంలో ఆ మాటవాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూలదో సేలా జగన్ రెడ్డి తీరుఉంది. అవినాశ్ రెడ్డి ఆసుపత్రిలో నాటకాలు ఆడుతుంటే, వైసీపీనేతుల, కార్యకర్తలు సీబీఐని అడ్డుకోవడం, స్థానిక పోలీసులు సీబీఐకి సహ కరించకుండా వారివిధినిర్వహణకు అడ్డుతగలడం దేనికిసంకేతం? మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్ రెడ్డి ని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందా? దాన్ని పరిష్కరించడం పోలీసులు, ముఖ్యమంత్రి వల్ల కాదా?
గతంలో నన్ను అరెస్ట్ చేయడానికి సీఐడీ అత్యుత్సాహంతో వ్యవహరించలేదా? నేనులేని సమయంలో నా ఇంటిపైకి సీఐడీఅధికారుల్ని పంపి, 5ఏళ్లవయసున్న నాకూతుర్ని విచారించి భయభ్రాంతులకు గురిచేశారు. ఇంటిగోడలుదూకి మరీ అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు రాని శాంతిభద్రతల సమస్య, అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వస్తుందా? మాజీమంత్రులు నారాయణ, రవీంద్రలను అరెస్ట్ చే సినప్పుడు పోలీస్ శాఖ, ప్రభుత్వానికిఇలాంటి కుంటిసాకులు ఎందుకుచెప్పలేదు ? అవినాశ్ రెడ్డిని కాపాడటానికి ముఖ్యమంత్రి ఆఖరికి తనతండ్రి కుటుంబా న్నికూడా పక్కనపెట్టి, ఇంతగా అధికారదుర్వినియోగానికి ఎందుకు పాల్పడుతు న్నాడో ఆయనే సమాధానం చెప్పాలి.
ఫ్యాబ్లో ఎస్కోబార్ ఆలోచనలే జగన్ రెడ్డి చేస్తున్నాడు
కొలంబియాలో ఉండే డాన్ ఫ్లాబ్లో ఎస్కోబార్ తనకు శిక్షవేస్తారన్న భయంతో, ఆఖ రికి కోర్టునే బాంబులతో పేల్చేశాడు. అలాంటివ్యక్తి ఆలోచనలేజగన్ రెడ్డి నేడు అమలుచేస్తున్నాడు. మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నవ్యక్తిని కాపాడటంకోసం రాజ్యాంగాన్నే దుర్వినియోగంచేస్తున్నాడు. ముఖ్యమంత్రి చర్యల్లో ప్రజాస్వామ్యా నికి పొంచి ఉన్నప్రమాదం కనిపిస్తోంది. వివేకానందరెడ్డి హత్యపై ఇష్టమొచ్చిన ట్టు మాట్లాడవద్దని, ఆయన్ని చంపింది ఆస్తికోసం కాదని, జగన్ చెల్లి షర్మిలే చెప్పింది. ఆమెవ్యాఖ్యలపై అన్నస్థానంలో ఉన్నవ్యక్తి ఇంతవరకు స్పందించలేదం టే, అతను ఎవరికోసం పనిచేస్తున్నాడో అర్థమవుతోంది. తల్లిచెప్పినా, చెల్లిచెప్పి నా ముఖ్యమంత్రి స్పందించడు. అవినాశ్ రెడ్డి అరెస్ట్ పై మాట్లాడిన మీడియాపై మాత్రం దాడిచేస్తారు. జగన్ రెడ్డికి ఉన్న సొంతఎంపీలబలంతో కేంద్రంలోని ప్రభు త్వం నడిచే పరిస్థితేగానీఉండిఉంటే, దేశవ్యాప్తంగా ఎప్పుడో నియంతపాలనకు శ్రీకారంచుట్టేవాడు. డిక్టేటర్ అంటే ఎలాఉంటాడో చెప్పడానికి జగన్ రెడ్డే పెద్ద ఉదాహరణ.
అవినాశ్ రెడ్డిలాగా అనుచరుల్ని అడ్డంపెట్టుకొని తాము తప్పించుకోలేదు
అవినాశ్ రెడ్డి తల్లిఆరోగ్యపరిస్థితి విషమిస్తే, ఆమెను హైదరాబాద్, బెంగుళూరు వంటి నగరాలకు ఎందుకు తరలించరు? ఆమెను అడ్డుపెట్టుకొని అవినాశ్ రెడ్డి అతని బంధువులఆసుపత్రిలో దాక్కుంటే, జగన్ రెడ్డి అతనికి రక్షణగా తనపార్టీ నేతలు, కార్యకర్తలు, పోలీసుల్ని నిలపడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయడం కా దా? తమకు ఈప్రభుత్వం సీఐడీతో తప్పుడునోటీసులు ఇచ్చి, అరెస్ట్ కు ప్రయ త్నించినప్పుడు తాము అవినాశ్ రెడ్డిలాగా తప్పించుకోలేదు. నిజాయితీతో, నిర్భ యంగా బయటకొచ్చి వ్యవస్థలకు సహకరించాము. అదీ మానాయకుడు మాకు నేర్పిన సంస్కారం, సభ్యత.
వివేకానందరెడ్డి హత్యతో తనకు సంబంధంలేనప్పుడు, తాను పాత్రధారి కానప్పు డు అవినాశ్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు? సీబీఐ పిలవగానే ఎందుకు విచారణకు వెళ్లడు? విచారణసంస్థలు ఎన్నిసార్లైనా విచారణకుపిలుస్తాయని ప్రతి పక్షనేతల విషయంలో సుద్దులుచెప్పే వారు, అదేసూత్రాన్ని వారెందుకుపాటించ రు? కోడికత్తి కేసులో కూడా విచారణకు హాజరకాకుండా ముఖ్యమంత్రి ఎందుకు తప్పించుకుంటున్నాడు? ట్రాఫిక్ సమస్య, ఆర్థికసమస్యలను ఎందుకు బూచిగా చూపుతున్నాడు? కోర్టుల్లో నిజాలుబయటపడి, ప్రజలకు తనబాగోతం తెలిసిపో తుందన్న భయంతోనా? 80ఏళ్లవయసులో ఈనాడు సంస్థఅధినేత రామోజీరావు జగన్ రెడ్డి పెట్టిన తప్పుడుకేసులు విచారిస్తున్న సీఐడీవిచారణకు సహకరిం చారు. అలాంటివ్యక్తే నిర్భయంగా బయటకువచ్చినప్పుడు ఈ తప్పుడు ముఖ్య మంత్రి, హత్యకేసులో నిందితుడైన అవినాశ్ రెడ్డి ఎందుకు బయటకురారు?
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు ఆలోచించాలి. హత్యారాజకీయాలు ప్రోత్సహిస్తూ, వాటిని అడ్డుపెట్టుకొని బతికేవారిని ఛీకొట్టాలి. తాముచేసిన నేరం నుంచి బయటపడటంకోసం ఆఖరికి చనిపోయిన వివేకానందరెడ్డి వ్యక్తిత్వాన్ని కూడా ఈ దుర్మార్గులు రోడ్డుకీడ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ తక్షణమే జోక్యంచేసుకోవాలి. ఆయన స్పందించకపోతే రాష్ట్ర భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది.
తల్లిని అడ్డం పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు
వివేకానందరెడ్డి హత్యకేసువిచారణను తొలుతసీబీఐకి అప్పగించాలన్న జగన్ రెడ్డి, తరువాత వద్దని కోర్టులోవేసిన పిటిషన్ ఎందుకు వెనక్కుతీసుకున్నాడు? నేడు అదేవ్యక్తి అవినాశ్ రెడ్డిని కాపాడటానికి ఎందుకు తన చేతిలోని వ్యవస్థలన్నింటినీ పణంగా పెడుతున్నాడు? సీబీఐకి అవినాశ్ రెడ్డి ఎందుకు సహకరించడు? గూగుల్ టేకౌట్ ద్వారా అడ్డంగా దొరికిపోయారు కాబట్టే ఆసుపత్రిలో కూర్చొని డ్రా మాలు ఆడుతున్నారు. అవినాశ్ రెడ్డి అరెస్ట్ అయితే, తరవాత ఎవరిగుట్టు బయ టపడుతుందో ముఖ్యమంత్రికి తెలిసే, ఆయన ఢిల్లీవెళ్లి మరీ కజిన్ బ్రదర్ ని కాపా డుకునేప్రయత్నం చేశారా? రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలుకావడంలే దు. రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే రాష్ట్రాన్ని కాపాడుకోగలమని ప్రజలంతా తెలుసుకోవాలి.
ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాలప్రకారమే పోలీసులు అవినాశ్ రెడ్డిని రక్షిస్తున్నారు
ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాలప్రకారమే పోలీసులు నడుచుకుంటున్నారు. అవినాశ్ రెడ్డి అరెస్ట్ కాకుండా, అతనిచుట్టూ ఎస్పీస్థాయిఅధికారుల్ని పెట్టి ముఖ్య మంత్రి అతన్ని కాపాడేప్రయత్నం చేయడం ముమ్మాటికీ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజ మే. దానిగురించి ప్రజలకుతెలియచేస్తూ చంద్రబాబుగారు గతంలోనే దీక్షచేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలప్రాణాలకు రక్షణఉండదని చెప్పా రు. ఇప్పుడు అదేకళ్లముందు కనిపిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై తక్షణమే గవర్నర్ దృష్టిపెట్టాలని కోరుతున్నాం. అలానే అవినాశ్ రెడ్డి వ్యవహారం పై యువత గళమెత్తాలి. యువతగొంతెత్తకపోతే వారిభవిష్యత్తే అగమ్యగోచరం అవుతుంది. అవినాశ్ రెడ్డిని కాపాడటం వెనకున్న చిదంబరరహస్యం ఏమిటో ముఖ్యమంత్రి తక్షణమే ప్రజలకు చెప్పాలి.
అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయలేకపోయిందన్న సందేశం దేశమంతా తెలిస్తే క్రిమినల్స్ ను శిక్షించడం ఎవరితరం కాదు
బాబాయ్ ని చంపేసి, ఆ హత్యను తనఎన్నికలకోసం వాడుకోవడం చాలాచాలా దారుణం. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారన్న సందేశం దేశమంతా వెళ్తే క్రిమినల్స్ ను అడ్డుకోవడం, శిక్షించడం ఎవరితరంకాదు. అవినాశ్ రెడ్డి లొంగిపోక పోతే, సీబీఐచూస్తూ ఊరుకోవడమేంటి? దొంగలు, దోపిడీదారులు, హంతకుల్ని అరెస్ట్ చేస్తే శాంతిభద్రతలసమస్య వస్తుందా? అవినాశ్ రెడ్డి తల్లిని అడ్డుపెట్టుకొని, ఆసుపత్రిని తనస్థావరంగా మార్చుకొని అక్కడకూర్చొని లేఖలురాస్తా.. నాటకా లు ఆడుతున్నాడు. సీబీఐవిచారణకు రమ్మంటే ప్రధానమంత్రైనా రావాల్సిందే, అవినాశ్ రెడ్డి ఎంత? అంబేద్కర్ రాజ్యాంగాన్నికాపాడటమే మాలక్ష్యం. దానికోసం తెలుగుదేశంపార్టీ ఎంతదూరమైనా వెళ్తుంది. అవినాశ్ రెడ్డిని సీబీఐ వదిలేస్తే, భవి ష్యత్ లో ఏ కేసులోనూ అసలుదోషుల్ని అరెస్ట్ చేయలేదు. కనీసం వారి ఇంటి తలుపు కూడా తట్టలేదు.
రాజ్యాంగ రక్షణ కోసం న్యాయవ్యవస్థ నుంచి వచ్చిన గవర్నర్ వెంటనే స్పందించాలి. రాష్ట్రంలోసీబీఐని బెదిరించడం, జడ్జీలను తిట్టడం, పోలీ సుల్ని బూతులుతిట్టడం లాంటి నీతిమాలినపనులకు శ్రీకారంచుట్టింది జగన్ రెడ్డే . ఆయన ఇలాంటిపనులు చేస్తున్నది కేవలం తనతమ్ముడు అవినాశ్ రెడ్డిని కాపాడుకోవడానికే. అవినాశ్ రెడ్డి 27వ తేదీవరకు ఎందుకు వ్యవధికావాలంటు న్నాడు? అప్పటికీ ఏంచేయాలని అవినాశ్ రెడ్డి, ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు? తన తమ్ముడి అరెస్ట్ లో జరుగుతున్న పరిణామాలపై జగన్ రెడ్డి తక్షణమే స్పం దించాలి. మీడియాముందుకొచ్చి ప్రజలకు వాస్తవాలుచెప్పాలి. సీబీఐ ప్రొసీజర్ ప్రకారం ఏపీ పోలీసుల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. వారు సీబీఐకి సహకరించాలి. దాని కి విరుద్ధంగా ఏపీ పోలీస్ పనిచేస్తే, వెంటనే సీబీఐ నెక్ట్స్ స్టెప్ వేసి, గవర్నర్ని కలవాలి. హత్యకేసులో ఉన్నవ్యక్తి ఎంపీఅయినా, ఎమ్మెల్యే అయినా అతన్ని వి చారించరా? అతన్ని సీబీఐ అరెస్ట్ చేయలేదా? అప్పుడు ప్రజలు సీబీఐని ఏమం టారు? ఎస్వీమోహన్ రెడ్డి శాంతిభద్రతలసమస్య వస్తుందని చెప్పడం పరోక్షంగా సీబీఐని హెచ్చరించడంకాదా?” అని విజయ్ ప్రశ్నించారు.