Suryaa.co.in

Andhra Pradesh

వైభవంగా ఉషా బహుమతులు పండుగ

విజయవాడ: ఉషా సాహితి పత్రికల నేతృత్వంలో జరిగిన బహుమతులు పండుగ విజయవాడ కేబీఎన్ కాలేజీ ఆవరణలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉషా ఎడిటర్ ఇన్ చీఫ్ శరత్ చంద్ర అధ్యక్షత వహించారు.
ఉషా నేతృత్వంలో జరిగిన సుజనా ఫౌండేషన్ నవలలు పోటీ, వెలగపూడి సీతారామయ్య కథ నవలలు పోటీ, తటవర్తి భారతి ప్రపంచం స్థాయి కథల పోటీ, సింగీతం ఘటికా చల రావు తల్లిదండ్రుల స్మారకంగా, తాడికొండ దామోదర్ రావు తన తండ్రి తానికొండ నాగయ్య పేరుతో నిర్వహించిన కథలు పోటీ విజేతలకు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి బహుమతి ప్రదానం చేశారు.

ఇందులో భాగంగా సుజనా నవలలు పోటీ విజేత లకు ఐదు లక్షల వరకు సుజనా బహుమతులు ప్రదానం చేశారు. మిగతా పోటీలకు స్పాన్సర్ చేసిన వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్, సింగీతం ఘటికా చలరావు.. తానికొండ దామోదర్ బహుమతులు ప్రదానం చేశారు. దరిదాపు తొమ్మిది లక్షల వరకు బహుమతులు ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా ఆ సృజనా నవలల పోటీకి స్పాన్సర్ చేసిన సుజనా చౌదరి మాట్లాడుతూ తెలుగు భాష బతికుండ డానికి సాహిత్యం దోహదపడుతుందని. ఆ దిశగా కృషి చేస్తున్న ఉష పత్రికను ఆయన అభినందిస్తూ ఉషా కోరుకున్నట్టు రాబోయే రోజుల్లో రచయితల పుస్తకాలను ప్రభుత్వం కొనుగోలు చేసేలా కృషి చేస్తానన్నారు.

ఉషా నిలదుక్కోవడానికి తర్వాత సహకారం చేస్తానన్నారు. అదేవిధంగా ఉషా స్థల సేకరణ జరిపితే భవన సర్ ఒక టూ మినిట్స్ నిర్మాణాన్ని కూడా సహకరిస్థాను అన్నారు.

వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, సాహిత్యాన్ని బతికించుకోవడం సమాజానికి అవసరం అన్నారు. శాసనసభ్యుడు మండల బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ అచ్చు పత్రికలు మాయమవుతున్న ఈ సంధి కాలంలో ఉషా ముందుకు వచ్చి పత్రిక నడపడం ముదా వాహమని, ప్రభుత్వం దృష్టికి రచయితల సమస్యలు తీసుకెళ్తున్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ మాట్లాడుతూ, సాహిత్యం నడుస్తున్న సమాజానికి దర్పణం అని, ఆ దిస్ గా ఉష కృషిచేయడం అభినందినీయ మన్నారు.

సమావేశానికి అధ్యక్షత శరత్ చంద్ర మాట్లాడుతూ.. రాబోయే తరాలు పరీక్షించుకోవడానికి సాహిత్యమే సోపానం అన్నారు. రచయితలకి ఉపయోగ పడేలా ఉషా భవన్ నిర్మాణాన్ని చేపడతాం అన్నారు.

రచయితల డిమాండ్లు పరిష్కారం కోసం కృషి చేస్తారని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట కోటేశ్వరావు హామీ ఇచ్చారు, సభలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉషా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్స్
ఉషా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకి ఎంపికైనవిహారి, సింహ ప్రసాద్, మందా భానుమతి, వసుందర, ప్రముఖ చిత్రకారుడు ఏవిబిస్ ఆనంద్, స్వరమాంత్రికుడు వెంపటి కామేశ్వరరావు, అత్తలూరు విజయలక్ష్మి, జగన్నాథ్ శర్మ వంటి సాహితీ దిగ్గజాలకు ఉషా అవార్డులు ప్రకటించి సన్మానించింది. కాగా వారికి విద్యావేత్త బిఆర్ అంకం, మాజీ శాసన మండలి సభ్యులు వాకాటి నారాయణరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ భరత్ కుమార్, ప్రముఖ పారిశ్రామిత్త కే వెంకటేశ్వర్లు, ప్రమోదిని తదితరులు లైఫ్ టైం నచ్చింది అవార్డు నగదు బహుకరించారు.

ఈ సందర్భంగా కార్యక్రమం సమన్వయం ఉష ఆహ్వాన కమిటీ చైర్మన్ కట్ట రాంబాబు, ప్రముఖ రచయిత్రి కరవధి సరస్వతి, ఉషా ఎడిటోరి యల్ యూటర్న్ బోర్డు సభ్యులునాగ మౌనిక, నాగేశ్వరి, ఉగాది వసంత, సుధారాణి పూడిపెద్ది తదితరులు పాల్గొన్నారు. సభలో 200 మందిపైనే రెండు తెలుగు రాష్ట్రా లకు చెందిన రచయితలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE