-గార్డెన్ ఫెస్టివల్ లో 25 అవార్డులు గెలుచుకున్న -హెచ్ఎండిఏ 13 ఫస్ట్ ప్రైజులు, 12 సెకండ్ ప్రైజులు
-పబ్లిక్ గార్డెన్ లో శనివారం అవార్డుల ప్రదానం
హాజరుకానున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ : హెచ్ఎండిఏకు అవార్డుల పంట పండింది.రాష్ట్ర ఉద్యానవన శాఖ ఏడవ (7) గార్డెన్ ఫెస్టివల్ లో హైదరబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) ఏకంగా 25 అవార్డులు గెలుచుకున్నది.
శనివారం సాయంత్రం పబ్లిక్ గార్డెన్ సెంట్రల్ లాన్ లో జరిగే అవార్డుల ప్రదానం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి. ప్రభాకర్ అవార్డులను అందుకోనున్నారు. రాష్ట్ర ఉద్యానవన శాఖ అవార్డులకు హెచ్ఎండిఏ పార్కులు ఎంపిక కావడంపై మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మెట్రోపాలిటన్ కమిషనర్ అర్విoద్ కుమార్ అర్బన్ ఫారెస్ట్రి డైరెక్టర్ ప్రభాకర్ తో పాటు సిబ్బందికి అభినందనలు తెలిపారు.