Suryaa.co.in

Andhra Pradesh

‘దిశ’పై అవగాహన అవసరం

– దిశ జర్నలిస్టు డైరీ ఆవిష్కర్‌లో ఎస్పీ సిద్దార్ధ్ కౌశిల్

నందిగామ: మహిళలపై దాడుల నిరోధానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశపై అందరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని కృష్ణా జిల్లా ఎస్పీ అన్నారు. ఆధ్వర్యంలో ముద్రించిన దిశ డైరీని ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా రక్షణకు కట్టుబడి ఉందన్నారు. దిశ యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని, జర్నలిస్టులు కూడా దిశపై ప్రజల్లో, ముఖ్యంగా మహిళలో అవగాహన పెంచే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

కాగా దిశ పేరుతో డైరీ ముద్రించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా నందిగామ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వెలది సుగుణ శేఖర్ రావు, కన్నెగంటి సజ్జన్ రావు ను
sp అభినందించారు. కార్యక్రమంలో నందిగామ డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి మరియు నందిగామ సిఐలు కనకారావు నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE