Suryaa.co.in

Andhra Pradesh

సొసైటీలో అమ్మాయిలు,ఆడవాళ్లు ఆవకాశం కాదు ఒక ఆవశ్యకత

నెలసరి మెన్సస్ మీద అవగాహన కోసం ప్రైమరీ క్లాస్ ల నుండే పాఠం గా చేర్చాలి
– ఇది సృష్టి ధర్మం
– భాజపా రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం
విజయవాడలో “అవర్ యూత్ సోషల్ కమ్యూనిటీ” సోషల్ ఆర్గనైజేషన్ తరుపున ఈరోజు విజయవాడలో ఇక ప్రైవేట్ హోటల్లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిధిగా గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం మరియు విజయా కాలేజ్ ఆ ఫార్మసీ నుండి పద్మాలత ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశయం “ప్రాజెక్ట్ – సురక్ష” పేరిట ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో పలు కాలేజీలకు చెందిన విద్యార్థినులు,విద్యార్థులు పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈ సంస్థ వైస్ చైర్మన్ సోహన్ పప్ఫ మాట్లాడుతూ సమాజంలో కౌమారంలోకి వచ్చిన యువతులకు ఒక ప్రత్యేకత ఉంటుందని వాటినే మెన్సస్ అంటారని దీనికి సొసైటీ లో అమ్మాయిలకు ఎంతో ఆవశ్యకత వుందని దీనిని ఎవరు సిగ్గుపడవలసిన అవసరం లేదని ఇది ప్రకృతి సహజం అని తెలిపారు.
సమావేశానికి వ్యాఖ్యాత గా శ్రీజ రస్మిత దుమ్మడ వ్యవరించగా ముఖ్య అతిధిగా విచ్చేసిన భాజపా రాష్ట్ర కార్యదర్శి మరియు రామినేని ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం గారు మాట్లాడుతూ ఈరోజుల్లో అమ్మాయిలు పట్ల సొసైటీ లో ఎన్నో అపోహలు సృష్టిస్తున్నారని ఏడాది అర్ధరాత్రి ఒంటరిగా తిరగవచ్చా అని ఎన్నో ఏళ్లుగా చూస్తున్నామని కానీ ఆడది అంటే అంగడి బొమ్మకాదు , అబల కాదు సభల అని నిరూపించిన శతాబ్దంలో మనం ఉన్నామని విద్యార్థునులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు ఓవైఎస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మాయిలతో సానిటరీ నాప్కిన్స్ పట్ల అవగాహనతో పాటు,తీసుకోవాలిసిన జగర్తల పట్ల విద్యార్థునులు ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి ప్రసంగించటం ఎంతో సాహసోపేత చర్య గా కాకుండా నేటి యువత రేపటికి మార్గదర్శనం అన్నారు.
ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం రాబోవు కాలంలో ఇదే అంశాన్ని 8,9,10 వ తరగతి పుస్తకాల్లో పాఠంగా చేర్చి విద్యార్థి దశనుండి అవగాహన కల్పించాలని రాష్ట్ర ,కేంద్ర విద్యా శాఖలకు విజ్ఞాపణలు పంపిస్తానని నాగభూషణం గారు తెలిపారు.ఇంత చిన్న వయసులో సోహన్ మరియు వారి మిత్రులతో ఒక NGO నడపటం ఎంతమందికో ఆదర్శప్రాయమని,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వీటిపై పన్ను భారాన్ని తగ్గించాయని పన్నే కాకుండా అందరికి ఉచితంగా అదే విధంగా ఈ సంస్థ ప్రయత్నం అభినందనీయం అని నాగభూషణం తెలిపారు.

LEAVE A RESPONSE