Suryaa.co.in

National

ఆజాద్ హింద్ సర్కార్ ఏర్పడింది ఈ రోజే

తెల్లవారి గుండెళ్లో గునపాలు దింపిన రోజు..

భారతదేశ చరిత్రలో ఓ మరుపురాని రోజు.. మరిచిపోలేని రోజు. బ్రిటిష్ పాలకులకు వణుకుపుట్టిన రోజు. తెల్లవారిపై పోరాడి గెలిచిన రోజు. అదే అక్టోబర్ 21. ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సరిగ్గా ఈ రోజున అంటే 1943 అక్టోబర్ 21 ఈ రోజున ఆజాద్ హింద్ ఫౌజ్ అధినేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర భారతదేశ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

దీనిని జర్మనీ, జపాన్, ఫిలిప్పీన్స్, కొరియా, చైనా, ఇటలీ, మంచుకువో, ఐర్లాండ్‌తో సహా 11 దేశాల ప్రభుత్వాలు గుర్తించాయి. ఈ తాత్కాలిక ప్రభుత్వానికి జపాన్ అండమాన్ నికోబార్ దీవులను ఇచ్చింది. జపాన్, జర్మనీల సహకారంతో సాయుధ మార్గంలో భారత్‌కు విముక్తి కల్పించాలని సంకల్పించారు.

అదే క్రమంలో ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేశారు. నేతాజీ ఆ దీవులకు వెళ్లి వాటికి మళ్లీ పేరు పెట్టారు. ఈ ప్రభుత్వాన్ని ఆజాద్ హింద్ సర్కార్ అని పిలుస్తారు. ఈ ప్రభుత్వం తన సైన్యం నుండి బ్యాంకు వరకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు.

LEAVE A RESPONSE