– వక్ఫ్ బిల్లుకు బాబు మద్దతు ఇవ్వడం అంటే ముస్లిం లకు వెన్నుపోటు పొడిచినట్లే
– ఇఫ్తార్ విందు ఇచ్చి అందులో విషం పెట్టినట్లే లెక్క
– వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు
– దర్యాప్తు అధికారిని బెదిరించి తప్పుడు రిపోర్ట్ రాయించారు
– ఇంటికి పిలిపించుకుని తప్పుడు రాతలు రాయించి అదే రిపోర్ట్ ను సబ్మిట్ చేయించారు
– బెయిల్ పై బయట ఉండి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తే…ఇక న్యాయం ఎక్కడ జరుగుతుంది ?
– సునీత ప్రాణాలకు రక్షణ ఏది ?
– హత్య చేయించింది అవినాష్ రెడ్డి.. అన్ని సాక్ష్యాలు ఉన్నాయి
– ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యుల వాదనను గౌరవించాలి
– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ: వక్ఫ్ సవరణలు తెచ్చి బీజేపీ మళ్ళీ పార్లమెంట్ వేదికగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఇది ముస్లిం కమ్యూనిటీ మీద,దేశ ఐక్యత మీద, రాజ్యాంగం మీద జరిగిన దాడి. బీజేపీ క్రూరత్వానికి నిదర్శనం. వక్ఫ్ బిల్లు సవరణలు ముస్లిం లకు మేలు చేసేవి కావు. ముస్లిం లకు తీరని అన్యాయం. అసలు సమస్యే లేదు. అంతా సక్రమం గానే ఉంది. ఇది వక్ఫ్ ఆస్తులను కాజేసే కుట్ర.
బీజేపీ ది మతం పేరుతో చిచ్చు పెట్టే రాజకీయం. మతం,కులం పేరు చెప్పి బీజేపీ విభజన చేస్తుంది. మతాలను విడగొట్టి ఓటు రాజకీయాలు చేయాలని చూస్తుంది. మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ది పొందాలి అని బీజేపీ చూస్తుంది. ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు ఇచ్చిన మద్దతు.
బాబు ను సూటిగా ప్రశ్నిస్తున్నాం. బాబు గారు.. మీకు ముస్లిం లు ఓటు వేయలేదా ? ముస్లిం లు కూడా ఓటు వేస్తే మీరు గెలవలేదా ? వైసీపీ నీ వద్దు అనుకోని మీకు ముస్లిం లు ఓటు వేశారు. చంద్రబాబు ముస్లిం ద్రోహి. వారికి ఇఫ్తార్ విందు ఇస్తే సరిపోదు. చంద్రబాబు వి ఊసర వెళ్లి రాజకీయాలు. ఇఫ్తార్ విందు ఇచ్చి ముస్లిం లకు వెన్ను పోటు పొడిచారు. వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చి పెట్టిన ఇఫ్తార్ లో చంద్రబాబు విషం కలిపారు.
ఢిల్లీ లో వక్ఫ్ బిల్లుపై చర్చ జరుగుతుంటే…ఇక్కడ వక్ఫ్ బోర్డు మీద సమీక్ష పెట్టారు. ఇది ఊసర వెళ్లి రాజకీయం అనరా ? చంద్రబాబు మీ మొహం ముస్లిం లకు ఎలా చూపిస్తారు? చంద్రబాబు,పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి దేశంలో వక్ఫ్ బోర్డు ఆస్తులను కాజేసే కుట్ర నే ఈ సవరణలు.
బోర్డు అధికారాలు ప్రత్యేక అధికారికి ఇవ్వడం ఏంటి ? బోర్డ్ లో నాన్ ముస్లిం లను పెట్టడం ఏంటి ? హిందూ,సిక్కు దేవాలయాల బోర్డులో ముస్లిం లను పెడతారా ? వక్ఫ్ బోర్డు లో నాన్ ముస్లిం లను పెట్టీ వారికి తీరని ద్రోహం చేశారు. సవరణలు అన్ని కూడా ముస్లిం లకు అన్యాయం చేసేవే. ముస్లిం లా బోర్డ్ పరిధిలో న్యాయం జరిగే పరిస్థితి నుంచి హై కోర్ట్ కి తెచ్చారు. ఏ సమస్య లేనిది ఇప్పుడు ఈ సవరణ ఎందుకు ?
వక్ఫ్ ఆస్తులను సెంట్రల్ డేటా బేస్ అంటున్నారు. చాలా ఆస్తులకు పత్రాలు లేవు. ఇది వక్ఫ్ భూమి అని అందరికీ తెలుసు. ఇప్పుడు పేపర్లు లేవు అని ఆ భూములు వక్ఫ్ కి కాకుండా పోతాయా ? వక్ఫ్ భూముల్లో కబ్జాలో ఉన్న వాళ్ళు హక్కు దారులు అవుతారట. ఇది పూర్తిగా వక్ఫ్ భూములను కాజేసి కుట్ర కాదా? వక్ఫ్ సవరణలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ హక్కుల కోసం నిలబడుతుంది. ట్రిబ్యునల్ స్థాయి నుంచి హై కోర్ట్ కి వెళ్లడం అంటే బయట జ్యోక్యం పెరిగినట్లే. ఇది హిందూ – ముస్లిం లను వేరు చేసే కుట్ర.
నేను కనిపించడం లేదు అనేది అవాస్తవం. మెడికల్ లీవ్ అనుకోవచ్చు కదా? శైలజానాథ్ ఏముంది అని వైసీపీకి వెళ్ళాడో తెలియదు. అక్కడ అధికారం లేదు..డబ్బు మాత్రమే ఉంది. ఆ డబ్బు కోసమే పోయి ఉండొచ్చు. వైసీపీ మా మీద ఫోకస్ పెట్టింది అంటే కాంగ్రెస్ బలోపేతం అయింది అని అర్థం. మా లీడర్లను లాగుతున్నారు అంటే మాకు బయపడుతున్నారు అని అర్థం. నా కృషి ఫలించింది అని అర్ధం.
సునీత కు నేను ఆ రోజే చెప్పాను. నాన్న కు నువ్వు ఒక్కదానివే అని చెప్పాను. న్యాయం కోసం కోట్లాడాలి అని చెప్పాను. నేను సునీత పక్కన నిలబడతాను అని హామీ ఇచ్చాను. ఎదుర్కొనేది ఎంత పెద్ద వాళ్ళు అని తెలిసి కూడా నిలబడ్డాను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సునీత కు న్యాయం కోసం నిలబడ్డాను.
ఇటీవల ఒక అంశం నన్ను ఆలోచింప జేసింది.ఇన్వెస్టిగేషన్ అధికారిని అవినాష్ ఇంటికి పిలిపించుకున్నాడు. అక్కడ బెదిరించి ,ఒత్తిడి చేసి తప్పుడు రిపోర్ట్ ఇప్పించారు. సంతకం పెట్టించి రిపోర్ట్ ఫైల్ చేశారు.ఇప్పటి వరకు న్యాయం జరగలేదు అంటే అవినాష్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. బెయిల్ మీద బయట ఉన్నాడు కాబట్టే స్వేచ్ఛగా సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారు. సునీత నే వివేకా ను హత్య చేయించింది అని కొత్త రిపోర్ట్ రాయించారు. అధికారి తో సంతకం పెట్టించారు. బెయిల్ మీద ఉన్న వాళ్ళు సాక్ష్యాలు తారుమారు చేస్తే ..ఇక వాళ్ళు బయట ఉండాలా ? జైలు లో ఉండాలా ?
హత్య జరిగిన సమయంలో సునీత తన భర్త అక్కడ లేరు. అవినాష్ రెడ్డి మాత్రమే ఉన్నాడు. రక్తపు మరకలు అన్ని తుడిపించాడు. అన్ని సాక్ష్యాలు అవినాష్ రెడ్డి చేయించాడు అని ఉన్నాయి. అన్ని సాక్ష్యాలు ఉన్నా… అవినాష్ రెడ్డి తప్పు చేయలేదు అని రిపోర్ట్ లు రాయిస్తున్నారు. ఇలా అయితే న్యాయం ఎక్కడ జరుగుతుంది ? సునీత కు ఎప్పుడు న్యాయం జరగాలి? సునీత ప్రాణాలకు భద్రత ఉందా ?
ప్రవీణ్ పగడాల విషయంలో పోలీసులు వీడియో లు బయట పెడుతున్నారు. కుటుంబ సభ్యులు న్యాయం జరుగుతుంది అంటున్నారు. వైసీపీ వాళ్ళు విభిన్నంగా రాజకీయం చేస్తున్నారు. నాకు అనిపించింది… ఇది బీజేపీ కుట్ర. ఇక్కడ కూడా మతాల మధ్య విభజన తేవాలని చూస్తుంది. ఇక్కడ మతాల మధ్య విభజన పెట్టాలని చూడటం సరికాదు. ఆంధ్రలో ఇంకా అటువంటి కల్చర్ మనకు రాలేదు. ప్రవీణ్ కుటుంబ సభ్యుల వాదనను మనం ఏకీభవించాలి. ప్రవీణ్ పగడాల ది హత్య అని ఆధారాలు దొరికితే నేను వారి పక్షాన డీజీపీ నీ కలుస్తా.