Home » మంత్రి రాం ప్రసాద్‌రెడ్డిపై బాబు ఆగ్రహం

మంత్రి రాం ప్రసాద్‌రెడ్డిపై బాబు ఆగ్రహం

– ఉద్యోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే సహించను
– విచారం వ్యక్తం చేసిన మంత్రి
– ఇకపై అలా జరగదని వివరణ
– పోలీసులపై మంత్రి భార్య దాష్టీకం
– ఎస్కార్టుగా రావాలని ఆదేశం
– సోషల్‌మీడియాలో వైరల్ అయిన రాయచోటి రెడ్డమ్మ వీడియో
– మంత్రికి ఫోన్ చేసి మందలించిన సీఎం చంద్రబాబు

అమరావతి: రవాణాశాఖ మంత్రి, రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్‌రెడ్డి భార్య హరిత పోలీసులపై దురుసుప్రవర్తన వ్యవహారం సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి వెళ్లింది. పోలీసులను ఎస్కార్టుగా రావాలన్న మంత్రి భార్య నోటి దురుసు, సోషల్‌మీడియాలో హల్‌చల్ చేసింది. ఇది సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో, ఆయన మంత్రికి ఫోన్ చేసి వివరణ కోరారు.

దానికంటే ముందు సీఎం అక్కడ ఏం జరిగిందో ఆరా తీశారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే, ఎంతటివారినయినా సహించనని బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ-పార్టీ ప్రతిష్ఠను మంటకలిపే చర్యలను ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. కాగా తన భార్య హరిత ప్రవర్తనపై, మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఇకపై అలాంటి పొరపాటు జరగకుండా చూస్తానని వివరణ ఇచ్చారు. కాగా మంత్రి భార్య ప్రవర్తనపై ఇప్పటికే సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply