-నేరం చేసిన వాడిని అరెస్టు చేయడం తప్పా?
– బాబు అక్రమాల డొంక కదిలింది.. సూత్రధారి పాపం పండింది
– అందుకే అన్ని ఆధారాలతో చంద్రబాబుని అరెస్టు చేశారు
-బాబు శేష జీవితం ఇక జైల్లోనే..
-: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం, సెప్టెంబర్ 9: 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. రాజకీయాల్లో ఎంతో అనుభవిగ్యుడనని, అవినీతికి ఆమడ దూరంలో ఉంటానని చెప్పుకుని తిరుగుతున్న టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాపం పండింది. ఆయన అవినీతి డొంక కదిలింది.. ఇక ఆయన శేష జీవితం జైలు పాలేనని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
శనివారం సర్క్యూట్ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు స్కిల్డ్ క్రిమినల్, అన్ స్కిల్డ్ పొలిటీషియన్ అని అక్షరాల రుజువయింది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సిమెన్స్ సంస్థ పేరు వాడుకొని, ప్రభుత్వాన్ని తప్పుతోవ పట్టించి, ఆర్థిక శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి 371 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తన షెల్ కంపెనీలకు తరలించుకున్న చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయక, తీసుకెళ్లి సినిమా ధియేటర్లో సినిమాలు చూపిస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు, ఫోర్జరీ, కరప్షన్, చీటింగ్ వంటి నేరాలకు పాల్పడినట్లు ప్రాథమిక సాక్షాధారాలు లభించడం వల్లే ఆయనపై పది నుంచి 12 కేసులు పెట్టారని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.
2014లో ఆయన అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఈ కుంభకోణానికి తెర తీసి 2015 ఫిబ్రవరిలోనే 371 కోట్ల రూపాయలు తన సెల్ కంపెనీలకు బదలాయించుకున్నారని అమర్నాథ్ వివరించారు. ఈ కుంభకోణం పాత్రధారులను ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారని, అనంతరం వారు సేకరించిన వివరాలు ఆధారంగా పాత్రధారి చంద్రబాబు నాయుడును అరెస్టు చేశారని అమర్నాథ్ తెలియజేశారు.
దర్యాప్తు సంస్థలు ఈ కేసులను ముందుకు తీసుకెళుతున్న నేపథ్యంలో వారికి భాగంగా ఇచ్చిన వారిని చంద్రబాబు ఎందుకు దేశం దాటించాడని అమర్నాథ్ ప్రశ్నించారు. ఈ కేసులలో చంద్రబాబుకు 10 సంవత్సరాల జైలు సీట్లు తప్పదని అమర్నాథ్ చెప్పారు. గతంలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా జరిగిపోయిన చంద్రబాబు ఇక్కడికి పారిపోయి వచ్చాడని, ఇప్పుడు ఆర్థిక నేరాల కేసులలో ఇరుక్కుపోయాడని ఆయన అన్నారు.
పురంధేశ్వరి లా ను పక్కన పెట్టింది..
ఆర్థిక నేరాలకు, కుంభకోణాలకు పాల్పడిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయటం అన్యాయం అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అనడాన్ని చూస్తే ఆమె లా ను పక్కనపెట్టి, మరిది కోసం పని చేస్తున్నట్టు కనిపిస్తోందని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు.