Suryaa.co.in

Andhra Pradesh

బాబూ..! రాజీనామా చేసి రా…. కొట్టుకుందాం !

– నేను, వంశీ వస్తాం.. మాతో తలపడు బాబూ..?
– చంద్రబాబుకు పిచ్చెక్కి రంకెలు వేస్తున్నాడు..
– బాబును తన బ్రెయిన్‌లెస్‌ కిడ్‌ లోకేశ్‌ కరిచి ఉంటాడేమో..!
– బాలయ్య సినిమాలు చూసి బాబుకు పూనకాలు
– అందుకే దీర్ఘాలు తీసి రంకెలేస్తున్నాడు..
– అమరావతిలో ‘నారా మానసిక వైకల్య చికిత్స కేంద్రం’ పెట్టాలి
– లేకపోతే, బాబు పిచ్చికుదరాలంటే గదిలో పెట్టి తాళాలేయాల్సిందే..
– వివేకా హత్యకేసుపై అర్ధంపర్థంలేని సీబీఐ ఎంక్వైరీ
– సీబీఐ గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతుందా..?
– గూగుల్‌ టేకవుట్‌కు సీబీఐ ఎందుకు..?
– దానికి ఒక టెలిఫోన్‌ ఆపరేటర్‌ తేల్చేవాడు కదా..
– అది సీబీఐ ఎంక్వైరీ కాదు.. టీఓఐ ఎంక్వైరీ
– మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని)

పిచ్చెక్కిన ‘చంద్రబాబు’ గన్నవరంలో రంకెలు..
రెండు గ్లాసులు, ఒక కంప్యూటర్‌ పగిలిన కార్యక్రమానికి చూసేందుకు ఈరోజు చంద్రబాబు గన్నవరం వెళ్లాడు. అక్కడ ఆయన పార్టీ చెంచాగాళ్ల తో మాట్లాడగానే పిచ్చెక్కింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నోటికొచ్చినట్లు తిట్టాడు. ‘పోలీసు సెక్యూరిటీతో కాకుండా నీ జనాన్ని తీసుకురా.. నీ కథ తేలుస్తా.. నీ అంతు చూస్తా..’ అంటూ ముఖ్యమంత్రికి చంద్రబాబు సవాల్‌ విసిరాడు. అర్ధంపర్థం లేకుండా పిచ్చిపిచ్చిగా పెద్దగా అరుస్తున్న చంద్రబాబును చూసి ‘వీడెవడో మెంటల్‌ ఆస్పత్రి నుంచి తప్పించుకుని ఇక్కడకొచ్చాడు’ అంటూ గన్నవరం ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు.

బాబూ..రాజీనామా చేసి వస్తే చూసుకుందాం..!
ఎక్కడకు వెళ్లినా పిచ్చిపిచ్చిగా అరుస్తున్న ఈ చంద్రబాబును జైల్లో గానీ పిచ్చాసుపత్రిలో గానీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి.. రాజ్యాంగాన్ని, శాంతిభద్రతలను కాపాడతానని.. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రతీ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేస్తానని ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు కూడా శాసనసభ్యునిగా అసెంబ్లీలో రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్షహోదాలో పనిచేస్తానని ప్రమాణం చేశాడు. అలాంటి, ఇతను ముఖ్యమంత్రిని ఎంతమాట పడితే అంతమాట అంటాడా..? ఆయన సెక్యూరిటీని వదిలే సి వస్తే ఈ పిచ్చి చంద్రబాబు అంతు చూస్తాడంట.. ‘బాబూ.. నీలాంటి పిచ్చి ఛాలెంజ్‌లకు మా జగన్‌మోహన్‌రెడ్డి స్పందించరు..’ అంతగా, అవసరమైతే నేనో, వంశీనో వస్తాం.. చూసుకుందామా..? నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయి. నీ ప్రతిపక్ష హోదాతో పాటు జెడ్‌ కేటగిరి సెక్యూరిటీ కూడా పోతుంది కదా.. నేను, వంశీ కూడా మా శాసనసభ్యత్వాలకు రాజీనామా చేస్తాం. నల్లమల అడవికో.. బందరు సముద్రానికో వెళ్లి కొట్టుకుందాం. మన పోరాటంలో మేం చచ్చిపోతే నిన్ను జైల్లో పెడతారు. ఒకవేళ నువ్వు చస్తే మమ్మల్ని జైల్లో వేస్తారు. అటోఇటో.. ఈ రాష్ట్రానికి పట్టిన నీ దరిద్రం పోతుంది.

బ్రెయిన్‌లెస్‌ కిడ్‌ లోకేశ్‌..బాబును కరిచాడేమో..
పిచ్చెక్కి తిరుగుతున్న చంద్రబాబును మెంటల్‌ ఆస్పత్రిలో పెట్టాలి. లేదా కొవ్వొక్కి మాట్లాడుతున్నాడంటే జైల్లోనైనా పెట్టాలి. బ్రెయిన్‌లెస్‌ కిడ్‌ లోకేశ్‌ మాట్లాడాడంటే ..‘ వాడు పిల్లోడు. పిచ్చోడు.. రాజకీయాలు తెలియనోడు. కనీసం, వార్డు మెంబర్‌గా కూడా గెలవనోడు.. తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నాడు..’ అని జనం అనుకుంటారు. కానీ, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేశానని, రాజకీయాల్లో అపరమేధావిని, చాణక్యుడ్ని అని చెప్పుకునే ఈ చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నా డంటే.. అతని కొడుకు బ్రెయిన్‌లెస్‌ కిడ్‌ లోకేశ్‌, చంద్రబాబును కొరికి ఉంటాడేమో…? అనే అనుమానం కలుగుతుంది. మొన్న తారకరత్న అంత్యక్రియలకు వెళ్లినప్పుడు లోకేశ్‌ అతని తండ్రిని గట్టిగా కొరకడంతోనే అతను పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడేమో..

బాబులో బాలయ్య పూనుతున్నాడేమో..
ఈమధ్య చంద్రబాబు ఎక్కడకెళ్లినా దీర్ఘాలు తీసి సినిమా డైలాగుల్లా మాట్లాడుతున్నాడు. ఖాళీగా ఉండలేక, ఆయన బావమరిది బాలకృష్ణ సినిమాలు వీరసింహారెడ్డి, అఖండ సినిమాలు చూసి ఉంటాడు. లేదా, తానూ సినిమా హీరోనే అంటూ ఈయనకు బాలయ్య పూనుతున్నాడేమో.. ఈ చంద్రబాబు పిచ్చిమాటలు, పోసుకోలు మాటలు, సొల్లు మాటలు నమ్మిన పిచ్చి తమ్ముళ్లు ఊగిపోయి చివరికి కేసుల్లో ఇరుక్కుని జైళ్లపాలవుతున్నారు.

దుష్టచతుష్టయమే రాష్ట్రానికి పట్టిన దరిద్రం
చంద్రబాబు, లోకేశ్, రామోజీ, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడుతో పాటు ఈ దుష్టచతుష్టయమంతా కట్టకట్టుకుని వచ్చి.. నాతోనైనా, వంశీతోనైనా పోటీకి దిగితే.. అసలు కథ తేలుతుంది. ఈ ముసలి బ్యాచ్‌ మొత్తాన్ని ఒక్కసారే మట్టికరిపిస్తే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదులుతుంది. లేకపోతే, ఈ చంద్రబాబు మెంటల్‌ ఛాలెంజ్‌ చేయడమేంటి..? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సెక్యూరిటీని పక్కనబెట్టి ప్రతిపక్ష నాయకుడితో బాహాబాహీకి రావాల్నా..? రాజ్యాంగం ప్రకారం పోలీసులు ఇందుకు ఒప్పుకుంటారా..? మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ప్రజలను కాపాడే వ్యక్తిగా దేవుడ్ని నమ్ముకున్న నాయకుడిగా ఉన్నందున.. బాబులాంటి పిచ్చోళ్ల సవాళ్లకు స్పందించడు. అందుకే, నేను, వంశీ ఎక్కడికైనా వస్తాం. ఎక్కడ కొట్టుకుందామో చెప్పు బాబూ..?

అమరావతిలో ‘నారా మానసిక వైకల్య చికిత్స కేంద్రం’ పెట్టాలి..
రేపు రానున్న 2024 ఎన్నికల తర్వాత అమరావతిలో నారా చంద్రబాబు మానసిక వైకల్య చికిత్స కేంద్రం పెట్టాలి. దానికి పసుపు రంగు వేయాలి. అందులో ఏసీ సూటు రూమ్‌లు పెట్టి.. వాటిల్లో చంద్రబాబు అండ్‌ కో వంటి దుష్టచతుష్టయాన్ని ఉంచి ట్రీట్‌మెంట్‌ ఇప్పించాలని నేను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కి వినతిపత్రం అందించి కోరతాను.

చంద్రబాబుది పశువుల పాల ఉత్పత్తుల వ్యాపారం నిజం కాదా..?
చంద్రబాబు ఈరోజు హెరిటేజ్‌ పేరిట చేసే వ్యాపారం ఏంటి..? మాటకొస్తే వంశీని పశువుల డాక్టర్‌ అని పిలుస్తున్నాడు. మూగజీవాల ఆరోగ్యశ్రేయస్సు కోసం వంశీ పవిత్రమైన వృత్తిలో ఉంటే.. ఈ చంద్రబాబేమో.. పాల ఉత్పత్తులతో వ్యాపారం చేసి కోట్లు కూడబెడుతున్న విషయం నిజం కాదా..? బాబు దిక్కుమాలిన రాజకీయం నాకు, వంశీకి చాలా బాగా తెలుసు.. మాతో పెట్టుకోవద్దు.

మతం పేరుతో పోలీసుల్ని తిడతాడా..?
అసలు, ఈ పంది పట్టాభిని గన్నవరం పంపిందే చంద్రబాబు. గన్నవరం గొడవలో అటు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు గానీ.. ఇటు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు గానీ ఏ ఒక్కరికీ చిన్న గాయం కాలేదు. ఒక ఇన్నోవా కారులో రెండు సీట్లు విరిగాయి. అయితే, ఈ ఇద్దరి ఘర్షణను కట్టడి చేయడానికి వెళ్లిన పోలీసులకు గాయాలయ్యాయి. కొవ్వొక్కిన టీడీపీ మూకల దాడిలో సీఐకి తల పగిలి ఆయన ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ పొందుతూ ఉంటే.. ఈ చంద్రబాబు ఏమంటున్నాడు..? పోలీసుల తాటతీస్తాడంట.. తోలుతీస్తాడంట.. వాళ్ల మక్కెలు విరిచేస్తాడంట. ఇదేవిధంగా పిచ్చికుక్కలా మొరిగితే.. పోలీసుల్లోనే ఎవరో ఒకరికి ఆవేశం వచ్చి నీ మీద తిరగబడితే.. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఆ తర్వాత దాన్ని కూడా మా జగన్‌ మీదనే రుద్దుతారు. సీఐ, డీజీపీ క్రిస్టియన్‌ అంటూ.. మతాల పేరిట పోలీసుల్ని చంద్రబాబు రెచ్చగొడుతున్నాడనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి.

అది సీబీఐ ఎంక్వైరీ కాదు.. టీఓఐ ఎంక్వైరీ
వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఎంక్వైరీ జరుగుతుందని తెలుసు. కానీ ఈ గూగుల్‌ టేకవుట్‌ అంటే ఏంటి..? ఒక లొకేషన్‌ నుంచి ఎంతమంది ఫోన్‌లు మాట్లాడారు…? అని చెప్పడానికి సీబీఐ ఎందుకు..? ఒక టెలిఫోన్‌ ఆపరేటర్‌కు అప్పగిస్తే.. వాడు ఎప్పుడో తేల్చి చెప్పేవాడు కదా..అంటే, ఇప్పటివరకు సీబీఐ గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతుందా..? ఎవడి ఫోన్‌ ఎవడికి వెళ్లింది.. అని చెప్పేదాన్ని సీబీఐ ఎంక్వైరీ అనరు. దాన్ని టీవోఐ(టెలిఫోన్‌ ఆపరేటర్‌ ఎంక్వైరీ) అంటారు. ఏదైనా ఒక కేసుకు సంబంధించి ప్రాథమిక సమాచారం సేకరించి.. వాటికి టెక్నికల్‌ ఎవిడిన్స్‌ చూపెట్టి నివేదిక ఇచ్చేది సీబీఐ అంటారని మాత్రమే నాకు తెలుసు. వివేకా హత్య కేసులో ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ అంటున్న గూగుల్‌ టేకవుట్‌ను మాత్రం నేను టెలిఫోన్‌ ఆపరేటర్‌ఎంక్వైరీగా అర్ధం చేసుకుంటున్నాను.

LEAVE A RESPONSE