Home » దివ్యాంగునికి బాబు రూ.3 లక్షల ఆర్థిక సాయం

దివ్యాంగునికి బాబు రూ.3 లక్షల ఆర్థిక సాయం

అమరావతి :- కడప పట్టణం, రాజారెడ్డి వీధికి చెందిన కనపర్తి మనోజ్ కుమార్ అనే దివ్యాంగునికి సీఎం చంద్రబాబు నాయుడు రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, వైద్యం కోసం సాయం చేయాలని మనోజ్ కుమార్ ముఖ్యమంత్రికి విన్నవించారు. శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసి మనోజ్ తన సమస్యను వివరించారు. వీల్ చైర్ కే పరిమితమైన మనోజ్ కు సీఎం చంద్రబాబు నాయుడు రూ.3 లక్షల సాయాన్ని ప్రకటించారు.

Leave a Reply