– ఇదే ఉత్సాహంతో ఈ కార్యక్రమం గ్రామస్ధాయిలో కూడా పూర్తిచేయాలి
– పార్టీ కమిటీల నియామకాలన్నీ కూడా వెంటనే పూర్తిచేయాలి
– వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీలు, స్టేట్ జాయింట్ సెక్రటరీలతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్
తాడేపల్లి: బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ (రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో…, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ) కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. అన్ని జిల్లాల నుంచి మంచి స్పందన వచ్చింది. టీడీపీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం చేస్తున్నారు. మనం చేస్తున్న కార్యక్రమానికి ప్రజల్లో విపరీతమైన స్పందన వస్తుంది.
కానీ టీడీపీ కార్యక్రమానికి ఎలాంటి స్పందన లేదు. తల్లికి వందనం అన్నారు. లక్షలమందికి ఎగ్గొట్టారు. పైగా అరకొరగా వేశారు. ఆడబిడ్డ నిధి లేదన్న ప్రకటన కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తీసుకువచ్చింది. మన అధ్యక్షుడు జగన్ మన కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. పార్టీ పటిష్టతపై దృష్టిపెట్టడంతో పాటు ప్రజల్లోకి వెళుతూ, వారిలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా మన కార్యక్రమం సాగుతోంది.
లేని లిక్కర్ స్కామ్ పేరుతో అరెస్ట్ లు చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మనం అంతా గట్టిగా నిలబడుతుండడం వల్ల మనల్ని కదిలించలేం అని కూటమి పార్టీలకు అర్ధమైంది. టీడీపీ కక్ష్యసాధింపు చర్యలు మన నైతిక స్ధైర్యాన్ని దెబ్బతీయలేవు బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం మండలాల్లో ఇప్పటివరకు దాదాపు 70 శాతం పూర్తయ్యాయి. గ్రామాల్లో కూడా ప్రారంభమైంది. ఈ నెలాఖరికల్లా మండల స్ధాయి పూర్తికావాలి. మండలస్ధాయిలో పూర్తిచేసిన వారు గ్రామస్ధాయిలోకి వెళ్ళిపోయారు. నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేద్దాం. జాప్యం జరగకూడదు. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. అవసరాన్ని బట్టి మండలస్ధాయిలో పార్టీ పదవుల నియామకానికి వెసులుబాటు కల్పించాం.
కమిటీల నిర్మాణంపై సీరియస్‌గా దృష్టిపెట్టాలి. పార్టీ కేంద్రకార్యాలయం నుంచి కూడా కోఆర్డినేషన్ ఉంటుంది. గ్రామస్ధాయి నుంచి పార్టీ క్యాడర్‌కు కనెక్టివిటీ పెరగాలి. ఉత్సాహంగా పార్టీలో పనిచేసేవారిని గుర్తించి వారికి ప్రాధాన్యతనివ్వాలి. అనుబంధ విభాగాల నుంచి కమిటీలు త్వరగా పూర్తిచేయాలి.
అన్ని కమిటీల నుంచి డేటా ప్రొఫైలింగ్ చేసి నెట్ వర్క్ పెంచుకుందాం. కమిటీలలో పనిచేసే వారు సమర్ధవంతంగా పనిచేసేలా ఉండాలి. అనుబంధ విభాగాల కమిటీలు కూడా త్వరగా పూర్తయితే పార్టీ కార్యక్రమాలు మరింతగా విజయవంతం అవుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ క్యాడర్‌కు దిశానిర్ధేశం చేశారు.