Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ గజ్జి కుక్కలతో బాబు దిగజారుడు రాజకీయం

– నీవు ఉండే కరకట్ట కొంప నీది కాదు.. నీ కొడుకు విదేశీ చదువు ఖర్చు నీది కాదు
-గతి తప్పుతున్న టీడీపీ నేతల మాటలు
-మేము మాట్లాడితే మీరు తట్టుకోలేరు
-కానీ మాకు సంస్కారం ఉంది. అదే మా వైఖరి
-ఇకనైనా ఫెయిర్‌ పాలిటిక్స్‌ చేయండి
-ధైర్యముంటే చేసింది చెప్పుకొండి
-అంతేకానీ ఎల్లో మీడియాలో పిచ్చి రాతలు
-సీఎం కుటుంపై విమర్శలు తగవు
-ఎన్ని కుయుక్తులు పన్నినా మీకు ఓటమి తప్పదు
-వచ్చే ఎన్నికల్లోనూ మా పార్టీదే ఘన విజయం
– ఊడిగం స్టార్ పవన్ కల్యాణ్
-విపక్షనేతపై కారుమూరి వెంకట్‌రెడ్డి ఫైర్‌

నేరుగా ఎదుర్కోలేక..:
జగన్ మోహన్ రెడ్డిని నేరుగా ఎదుర్కొలేక.. టీడీపీ గజ్జి కుక్కలను పార్టీ ఆఫీస్ లో కూర్చోపెట్టి చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీలో మరొక గజ్జికుక్కతో సీఎం కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయించారు.  నాలుగేళ్లలో రెండు లక్షలకు పైగా కోట్లు నేరుగా డిబిటి ద్వారా బదిలీ చేసిన సీఎంని డైరెక్ట్‌గా ఎదుర్కోలేక, ఈ విధంగా అడ్డమైన వారితో అడ్డగోలు విమర్శలు చేయిస్తున్నారు.

బాబు దిగజారుడు రాజకీయాలు:
భాషలో కూడా విపరీత ధోరణి. రాజకీయం కోసం ఇంతగా దిగజారాలా? చంద్రబాబు నీ రాజకీయ జీవితమంతా అంతే. నీ అనుకూ పత్రికల్లో నీచాతినీచంగా రాయించడం.. ఇంకా చెప్పాలంటే నీ ప్రయోజనం కోసం హత్యలకు కూడా వెనుకాడవు. కానీ ఆరోజులు వేరు. ఈరోజులు వేరు. టెక్నాలజీ పెరిగింది. ఇకనైనా క్లియర్‌ పాలిటిక్స్‌ చేయండి. ధైర్యం ఉంటే మీరేం చేశారో చెప్పుకొండి. మేము అదే పని చేస్తున్నాం. ఈ నాలుగేళ్లలో మేమేం చేశామన్నది స్పష్టంగా చెప్పుకోగలం. అంతేకానీ, సీఎంపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా పిచ్చి పిచ్చిగా తిట్టించడం సరి కాదు. ఈరోజు కూడా టీడీపీ గజ్జి కుక్కతో పిచ్చి విమర్శలు చేయించారు.

ప్రజల దృష్టి మళ్లించేందుకే..:
నిన్న జగన్‌ నిజాంపట్నం సభలో మీ అనైతిక పొత్తులను సూటిగా ప్రశ్నిస్తే, సమాధానం చెప్పలేక, అలాంటి వారితో తిట్టిస్తున్నారు. నిన్న నంద్యాలలో మీ పార్టీలో రెండు వర్గాలు కొట్టుకున్నారు. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఆనం వంటి గజ్జి కుక్కలతో జగన్‌ ని తిట్టించారు.

మొత్తం కుళ్లు, కుతంత్రాలే..:
మీడియాలో చెప్పలేని విధంగా మీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇంకా పోలీసులను ఉద్దేశించి మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిచ్చి విమర్శల చేశారు. ఇక ఏం పీకారంటూ లోకేష్‌ మాటలు. ఏమిటా మాటలు? విమర్శలు. ఆనాడు మీ పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావుపైనా దారుణంగా విమర్శలు, దుష్ప్రచారాలు చేశారు. బాబూ, నీ రాజకీయ జీవితమంతా అదే కుళ్లు. కుతంత్రాలు. నిన్న జగన్‌ చాలా స్పష్టంగా అన్నారు. మీరు రోజుకో విధంగా పొత్తు రాజకీయాలు చేస్తున్నారని. అందుకే పవన్‌కళ్యాణ్‌తో కలిసి చేస్తున్న రాజకీయాలను ప్రస్తావించారు. రాజకీయాల్లో ఫెయిర్‌గా ఉండాలని అన్నారు.

జగన్‌ ఏనాడైనా అన్నారా?:
సీఎం నిన్న మీ అనైతిక పొత్తుల గురించి మాట్లాడితే.. తనకు రాజధానిలో ఇల్లు లేదని సీఎం అన్నట్లు మాట్లాడారు. ఆయన ఏనాడూ అలా అనలేదు. తాను కట్టుకున్న ఇంట్లోనే ఉంటున్నానని జగన్‌ చెప్పారు. తాను కష్టపడి సంపాదించిన దాంతో హైదరాబాద్‌లో కూడా ఇల్లు కట్టుకున్నారు. అంతే కానీ, నీ మాదిరిగా ఎవరి నుంచో తీసుకున్న కరకట్ట కొంపలో ఉండడం లేదు. నీ కొడుకును నీవు చదివించలేదు. సత్యం రామలింగరాజు చదివించాడు. ఇది అందరికీ తెలుసు. దాని వల్ల నీ క్యారెక్టర్‌ అందరికీ అర్ధమవుతుంది.

నోరు అదుపులో పెట్టుకొండి:
మీ అందరికీ ఒకే మాట చెబుతున్నాను. ఒళ్లు జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకొండి. మీ మాదిరిగా మేము మాట్లాడితే, ఒక్కరోజు కూడా మీరుండ లేరు. మాకు సంస్కారం ఉంది. అదే మాకు మా నాయకుడు నేర్పారు. మేము రాజకీయాల్లో ఫెయిర్‌గా ఉన్నాం. ఓడినా వెనక్కు తగ్గలేదు. ప్రజల్లో ఉన్నాం. అఖండ మెజారిటీతో గెల్చాం. మళ్లీ 2024లో కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతాం. కచ్చితంగా మళ్లీ ఘన విజయం సాధిస్తాం.

ప్రజలే బుద్ధి చెబుతారు:
జగన్‌ విలువలు, విశ్వసనీయత, ప్రజలను నమ్ముకున్నారు. మీ మాదిరిగా పొత్తులు, అనైతిక రాజకీయాలు చేయబోం. మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఏం చేసినా, ఎన్ని బూతులు తిట్టించినా మీ సంస్కారానికి వదిలేస్తున్నాం. మళ్లీ మా విజయాన్ని ఆపలేరు. అంతేకానీ, ఈ తరహాలో విమర్శలు, మీ అనుకూల పత్రికల్లో ఇష్టం వచ్చినట్లు రాయించుకుంటే, ప్రజలే మీకు బుద్ధి చెబుతారు. పాలిటిక్స్‌లో క్లియర్‌గా ఉండండి. ఓపెన్‌గా రండి.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
పవన్‌ మీరు ఆ సినిమా తీయాలి:
‘ప్యాకేజీ పనివాడు.. (కింద) ఊడిగం స్టార్‌’ అని ఎవరో ఒకరితో సినిమా తీయాలి. ఎందుకంటే వారి కుటుంబంలో హీరోలు చాలా మంది ఉన్నారు కదా? అదే సోషల్‌ మీడియాలో కూడా రాస్తున్నారు కదా?
నిజానికి ఆయనే (పవన్‌కళ్యాణ్‌) కదా? చంద్రబాబుకు ఊడిగం చేస్తోంది. ప్యాకేజీ తీసుకుని ఏ పనైనా చేస్తాడు కదా? తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మధ్య బ్రోకరిజమ్‌ చేయడానికి పోతాడు. లేదంటే చంద్రబాబు చెబితే.. కమ్యూనిస్టులు, సీపీఐ, సీపీఎంతో పాటు, బీఎస్పీతో కూటమి కట్టి వెళ్తాడు. లేదు. ఇవాళ నా దగ్గరే ఉండు అని బాబు అంటే, ఆయన దగ్గరే ఉంటాడు. వేరే వారి దగ్గరకు పోయి రమ్మంటే వెళ్లి వస్తాడు.
సినిమాల్లో అయితే హీరోలకు కాల్‌షీట్లు చూడడానికి మేనేజర్లు ఉంటారు. కానీ పవన్‌కళ్యాణ్‌ కాల్‌షీట్లు చంద్రబాబునాయుడు చూస్తారు. అందుకే ఆ సినిమా తీయమని చెబుతున్నాం. ప్యాకేజీ పనివాడు.. (కింద) ఊడిగం స్టార్‌ అనే సినిమా తీయమంటున్నాం. నీ పిచ్చి అభిమానులు కొందరు ఉంటారు కాబట్టి, అది ఒకటి, రెండు రోజులు ఆడుతుంది కాబట్టి.. అలాంటి సినిమా తీసుకోమని చెబుతున్నాం.

దాన్ని సినిమాలో పెట్టండి:
ఇదే జనసేన పార్టీకి చెందిన ఒక వ్యక్తి గతంలో కేసు వేశాడు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, కరకట్ట మీద ఇసుక దోపిడి చేస్తున్నారని కేసు వేస్తే.. ఎన్జీటీ రూ.100 కోట్ల ఫైన్‌ వేసింది. దాన్ని సినిమాలో పెట్టమనండి. ఎందుకంటే అది చేసింది పవన్‌కళ్యాణ్‌ దత్త తండ్రి.  దత్త కొడుకు, దత్త తండ్రి చేసిన అవినీతిని సినిమాలో పెడితే, బాగా చూస్తారు.

చంద్రబాబు పెత్తందార్ల వర్గం:
మేము పేదలకు నేరుగా రెండు లక్షల కోట్లు బదిలీ చేస్తే, మేము వారిపై దాడి చేసినట్లా? ఈరోజు కూడా చూశారు. పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కోర్టుకు వెళ్లింది ఎవరు? పేదలకు ఇంగ్లిష్‌ మీడియమ్‌లో బోధిస్తామంటే అడ్డుకున్న ప్రయత్నం చేసిందెవరు? పేదలు బాగు పడొద్దు. కార్పొరేట్లకే మేలు జరగాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు. కానీ మా నాయకుడు పేదల పక్షపాతి. వారి కోసం ఆయన ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబు పెత్తందార్ల వర్గం అయితే, జగన్‌ నిరుపేదల పక్షపాతి. జగన్‌ ఎప్పుడూ ఒకే మాట చెబుతారు. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలే తనను నడిపిస్తున్నాయని. అందుకే 2024 ఎన్నికల్లో కూడా మాదే విజయం.

ఆధారాలు ఉంటే చూపొచ్చు కదా?:
నాలుగేళ్లుగా మాపై నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మీ చేతిలో ఛానళ్లు ఉన్నాయి. పేపర్లు ఉన్నాయి. ఎక్కడైనా అక్రమ మైనింగ్‌ జరిగితే చూపించండి. అంతే కానీ, అదే పనిగా మాపై బురద చల్లడం ఎందుకు?. అందుకే మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలని కారుమూరి వెంకట్‌రెడ్డి సవాల్‌ చేశారు.

LEAVE A RESPONSE