ఈ నిత్య విద్యార్థి కుతూహలంగా.. మానవ శ్రేయస్సు కోసం నిశితంగా చూస్తూ నేర్చుకొంటున్నాడు.
ప్రపంచం ప్రసంగాలకు పరిమితమవుతుంది – చంద్రబాబు నాయుడు కార్యాచరణతో చరిత్ర సృష్టిస్తారు!
పర్యావరణ పరిరక్షణ గురించి ఈ ప్రపంచంలో మాట్లాడేవారు కోకొల్లలు. కానీ, ఆ మాటలను ఆచరణలో చూపించి, భవిష్యత్తుకు బాటలు వేసే నిజమైన నాయకులు అరుదు. చంద్రబాబు నాయుడు ఆ కోవకే చెందిన అరుదైన నాయకుడు. ఆయన దూరదృష్టి, అంకితభావం, అకుంఠిత దీక్షకు అద్దం పడుతోంది గ్రీన్ హైడ్రోజన్ రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న ప్రగతి!
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా – భవిష్యత్తు ఇంధనానికి బంగారు బాట!
పెట్రోల్ కాలుష్యానికి దారి తీస్తే, గ్రీన్ హైడ్రోజన్ స్వచ్ఛమైన వెలుగును పంచుతుంది. ఇది కేవలం ఒక ఇంధనం కాదు, సామాన్యుడి జీవితాన్ని మెరుగుపరిచే సరికొత్త ఆశ. ఇది భవిష్యత్తుకు మార్గదర్శకం!
గ్రీన్ హైడ్రోజన్ అంటే: కాలుష్యం లేని అపరిమిత శక్తి వనరు.
ఉత్పత్తి విధానం: నీటిని విద్యుత్ ద్వారా విడగొట్టి తయారు చేస్తారు.
మండినప్పుడు నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది, ఎటువంటి కాలుష్యం ఉండదు.
వాహనాలు, పరిశ్రమలు, గృహాలకు అవసరమైన విద్యుత్ – అన్నీ ఈ స్వచ్ఛమైన ఇంధనంతోనే సాధ్యం.
అమరావతి సమ్మిట్ – మాటల కంటే ముందే చేతల్లో!
SRM యూనివర్సిటీలో ఈ రోజు గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ కేవలం ఒక వేదిక మాత్రమే కాదు. అంతకు ముందే, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించింది
₹51,000 కోట్లకు పైగా ఒప్పందాలు: గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి భారీ పెట్టుబడులను ఆకర్షించి, దేశంలోనే తన కార్యాచరణకు నిదర్శనంగా నిలిచారు.
ప్రపంచ స్థాయి CEOలు, MDలతో ముఖాముఖిగా చర్చలు జరిపి, పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంపొందించారు.
“తక్కువ ఖర్చుతో సామాన్యుడికి అందుబాటులోకి రావాలి” అని పదే పదే ముఖ్యమంత్రిగా స్పష్టం చేస్తూ, ప్రజల ప్రయోజనాల పట్ల తన నిబద్ధతను చాటారు.
ఆవిష్కరణలకు ఆహ్వానం: “ఆంధ్రప్రదేశ్‌లో పరిశోధనలు చేయండి, పెట్టుబడులు పెట్టండి” అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలకు పిలుపునిచ్చారు.
అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్: రెండు రోజుల్లో విడుదల కానున్న ఈ డిక్లరేషన్, ఏడాది తర్వాత అమలుపై సమీక్ష చేస్తానని వారికో లక్ష్యం నిర్దేశించారు.
ఆయన విజన్ – కేవలం మాటలు కాదు, మైలురాళ్లు!
చంద్రబాబు నాయుడు పాలన ఎల్లప్పుడూ దూరదృష్టితో కూడుకున్నది:
1999 – దేశంలోనే మొదటిసారి విద్యుత్ సంస్కరణలు తెచ్చారు. ఓటమి వస్తుంది అని హెచ్చరించినా వె రవలేదు.
2014 – సౌర, పవన విద్యుత్ ప్రాధాన్యం: రెన్యువబుల్ ఎనర్జీకి అగ్ర తాంబూలం ఇచ్చి భవిష్యత్తుకు బాటలు వేశారు.
2025 – గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, క్వాంటం వ్యాలీ:
ఇది కేవలం ఒక లక్ష్యం కాదు, ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయికి చేర్చే ఆయన దృఢ సంకల్పం!
ఆయన ఆకాంక్ష:
పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకుని, తక్కువ ఖర్చుతో స్వచ్ఛమైన విద్యుత్‌ను ప్రజలకు అందించాలి. ప్రతి ఆవిష్కరణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలి. ఈ లక్ష్యంతో కొత్త పరిశోధనలు, పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ముందుండాలి.
ఆంధ్రప్రదేశ్ – గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా రూపుదిద్దుకుంటోంది!
విశాఖలో NTPC గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్: దేశంలోనే అతిపెద్ద ప్రణాళికల్లో ఒకటి.
కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి: రసాయన పరిశ్రమలకు స్వచ్ఛమైన ప్రత్యామ్నాయం.
నెల్లూరులో యమ్నా సంస్థ ₹16,000 కోట్లతో ప్లాంట్: రాష్ట్ర ఆర్థిక వృద్ధికి మరో మైలురాయి.
మచిలీపట్నంలో KSAH Infra ₹35,000 కోట్లతో ప్లాంట్: భారీ పెట్టుబడులకు నిదర్శనం.
160 GW లక్ష్యం – 3 GW ఎలక్ట్రోలైజర్
సామర్థ్యం: ఆంధ్రప్రదేశ్ ఈ రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉంది.
గ్రీన్ హైడ్రోజన్ ఒక ‘గేమ్ ఛేంజర్’ అని చంద్రబాబు నాయుడు గట్టిగా నమ్ముతున్నారు. ఆయన నమ్మకమే మన ఉజ్వల భవిష్యత్తుకు పునాది అనేది కళ్ళ ముందు కనిపించే చారిత్రక సత్యం!