Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

– విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బిల్లులు చెల్లించాలి
– విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు రూ.20 వేల కోట్ల బకాయి

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రకారం బిల్లులు చెల్లించాలని హైకోర్టు సూచించింది. ఆరు వారాల్లో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. బిల్లులను తగ్గించి ఇవ్వాలన్న సింగిల్ జడ్జి తీర్పును హైకోర్టు కొట్టేవేసింది. పీపీఏలకు వ్యతిరేకంగా ఏపీఈఆర్సీలో ప్రభుత్వం వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. స్టేట్‌లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్ వేసిన పిటీషన్లను కూడా కొట్టేసింది. విద్యుత్ బకాయిలు చెల్లించకుండా ఏపీ ప్రభుత్వం జాప్యం చేసింది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సుమారు రూ.20 వేల కోట్లను ఏపీ బకాయిలు పడింది.

LEAVE A RESPONSE