Suryaa.co.in

Telangana

బజరంగ్ దళ్ రాష్ట్ర వ్యాప్త ఆందోళన

– బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివరాములు

రాష్ట్రంలో జరుగుతున్న హిందూ వ్యతిరేక శక్తులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పైగా పోలీసులే ముస్లింలను రెచ్చగొట్టి హిందువుల పైకి ఉసిగొలుపుతున్నారు. ప్రశాంతమైన భాగ్యనగరాన్ని అల్లర్లతో అట్టుడికించే కుట్ర సాగుతోంది. దీనిని విశ్వహిందూ పరిషత్ పూర్తిగా ఖండిస్తోంది. అందుకు నిరసనగా బజరంగ్ దళ్ ఆందోళనకు సిద్ధమైంది. సోమవారం(29-08-2022)తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిస్తోంది.

పాత నగరంలో దాదాపు 100 మంది నేరస్తులను పోలీస్ స్టేషన్ ల నుంచి తీసుకువెళ్లిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పై వెంటనే చర్యలు చేపట్టాలి.అల్లర్లకు పాల్పడిన యువకులపై చట్ట రీత్యా కేసులు నమోదు చేయాలి.

“ముస్లింలు అమాయకులు.. హిందువులే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు” అని ముస్లింలను రెచ్చగొట్టిన సౌత్ జోన్ డీసీపీ & అదనపు డిసిపిలను వెంటనే సస్పెండ్ చేయాలి.గోషామహల్ ప్రాంతాన్ని తగలబెడతామన్న రషీద్ ఖాన్ మరియు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ లను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి.

వినాయక నవరాత్రుల ముందు హిందూ ద్రోహి మునావర్ షోకు అనుమతించి, భాగ్యనగర్ లో చిచ్చుపెట్టిన కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి.

ఇదే విషయాలపై గత నాలుగు రోజుల క్రితం డిజిపి గారిని కలిసి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం హిందూ వ్యతిరేక చర్యల్లో భాగంగానే మేం భావిస్తున్నాము. కాబట్టి హిందూ సమాజమంతా ఒక్కటిగా నిలిచి, హిందూ వ్యతిరేక ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివరాములు పిలుపునిచ్చారు. కార్యకర్తలంతా పాల్గొని హిందూ శక్తిని చాటాలని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE