Suryaa.co.in

Andhra Pradesh

రూపాయి తియ్యడు… కేంద్రాన్ని కోరాడు!

– మాజీ సీఎం జగన్ వైఖరిపై బాలకోటయ్య వ్యాఖ్య

అమరావతి, మహానాడు: బుడమేరు ముంపునకు విజయవాడ ప్రజలు లక్షలాది మంది నిరాశ్రయులైనా, కృష్ణా నది వరద ప్రవాహానికి వేలాది ఎకరాల్లో పంట పొలాలు మునిగినా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయక పోవటం పట్ల అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. బెజవాడ ముంపు కుటుంబాలకు రాష్ట్రాల సరిహద్దులు దాటి మానవీయ కోణంలో సినిమా స్టార్ట్ లు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, ఆధ్యాత్మిక సంఘాలు, సేవా సంస్థలు, ఎన్.ఆర్.ఐలు అందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి, బాధితులకు స్వయంగా విరాళాలు అందజేస్తున్నారన్నారు.

వైసీపీ పార్టీ అధ్యక్షునిగా, మాజీ ముఖ్యమంత్రిగా జగన్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోటి రూపాయలు ప్రకటించి, వాటిని ఎలా ఇవ్వాలో పార్టీలో చర్చించి ఇస్తామని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. తాను రూపాయి ఇవ్వకపోగా, కనీసం ప్రతి పక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విపత్తుకు సంబంధించి ఆదుకోవాలని అడగనూ లేదు, లేఖ కూడా రాయనూ లేదని ఆరోపించారు. నీళ్ళల్లో మునిగిపోతున్న వాళ్ళను, ప్రమాదానికి గురైన వాళ్ళను ముందుగా ఆదుకోవాలన్న కనీస ధర్మం తెలియదా? అని ప్రశ్నించారు. ఇలాంటి వైఖరితో ముంపు బాధితులను పరామర్శించినా, పరామర్శించకపోయినా ఒక్కటే అని అభిప్రాయపడ్డారు. 151 సీట్లు ఉన్న పార్టీ 11 సీట్లు వచ్చినా ‘ఏంరా బాలరాజు’ అన్నట్లు మారకపోతే ఎలా? ప్రశ్నించారు. రాజ్యసభ లో 11 మంది, లోక్ సభ లో 4 ఉండి లాభమేంటి? అంటూ ఎద్దేవా చేశారు.

LEAVE A RESPONSE