Suryaa.co.in

Andhra Pradesh

గలీజ్ గాళ్ళను పదవులు నుంచి తప్పించండి

– ఎంపీ గోరంట్ల మాధవ్ చే తక్షణం రాజీనామా చేయించండి
– మాజీమంత్రి అవంతి శ్రీనివాస్, ప్రసుత మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ అనంత బాబుల రాజీనామాలు కోరండి
– అప్పటివరకు మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు లేదు
– ముఖ్యమంత్రికి బహుజన జెఎసి బాలకోటయ్య బహిరంగ లేఖ

ముఖ్యమంత్రి గారు…నేను ఉన్నాను, నేను విన్నాను, నేను కన్నాను అని మీరు పదేపదే చెప్పే ఈ మూడు మాటలను మీకే గుర్తుకు తెస్తున్న. మీరు ఉన్నారని, వింటున్నారని, కంటున్నారని రాష్ట్రంలో ప్రజలు భావించడం లేదు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు గురించి దేవుడెరుగు ….మీ పార్టీలో ప్రజా పదవిలో ఉన్న గలీజ్ పనులు చేస్తున్న గలీజు గాళ్ళను కూడా పదవుల నుంచి ఎందుకు తప్పించలేకపోతున్నారు? మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గారు ఒక గంటలో పంపించేస్తాను.. వచ్చేయ్ అంటారు ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు గారు అర్ధగంటలో ఎలా పంపిస్తాను… అని అంటారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి ఎమ్మెల్సీ అనంత బాబు డోర్ డెలివరీ చేస్తారు.

తాజాగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గలీజ్ వీడియోని తీసి ఏపీనే ‘షేక్ ‘ చేశాడు. ఇన్ని వింతలు, విడ్డూరాలు జరుగుతున్న మీకు వినిపించడం లేదా? మీకు కనిపించడం లేదా? ఇలాంటి వారిని మీ పార్టీలో ఎలా కొనసాగించగలుగుతున్నారు? వీరు లేకపోతే వైసిపి పార్టీకి మనుగడ లేదా? ప్రజాస్వామ్య వ్యవస్థలకు, ప్రజాప్రతినిధుల పదవులకు గౌరవం తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నవారు ఇలా పోకిరిగాళ్ళుగా వ్యవహరించటం ప్రజాస్వామ్యాన్ని తలవొంపులు కావా? చట్టసభలను, అమూల్యమైన ప్రజాస్వామ్య విలువలను గౌరవించడానికి చిహ్నంగా వీరందరినీ వెంటనే పదవి నుంచి తొలగించండి. మహిళల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతకు సమాధానం చెప్పండి.

ఇట్లు
పోతుల బాలకోటయ్య
అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు

LEAVE A RESPONSE