Suryaa.co.in

Andhra Pradesh

మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థిగా బాలశౌరి

మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం బాలశౌరి పేరును అధికారికంగా ప్రకటించింది. అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి ఆశావహులు అధికంగా ఉండటంతో అక్కడ సర్వే చేస్తున్నామని, సర్వే రిపోర్టు ఆధారంగా అక్కడ అభ్యర్థిని ప్రకటిస్తామని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE