Suryaa.co.in

Andhra Pradesh

బాలినేని సకుటుంబ, సపరివార సమేత అవినీతి రూ.1734 కోట్లు

• మంత్రికారులో రూ.5 కోట్ల హావాలాసొమ్ము దొరికినా జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఏమీ అనలేదు
• జగన్ రెడ్డి జేట్యాక్స్…మంత్రుల వ్యక్తిగత ట్యాక్స్ లతో జనంబతుకులు రోడ్డునపడ్డాయి.
– టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి

రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకివచ్చిన జగన్మోహన్ రెడ్డి, ప్రజలిచ్చిన అధికారం తో పదితరాలకుసరిపడా దోపిడీచేస్తూ, తననుముఖ్యమంత్రిని చేసినవారిని సైతం పన్నులు, విద్యుత్ ఛార్జీలతో పీల్చిపిప్పిచేస్తున్నాడని టీడీపీఎమ్మెల్యే డోలాబాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు.
శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో జగన్ రెడ్డి కేబినెట్ లో అవినీతి బాహుబలిగా ప్రఖ్యాతిపొందిన బాలినేని గురించి విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాసేవ విస్మరించి, వారి స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు. జగన్ రెడ్డి జేట్యాక్స్… మంత్రులేమో వారి సొంతట్యాక్స్ లతో అవినీతిలో మునిగితేలుతూ, వ్యక్తిగతఆస్తులు పెంచుకోవడానికి, అక్రమాలుచేయడంలో మునిగి తేలుతున్నారు. రెండున్నర సంవత్సరాల వరకు మంత్రి పదవులు ఉంటాయనిచెప్పి దోచుకున్నది చాలలేదని మూడు సంవత్సరాలకు పెంచుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా జగన్ జే-ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తుంటే ఆయన మంత్రులు వారి సొంత ట్యాక్సులతో ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నారు. విద్యుత్ శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి చిన్నమ్మ ఆడపడుచు భర్త. తాను జగన్ బంధువుని అనిచెప్పుకుంటూ ఈ మూడేళ్లలో ప్రజల్ని దారుణంగా దోచుకున్నాడు. తాను ముఖ్యమంత్రికి బంధువునని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అక్రమాలకు తెరలేపారు.

మంత్రిగిరీని అడ్డంపెట్టుకొని ఈ మూడేళ్లలో 1734 కోట్లప్రజలసొమ్ముని పప్పు బెల్లాల్లా మింగిన అవినీతి పందికొక్కు బాలినేని శ్రీనివాసరెడ్డి. మంత్రుల దోపిడీకి సమయం సరిపోదనే ముఖ్యమంత్రి వారిని మూడేళ్లు ఉంచాడు. లెటర్ హెడ్ ల కుంభకోణం మొదలు నేడు రాష్ట్రం అంధకార ఆంధ్రప్రదేశ్ గా మారడానికి బాలినేని అవినీతే కారణం. బాలినేని కారులో రూ.5 కోట్ల హావాలాసొమ్ము పట్టుబడితే పట్టుబడిన కారుపై మంత్రి స్టిక్కర్ ఉన్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి ఆయనపై తీసుకున్న చర్యలు శూన్యం.చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు, 2014కు ముందు రాష్ట్రమంతా అంధకారబంధురమే.

చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక విభజనానంతర రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా, విద్యుత్ కోతలు లేని ఆంధ్రప్రదేశ్ గా మార్చిచూపారు. ఏపీ అంటే నిత్యంవెలుగులువిరజిమ్మే, విద్యుత్ గని అని నిరూపించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికావడంతోనే ఏపీచీకట్లలో మగ్గనుందనే సంకేతాలు వెలువడ్డాయి. ఎందుకుంటే విద్యుత్ రంగానికి సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలు అలాంటివి.
భవిష్యత్తులో ప్రజలపై ఎలాంటి విద్యుత్ ఛార్జీలు వేయబోమని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన జగన్ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిరాగానే గతప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి, కొనుగోళ్లకు సంబంధించి చేసుకున్న పీపీఏ ఒప్పందాలను రద్దుచేశారు. యూనిట్ విద్యుత్ 6రూపాయాలలెక్కన కొనేలా 25 సంవత్సరాలవరకు గతప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంటే, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆ ఒప్పందాలన్నింటినీ రద్దుచేసేశాడు.

తెలుగుదేశం హయాంలో 6 రూపాయలకు కొన్న యూనిట్ విద్యుత్ ని ఇప్పుడు 22 రూపాయలకు కొంటున్నాడు. విద్యుత్ కొనుగోళ్లవెనక బాలినేని, ముఖ్యమంత్రి ఇద్దరూకలిసి పెద్దకుట్రకే పాల్పడుతున్నారు. విద్యుత్ అమ్మే కంపెనీలనుంచి, కమీషన్లు దండుకుంటూ, విద్యుత్ కొనుగోళ్లకు వెచ్చిస్తున్న సొమ్మంతా ముఖ్యమంత్రి, మంత్రి బాలినేని స్వాహాచేస్తున్నారు. ఆ విధంగా రూ.495కోట్లవరకు బాలినేని విద్యుత్ సంస్థలనుంచి కాజేశాడు.

ప్రకాశం జిల్లాలో గ్రానైట్ కంపెనీలు విపరీతంగా ఉన్నాయి. తన అక్రమఆదాయానికి బాలినేని గ్రానైట్ ఫ్యాక్టరీలను కూడావదల్లేదు. సదరు ఫ్యాక్టరీల నుంచి సుమారు రూ. 9,500 కోట్ల బీ-ట్యాక్స్ రూపంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ మూడేళ్లలో వసూలు చేసుకున్నారు. ఇందులో గ్రానైట్ డంపింగ్ యార్డు నుంచి రూ.300 కోట్లు, గ్రానైట్ వ్యాపారుల నుంచి బీ-ట్యాక్స్ రూపంలో రూ.50 వేల నుంచి లక్షరూపాయల వరకు తన అనుచరుల ద్వారా వసూళ్లు చేయిస్తున్నారు. మైనింగ్ డిపార్టుమెంట్ నుంచి రూ.905 కోట్లు అక్రమార్జనను శ్రీనివాసరెడ్డి కొల్లగొట్టాడు.

పర్చూరు, చీరాల ఒంగోలు, సంతనూతలపాడు, కొండేపి ప్రాంతాలలో ఎంచక్కా ఇసుకనుకూడా వదలకుండా తనఅనుచరులు, బినామీలతో సుమారు వంద కోట్ల రూపాయలవరకు ఇసుకమాఫియా చేశారు. కొండేపి నియోజకవర్గంలోని కొణజేడు, ఎర్రజెర్ల ప్రాంతాల నుంచి సుమారు 40 కోట్ల రూపాయల పైచిలుకు విలువైన గ్రావెల్ ను అమ్ముకున్నారు. భూకబ్జాలతో దాదాపు 187 కోట్ల రూపాయల్ని బాలినేని వెనకేసుకున్నాడు.

ఒంగోలులోని రంగుల ఫ్యాక్టరీ దగ్గర 4 ఎకరాలు, మంగమూరు డొంకలోని 6 ఎకరాలు, ఉడ్ కాంప్లెక్స్ దగ్గర 3 ఎకరాలతోపాటు డీ.కే. పట్టాలద్వారా వందలకోట్ల విలువైన భూమిని బాలినేని ఆక్రమించుకున్నాడు. ఎలక్ర్టిసిటీ సబ్ స్టేషన్లు, పవర్ ఆఫీసులు సందర్శించడం.. ప్రజలకు సక్రమంగా విద్యుత్ సరఫరా జరుగుతోందా..లేదా చూడటం అనేది బాలినేనికి తెలియదు. తనకుటుంబసభ్యుల ద్వారా కూడా ప్రజలసొమ్ముని దోచుకున్న మంత్రిగా బాలినేని చరిత్రలోనిలిచిపోతాడు.

తన మంత్రి పదవి పోయిందని ఇంకో దళిత మంత్రిని కూడా పదవినుంచి తీసేయాలని పట్టుబట్టే నీచస్థితికి బాలినేని దిగజారాడు.మంత్రి పదవిని అడ్డంపెట్టుకొని నిత్యం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ బాలినేని, తనవిధులను సక్రమంగా నిర్వర్తించకుండా, నిధులుపోగేసుకోవడంపైనే శ్రద్ధపెట్టాడు. నేడు రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు అమలుకావడానికి, అంతిమంగా రాష్ట్రం చీకట్లలో మగ్గడానికి బాలినేని ఈ మూడేళ్లలో చేసి అవినీతే కారణం.

ఇప్పుడు రాష్ట్రంలో 4 గంటలనుంచి 6 గంటలపాటు పీక్ అవర్స్ లో కరెంటు కట్ చేస్తున్నారు. పెంచిన విద్యుత్ చార్జీలు ప్రజలకు తెలియకుండా ఉండాలనే ఉద్దేశంతో కరెంటు కోతల తో తక్కువచూపిస్తున్నారు. ప్రజలంతా ఇప్పటికే ప్రభుత్వ తప్పుడు విధానాలను గమనిస్తున్నారు. ఫ్యాను గుర్తుకు ఓటేసినందుకు ఫ్యాను స్విచ్ ను పట్టుకోవాలంటే భయపడే పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, బాలినేని ప్రజలకు కల్పించారు. జగన్ రెడ్డి దోపిడీ, బాలినేని లాంటి మంత్రుల అవినీతితో విసిగివేసారిన ప్రజలు రాష్ట్రంలో ఫ్యాను రెక్కలు విరిచేయాలనే నిర్ణయానికి వచ్చారు.

బాలినేని లాంటి అవినీతి బాహుబలుల అవినీతి భాగోతాన్ని ప్రజలందరూ ఇప్పటికే గుర్తించారు. పదవులు పోగొట్టుకొని ఇంటికిపరిమితమైన మంత్రులబాటలో నడవకుండా, ఇప్పుడు కొత్తగా వచ్చే మంత్రులైనా పరిపాలన మీద దృష్టి పెడితే మంచిదని సూచిస్తున్నాం. కాదు..కూడదు..వారు అంతతిన్నారు..మేం అంతకు పదింతలు తింటామంటే కొత్తగావచ్చే మంత్రులచేసే అవినీతికి వారే భవిష్యత్ లోతగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.

పలాస నియోజకవర్గంనుంచి మంత్రిగాఉన్నవ్యక్తి మాట్లాడుతూ, 151 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని ఆలోచనలో జగన్ ఉన్నారు కానీ ఇవ్వలేకపోతున్నారు అని చెప్పుకుంటున్నారు. అంటే 151 మంది వైసీపీ కాలకేయులు రాష్ట్రంపై పడి దోచుకుంటుంటే చూడాలన్నది ముఖ్యమంత్రి కోరికా?

LEAVE A RESPONSE